చాపాడు : మండల కేంద్రమైన చాపాడులోని నాలుగు రోడ్ల కూడలిలో శనివారం సాయంత్రం ఆగి ఉన్న మైదుకూరు తహసీల్దారు రాజసింహా నరేంద్ర కారును వెనక వైపున వేగంగా వస్తున్న బైక్ ఢీ కొంది. ఈ ప్రమాదంలో మైదుకూరుకు చెందిన మాబువల్లీ, అమీర్ బాషా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మైదుకూరు మండల తహసీల్దారు రాజసింహా నరేంద్ర ఒంటిమిట్ట లోని సీఎం చంద్రబాబు పర్యటన కార్యక్రమాన్ని ముగించుకుని ప్రొద్దుటూరుకు వెళుతూ చాపాడు వద్ద కారు ఆపుకుని ఉన్నారు. ఇదే సమయంలో ఆర్టీసీ బస్సును క్రాస్ చేస్తూ వేగంగా వెళుతున్న బైక్ ప్రమాదశాత్తు కారును ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైక్‌లో ఉన్న మాబువల్లీ, అమీర్ బాషాలు తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనం అందుబాటులో లేకపోవటంతో తహసీల్దారు తన కారులోనే గాయపడిన వ్యక్తులను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇరువురికి గాయాలు


