నేటి ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ రద్దు
కడప అర్బన్: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జరిగే ‘ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ను‘ సోమవారం రద్దు చేస్తున్నట్లు ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
సీనియారిటి జాబితాను సరిచూసుకోండి
కడప ఎడ్యుకేషన్: రాయలసీమ జోన్ పరిధి లోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూల్ ఉమ్మడి జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(టీఐఎస్)లోని సీనియారిటి జాబితాను పరిశీలించుకోవాలని పాఠశాల విద్య ఆర్‌జేడీ కాగిత శ్యాముల్ సూచించారు. ఉపాధ్యాయులు తమ టీఐఎస్ ప్రొఫైల్‌కి లాగిన అయి వ్యక్తిగత వివరాలను జాగ్రత్తగా పరిశీలించి ఓటీసీ ద్వారా ధ్రువీకరించాల్సి ఉంటుందన్నారు. టీఐఎస్ లోని సీనియారిటి జాబితాలో ఏవైనా పొరపాట్లు ఉంటే నిర్దేశిత గడువులోపల సంబంధిత జిల్లా విద్యాశాఖధికారి కార్యాలయంలో అభ్యంతరాలను తెలియజేయాలని సూచించారు.
జీఐపీకేఎల్‌లో రాయచోటి వాసి
రాయచోటి జగదాంబసెంటర్: రాయచోటి పట్టణం బోస్‌నగర్‌కు చెందిన అలీ అహమ్మద్(22) ఈ నెల 18, 19, 20వ తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించే కబడ్డీ జీఐపీకేఎల్(గ్లోబల్ ఇండియా ప్రవాసి కబడ్డీ లీగ్)లో లయన్స్ తమిళ్ టీం తరఫున ఆడనున్నారు. ఈయన రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పట్టా పొందారు. అలీఅహమ్మద్ చిన్ననాటి నుంచే కబడ్డీ ఆట ఆడాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లేవాడని అతని తండ్రి షబ్బీర్ తెలిపారు. విద్యతోపాటు క్రీడా రంగంలో రాణించిన ఆ యువకుడికి రాయచోటి, జిల్లా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. రానున్న రోజులలో అంతర్జాతీయ క్రీడలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ ప్రాంతానికి, జిల్లాకు, రాష్ట్రానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు.
సమస్యాత్మక అటవీ
ప్రాంతాల్లో తనిఖీలు
సిద్దవటం: సిద్దవటం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని గొల్లపల్లె, రోళ్లబోడు, సిద్దవటం బీట్లలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కడప డీఎఫ్‌ఓ వినీత్‌కుమార్ ఆదివారం తనిఖీలు చేపట్టారు. అనంతరం రోళ్లబోడు బేస్ క్యాంప్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ సంపద తరలిపోకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో తరచూ తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు. ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండి వాహనాలు తనిఖీలు చేయాలన్నారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల పట్ల వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి తొట్లలో తాగునీరు నింపాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దవటం రేంజర్ బి.కళావతి, డీఆర్‌ఓ ఓబులేష్, సిబ్బంది పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో
మట్టల ఆదివారం
కడప కల్చరల్: జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారాన్ని జరుపుకున్నారు. ఏసుక్రీస్తు ఆత్మబలిదానాన్ని సూచిస్తూ దీనిని నిర్వహించారు. ఇందులో భాగంగా గురువుల ఆధ్వర్యంలో విశేష ప్రార్థనలు నిర్వహించారు. కడప, ప్రొద్దుటూరు, బద్వేలు, పులివెందుల.. తదితర అన్ని ప్రాంతాల్లో చర్చిల్లో సామూహిక ప్రార్థనలు జరిపారు. ఈ సందర్బంగా విశ్వాసులంతా చిన్నా పెద్ద సహితంగా ఈతమట్టలు చేతబూని చర్చి చుట్టూ క్రీస్తు ధ్యానం చేస్తూ ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం చర్చిలో ప్రార్థనలు, వాక్య పరిచర్య చేయించారు. త్వరలో తపస్కాలం ముగియనుందని, క్రీస్తు త్యాగాన్ని సూచించే గుడ్‌ఫ్రైడే, ఈస్టర్ సండేలు రానున్నట్లు గుర్తు చేశారు.
నేటి ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ రద్దు
నేటి ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ రద్దు


