జీఎస్‌టీ పరిహార చట్టానికి ఓకే | GST Council clears draft compensation law, says FM Arun Jaitley | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 19 2017 7:08 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

జీఎస్‌టీ(వస్తు, సేవల పన్ను) అమలులో భాగంగా మరో ముందడుగు పడింది. రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు ఉద్దేశించిన పరిహార చట్టం ముసాయిదాను శనివారం జీఎస్‌టీ మండలి ఆమోదించింది. మిగిలిన 3 ముసాయిదా చట్టాలు వచ్చే సమావేశంలో ఆమోదం పొందేలా ప్రయ్నతిస్తామని ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. ఉదయ్‌పూర్‌లో మండలి సభ్యులతో భేటీ తర్వాత ఆయన మాట్లాడుతూ... ‘జీఎస్‌టీ అమలుతో ఏ రాష్ట్రాలైనా నష్టపోతే మొదటి ఐదేళ్లలో దానిని భర్తీ చేస్తాం. న్యాయపరమైన అన్ని చిక్కుల్ని అధ్యయనం చేశాకే పరిహార చట్టం ముసాయిదా మండలి ముందుకు వచ్చింది. మండలి ఆమోదించిన మొదటి ముసాయిదా చట్టం ఇదే. ఆమోదం కోసం కేబినెట్‌కు పంపుతాం’ అని చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement