రిలయన్స్ జియో 90 రోజుల కాల పరిమితి తీరిన తర్వాత కూడా ఉచిత సేవలు కొనసాగించేందుకు టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) అనుమతించడాన్ని సవాలు చేస్తూ భారతీ ఎయిర్‌టెల్ సంస్థ టెలికం వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. జియో నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ట్రాయ్ ప్రేక్షక పాత్ర వహిస్తోందని పేర్కొంది. ఈ నెల 3 తర్వాత జియో ఉచిత వాయిస్, డేటా సేవలు కొనసాగించకుండా ట్రాయ్ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ఎయిర్‌టెల్ తన 25 పేజీల పిటిషన్‌లో ట్రిబ్యునల్‌ను కోరింది.