ఆర్టీపీపీలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఆక్టోపస్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్‌ను ఆక్టోపస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) ఆదేశాల మేరకు , సోమ, మంగళవారాలలో ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ రాజారెడ్డి ఆధ్వర్యంలో రాంబాబు తమ కమాండోస్ బృందంతో నిర్వహించారు. ప్లాంట్‌లోకి ఉగ్రవాదులు చొరబడి ఉద్యోగులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపినప్పుడు వారిని కాపాడిన తీరును డ్రిల్‌లో ప్రదర్శించారు. ఈ డ్రిల్‌లో ఆర్టీపీపీ సీఈ గౌరీపతి, సీఐ మహమ్మద్‌రఫీ, ఆర్టీపీపీ ఎస్‌ఈ సోమశేఖర్‌రెడ్డి, క్రిష్ణమోహన్, ఆర్టీపీపీ ఫ్యాక్టరీ మేనేజర్ సిద్ధయ్య, అసిస్టెంట్ కమాండెంట్ క్రిష్ణయ్య, ఫైర్ ఆఫీసర్ రఘునాథ్, ఎస్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ రమేష్, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ నారాయణ యాదవ్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శివరాముడు తదితరులు పాల్గొన్నారు.


