డీమోనిటైజేషన్‌పై చర్చల వివరాలు చెప్పలేం | RBI refuses to disclose minutes of demonetisation meeting | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 26 2016 1:23 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

డీమోనిటైజేషన్‌ను ప్రకటించే ముందు ఆ విషయమై ఆర్‌బీఐ బోర్డులో జరిగిన చర్చల వివరాలను వెల్లడించడానికి రిజర్వ్‌ బ్యాంకు నిరాకరించింది. నవంబర్‌ 8న ప్రధాని రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆర్‌బీఐ జరిపిన చర్చల వివరాలు కావాలంటూ వెంకటేష్‌ నాయక్‌ అనే కార్యకర్త సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద దరఖాస్తు చేశారు. అయితే, సెక్షన్‌ 8(1)ఏ కింద సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశ వివరాలను వెల్లడించలేమంటూ ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement