అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం
కడప అర్బన్ : అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది సేవలు అభినందనీయమని జిల్లా శిశు సంక్షేమశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీలక్ష్మి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలను సోమవారం కడప ఫైర్ స్టేషన్‌లో ఘనంగా ప్రారంభించారు. అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. అగ్ని ప్రమాదంలో అమరులైన అగ్నిమాపక వీర జవానులను స్మరించుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ అగ్నిమాపక సిబ్బంది చెప్పే సూచనలు పాటించడం వలన ప్రజలు తమ విలువైన ఆస్తులు, ప్రాణాలు కాపాడుకోవచ్చని సూచించారు. జిల్లా విపత్తు స్పందన, అగ్నిమాపక అధికారి ఐ. ధర్మారావు, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి, కడప ఫైర్ స్టేషన్ అధికారి బసివిరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కడప కేంద్ర కారాగారం జైలర్ అమర్‌బాషా, అగ్నిమాపక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీలక్ష్మి


