‘జర్నలిస్ట్ వినాయకరావు నాపై ఏడాదిలోపు ఓ పుస్తకం రాస్తానన్నారు. కానీ ఫొటోలు, సమగ్ర సమాచారం సేకరించి పుస్తకం రాసేందుకు మూడేళ్లు పట్టింది’’ అన్నారు సూపర్‌స్టార్ కృష్ణ. నటుడిగా ఆయన యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినాయకరావు రచించిన ‘దేవుడులాంటి మనిషి’ పుస్తకావిష్కరణను కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి అధ్యక్షతన లలిత కళా పరిషత్ వారు నిర్వహించారు.