బ్యాంకింగ్, బ్లూచిప్ రంగ కంపెనీ షేర్లను విదేశీ, రిటైల్ మదుపుదారులు కొనుగోళ్లు జరపడం, 2013-14 సంవత్సరానికి కరెంట్ ఖాతా లోటు (కాడ్) తగ్గినట్టు గణాంకాలు వెల్లడికావడం, ఆర్ధిక రంగానికి సంబంధించిన అంశాల్లో సానుకూలత భారత స్టాక్ మార్కెట్ సూచీలకు కొత్త ఊపు నిచ్చాయి. గత కొద్ది సెషన్లగా పరుగులు పెడుతున్న స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వారాంతాన కూడా అదే ఊపును కొనసాగించాయి. సెన్సెక్స్, నిఫ్టీలు జీవితకాలపు గరిష్టాన్ని నమోదు చేసుకున్నాయి. ప్రధాన సూచీ సెన్సెక్స్ 406 పాయింట్ల లాభంతో 21919 పాయింట్ల వద్ద, నిఫ్టీ 125 పాయింట్ల లాభంతో 6526 పాయింట్ల వద్ద ముగిసాయి. గత కొద్దికాలంగా 6500 మార్కును అధిగమించలేకపోయిన నిఫ్టీ ఈ ట్రేడింగ్ సెషన్ లో తొలిసారి దాటడం గమనార్హం. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో జయప్రకాశ్ అసోసియేట్స్ అత్యధికంగా 9.86 శాతం, డీఎల్ఎఫ్ 9.69, భెల్ 6.63 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 5.99, యాక్సీస్ బ్యాంక్ 5.81 శాతం లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్ 3.60, విప్రో 3.33, ఇన్ఫోసిస్ 2.39, లుపిన్ 1.68. సన్ ఫార్మా 1.40 నష్టాలతో ముగిసాయి.
Published Fri, Mar 7 2014 5:29 PM | Last Updated on Wed, Mar 20 2024 12:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement