చుక్కల్లో ఉన్న బంగారం, వెండి ధరలు కాస్త దిగివచ్చాయి. శనివారం బంగారం ధర రూ. 410, వెండి రూ.550 మేరకు తగ్గాయి. ప్రస్తుతం బులియన్ మార్కెట్ లో పదిగ్రాముల (తులం) బంగారం ధర రూ.26,690 కాగా, కిలో వెండి ధర రూ. 38,000 గా ఉంది. ఆభరణాలు, వెండి నాణేల తయారీ రంగంలో లావాదేవీలు మందకోడిగా జరుగుతుండటం వల్లే ఈ పరిణామం చోటుచేసుకుంది. వడ్డీ రేట్ల పెంపుపై ఫెడరల్ రిజర్వ్ సానుకూల సంకేతాలు ఇవ్వడం కూడా బంగారం ధరల తగ్గుదలకు మరో కారణమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశీయ మార్కెట్ ను ప్రభావితం చేసే సింగపూర్ లోనూ బంగారం ధర 0.5 శాతం, వెండి ధర 0.3 శాతం తగ్గింది.
Published Mon, Mar 30 2015 5:05 PM | Last Updated on Wed, Mar 20 2024 5:15 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement