
అన్నదాత సమస్యలపై వైఎస్సార్ సీపీ పోరుబాట
● కమిషన్ల కోసమే ప్రైవేటుకు యూరియా
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి.రవీంద్రనాథ్‌రెడ్డి
కడప సెవెన్‌రోడ్స్ : కేంద్రం నుంచి యూరియా రాష్ట్రానికి రాగానే కమీషన్ల కోసం కక్కుర్తిపడి మొత్తం ప్రైవేటుకే ఇచ్చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శించారు. దీంతో బస్తా రూ. 270లకు అమ్మా ల్సిన యూరియా బ్లాక్‌లో రూ. 800–1000లకు అమ్ముతున్నారని పేర్కొన్నారు. బ్లాక్ మార్కెటీర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై మంగళవారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ర్యాలీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం ఆ పార్టీ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ ముత్యా ల రామగోవిందరెడ్డి, వైస్ చైర్మన్ బాలయ్య, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎరువుల సమస్యపై ఆందోళనలు చేపట్టాలని తమ పార్టీ పిలుపునివ్వడంతో రైతులను మభ్య పెట్టేందుకు అధికారులు టోకన్లు పంపిణీ చేస్తున్నారని రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. తొలుతే ప్రణాళికబద్దంగా ప్రభుత్వం వ్యవహరించి ఉంటే యూరియా కొరత తలెత్తేది కాదన్నారు. యూరియాకోసం రైతులు సొసైటీల ఎదుట క్యూలు కడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెంనాయుడు హేళనగా మాట్లాడటం దారుణమన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్య, వైద్యానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారన్నారు. కరోనా సమయంలోనూ రైతులను ఆదుకున్న ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానిదేనన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు కొండూరు అజయ్‌కుమార్‌రెడ్డి, వీఎన్ పల్లె, చెన్నూరు ఎంపీపీలు పాల్గొన్నారు.