ఎర్రగుంట్లలో రేషన్ రగడ
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మున్సిపల్ పరిధిలోని కార్డుదారులకు రేషన్ ఇవ్వకపోవడంతో ఎండీయూ వాహనాన్ని అడ్డుకొని మా బియ్యం మాకు ఇవ్వాలని ముస్లిం మైనార్టీ మహిళలు శుక్రవారం ఆందోళనకు దిగారు. సుమారు మూడు గంటల పాటు డీలర్లు, ఎండీయూ వాహన ఆపరేటర్, కార్డుదారులకు మధ్య రగడ జరిగింది. డీలర్లే రేషన్‌ను అమ్ముకుంటున్నారని ఎండీయూ వాహన ఆపరేటర్ సులేమాన్ ప్రజలకు మీడియాకు బహిర్గతం చేశారు. అలాగే ఆపరేటర్లే చౌకదుకాణం నుంచి రేషన్ తీసుకుని పక్కదారి పట్టిస్తున్నారని డీలర్లు ఆరోపించారు. పట్టణంలోని ఎర్రచేన్, శివ టైలర్ వీధిలలోకి రేషన్ పంపిణీ చేయడానికి 6వ షాపు ఎండీయూ వాహనంలో రేషన్ తీసుకుని వెళుతుండగా మార్గ మధ్యలో మాకు రేషన్ ఇవ్వలేదంటూ 9వ షాపునకు చెందిన కార్డుదారులు మహిళలు వాహనాన్ని అడ్డుకన్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతు మా 9వ షాపు డీలర్ నెలా నెలా రేషన్ సక్రంగా ఇవ్వలేదని, తూకాలలో కూడా తక్కువగా ఇస్తున్నారని మండ్డిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ తీసుకోవాలంటే నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు.
పరస్పర వాగ్వాదం.. ఆరోపణలు :
డీలర్లే బియ్యం అమ్ముకుంటున్నారని ఎండీయూ ఆపరేటర్, ఎండీయూ ఆపరేటర్లే రేషన్ తీసుకుని వెళ్లి పక్కదారి పట్టిస్తున్నారని డీలర్లు ఆరోపణలు చేసుకున్నారు. ఇలా ఇరువురు పరస్పర ఆరోపణలతో గొడవ పడ్డారు. నేను అమ్ముకుంటున్న నిరూపిస్తూ నా వాహనం కాల్చి వేస్తాను అని ఆపరేటర్ సులేమాన్ సవాల్ విసిరారు. డీలర్లు మాకు బియ్యం తక్కువగా ఇస్తున్నారని, కార్డుదారులకు సుమారు 5 కిలోలు తక్కువ ఇస్తే ఎలా తీసుకుంటారన్నారు. మాకు తూకాలు కచ్చితంగా ఇస్తే మేం కూడా బియ్యం పంపిణీ చేయడానికి ఇబ్బంది ఉండదన్నారు.
ఎండీయూ వాహనాన్ని అడ్డుకున్న
మైనార్టీ మహిళలు
డీలర్లు, ఎండీయూ ఆపరేటర్‌కు
మధ్య వాగ్వాదం
కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ సక్రమంగా అందలేదని కార్డుదారుల ఆగ్రహం
ఎర్రగుంట్లలో రేషన్ రగడ


