చేబ్రోలు కిరణ్‌పై చర్యలు తీసుకోవాలి
కడప అర్బన్ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతమ్మలను వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడిన చేబ్రోలు కిరణ్‌కుమార్‌పై, అతనిని ఇంటర్వ్యూ చేసిన యాంకర్‌పై చర్యలు తీసుకోవాలని రెడ్డి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రపురెడ్డి సురేంద్ర రెడ్డి, కడప జిల్లా మహిళా అధ్యక్షురాలు సునీతా రెడ్డి కోరారు. ఈమేరకు కడప వన్ టౌన్ సీఐ బి. రామకృష్ణ, ఎస్‌ఐ అమర్‌నాథ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.
కారు ఢీకొని బాలుడికి గాయాలు
బద్వేలు అర్బన్ : పట్టణంలోని నెల్లూరు రోడ్డు నుంచి శివాలయంకు వెళ్లే రోడ్డులో ఆదివారం కారు ఢీకొన్న ఘటనలో ఓ బాలుడికి గాయాలయ్యాయి. పట్టణంలోని గౌరీశంకర్ నగర్‌కు చెందిన రాజు, క్రిష్ణవేణిల కుమారుడైన గుర్రాల వెంకటనాగేష్ (11) శివాలయం రోడ్డు నుంచి నెల్లూరు రోడ్డు వైపు వస్తుండగా ప్రొద్దుటూరు నుంచి నెల్లూరు వైపు వెళుతున్న కారు ఢీకొనడంతో ఎడమ కాలు విరిగింది. వెంటనే స్థానికులు బాలుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు.
బీసీల ఆశాజ్యోతి బీపీ మండల్
కడప ఎడ్యుకేషన్ : బీసీల ఆశాజ్యోతి, రిజర్వేషన్ల పితామహుడు, హక్కుల కోసం నిరంతరం శ్రమించిన మహోన్నత వ్యక్తి బీపీ మండల్ అని బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు డి.ఎం. ఓబులేసు యాదవ్ అన్నారు. ఆదివారం కడపలో ఆయన 43వ వర్ధంతిని బీసీ వసతి గృహ విద్యార్థులతో కలసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆయన వర్ధంతి, జయంతిలను రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ నాయకులు వంశీ, వేణు శ్రీను, రాము విద్యార్థులు పాల్గొన్నారు.
చేబ్రోలు కిరణ్‌పై చర్యలు తీసుకోవాలి
చేబ్రోలు కిరణ్‌పై చర్యలు తీసుకోవాలి


