subbarami reddy
-
సుబ్బరామిరెడ్డితో మనసులో మాట
-
‘నోట్ల రద్దు’పై తాజా ఆదేశం
ముంబై: నోట్ల రద్దు నిర్ణయం తర్వాతి పరిస్థితులు, కేంద్రం నిర్ణయం తర్వాత జమ అయిన పాతనోట్ల వివరాలను ఇవ్వాలంటూ పార్లమెంటరీ కమిటీ.. ఆర్బీఐని ఆదేశించింది. నవంబర్ 8 ప్రకటన తర్వాత వ్యవస్థలోకి వచ్చిన నల్లధనం వివరాలూ పొందుపరచాలని సూచించింది. కాంగ్రెస్ ఎంపీ టీ సుబ్బిరామిరెడ్డి నేతృత్వంలోని 15 మంది సభ్యుల కమిటీ బుధవారం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు ఎన్నెస్ విశ్వనాథన్, బీపీ కనుంగోలతో సమావేశమైంది. సీనియర్ బ్యాంకర్లు, ఐఆర్డీఏఐ చైర్మన్ టీఎస్ విజయన్, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులూ పొల్గొన్నారు. ‘నోట్లరద్దు తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితులకు సంబంధించిన అంశాలపై కమిటీ ఆర్బీఐ గవర్నర్లను ప్రశ్నించింది. వ్యవస్థలోకి వచ్చిన రద్దయిన నోట్లు, దొంగనోట్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. నోట్లరద్దు ద్వారా వ్యవస్థలోకి వచ్చిన నల్లధనం ఎంతని కూడా కమిటీ ప్రశ్నించింది’ అని ఓ బ్యాంకు అధికారి తెలిపారు. మోసాలు జరగకుండా వినియోగదారులను కాపాడేందుకు తీసుకుంటున్న భద్రత చర్యలేంటని కూడా ఆర్బీఐని ప్రశ్నించింది. అయితే డిపాజిట్ అయిన నోట్ల లెక్కింపు జరుగుతున్నందున ఇప్పుడే సమాచారం ఇచ్చే పరిస్థితి లేదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు చెప్పినట్లు తెలిసింది. కరెన్సీ కొరత కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏమేం చర్యలు తీసుకుంటున్నారని బ్యాంకర్లను కమిటీ ప్రశ్నించింది. ఈ–బీమా పాలసీలను ఇవ్వటంలో ఐఆర్డీఏఐ నిబంధనలను కమిటీ పరిశీలించింది. -
నా యాభై ఏళ్ల నట ప్రస్థానానికి కారణం వారే
-
నా యాభై ఏళ్ల నట ప్రస్థానానికి కారణం వారే – సూపర్‌స్టార్ కృష్ణ
‘‘జర్నలిస్ట్ వినాయకరావు నాపై ఏడాదిలోపు ఓ పుస్తకం రాస్తానన్నారు. కానీ ఫొటోలు, సమగ్ర సమాచారం సేకరించి పుస్తకం రాసేందుకు మూడేళ్లు పట్టింది’’ అన్నారు సూపర్‌స్టార్ కృష్ణ. నటుడిగా ఆయన యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినాయకరావు రచించిన ‘దేవుడులాంటి మనిషి’ పుస్తకావిష్కరణను కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి అధ్యక్షతన లలిత కళా పరిషత్ వారు నిర్వహించారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు పుస్తకావిష్కరణ చేసి, తొలి ప్రతిని కృష్ణ, విజయనిర్మలకు అందించారు. మహేందర్ రెడ్డి రెండులక్షల యాభై వేలు చెల్లించి మొదటి పుస్తకాన్ని కొనుగోలు చేశారు. కృష్ణ మాట్లాడుతూ– ‘‘నన్ను హీరోగా పరిచయం చేసిన ఆదుర్తి సుబ్బారావుగారికి, ‘గూఢచారి 116’తో మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన డూండీగారికి కృతజ్ఞతలు. నేను నటుడిగా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, టెక్నీషియన్స్ కారణం’’ అని చెప్పారు. దర్శకులు బి.గోపాల్, ఎస్వీ కృష్ణారెడ్డి, ముప్పలనేని శివ, నిర్మాతలు కె.ఎస్.రామారావు, సి.కల్యాణ్, కె.అచ్చిరెడ్డి, అనీల్ సుంకర, దాసరి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇది అల్లరి మొగుడు-2లా ఉంటుంది -మంచు విష్ణు
మోహన్‌బాబు, అల్లరి నరేశ్ కథానాయకులుగా 24 ఫ్రేమ్స్ పతాకంపై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో విష్ణు మంచు నిర్మిస్తున్న చిత్రం ‘మామ మంచు - అల్లుడు కంచు’. మీనా, రమ్యకృష్ణ, పూర్ణ కథానాయికలు. కోటి, అచ్చు, రఘు కుంచె స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రం పాటలను పార్లమెంట్ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి ఆవిష్కరించి, మాజీ మంత్రి దానం నాగేందర్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, పలువురు ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు వాళ్ళ మాటల్లోనే... నన్ను డామినేట్ చేయడానికి ట్రై చేశాడు! - మోహన్‌బాబు ఒక మరాఠీ సినిమాను తెలుగులో రీమేక్ తీయాలని ఏడాదిన్నర పాటు నన్ను వెంటాడారు కో డెరైక్టర్ రవి. అలా ఈ సినిమా తెర మీదకు కొచ్చింది. రమ్యకృష్ణను హీరోయిన్గా తీసుకోవద్దని చాలామంది చెప్పారు. అప్పట్లో ఆ అమ్మాయి కారణంగా కలిసొచ్చి, ‘అల్లుడుగారు’ హిట్ అయ్యుండవచ్చు. మీనా డేట్స్ ‘అల్లరి మొగుడు’ టైంలో దొరకలేదు. దర్శకుడు క్రాంతికుమార్ గారు సంపాదించారు. వీరిద్దరూ నాకు బంగారం లాంటి వాళ్లు. ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఈవీవీ సత్యనారాయణ గారంటే నాకు చాలా అభిమానం. ఆయన వారసుడు నరేశ్ ఈ సినిమాలో నన్ను డామినేట్ చేయాలని చూశాడు. నేను కూడా అతనికి పోటీగా చేశా. ఆయనతో సినిమా అంటే భయమేసింది - శ్రీనివాస రెడ్డి మోహన్‌బాబు గారితో సినిమా అంటే భయమేసింది. కానీ సినిమా అంతా చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాం. ఇక ‘అల్లరి మొగుడు’ కాంబినేషన్‌ను ఈ సినిమాలో రిపీట్ చేశాం. వాళ్ళను ఒప్పించడానికి చాలా టైమ్ పట్టింది - విష్ణు నరేశ్ చేయాల్సిన పాత్ర నాదే. నేను చేస్తే నాన్నగారు చేయలేరు. అందుకే నరేశ్‌ని అడిగా. ఇది ‘అల్లరి మొగుడు’ పార్ట్-2లా ఉంటుంది. రమ్యకృష్ణ, మీనా గార్లను ఈ సినిమా కోసం ఒప్పించడానికి చాలా టైమ్ పట్టింది. నాన్నగారు హాయిగా సినిమాలో నటించడానికి కారణం అలీగారే. మా కామెడీ రచ్చరంబోలా - అల్లరి నరేశ్ మోహన్‌బాబు గారిది, నాది - మా ఇద్దరి కామెడీ టైమింగ్ రచ్చ రంబోలా. ఇండస్ట్రీకి వచ్చాక ఐదు సినిమాలు చేస్తానా అనుకున్నా. 50 చేశా. ఇలాంటి మంచి మిత్రుణ్ణి సంపాదించుకోలేం! - అంబరీష్ లైఫ్‌లో డబ్బులు సంపాదించడం కష్టం కాకపోవచ్చేమో కానీ మంచి మిత్రుణ్ణి సంపాదించుకోలేం. అలాంటి మిత్రుడే మోహన్‌బాబు. ‘అల్లుడు గారు’ లేకపోతే... - రమ్యకృష్ణ నా ఫస్ట్ హిట్ ‘అల్లుడుగారు’. అది లేకపోతే ఇక్కడిదాకా వచ్చేదాన్ని కాదేమో. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఈ సినిమా వద్దనుకున్నా! - మీనా అసలు ఈ సినిమా వద్దనుకున్నా. నాకు పాప ఉందని చెప్పా. మోహన్‌బాబుగారు, విష్ణుగారు ఇచ్చిన భరోసాతో ఈ సినిమాలో చేశాను. ఈ వేడుకలో సుబ్బరామిరెడ్డి, బ్రహ్మానందం, కోటి, సుమలత, బి. గోపాల్ తదిత రులు పాల్గొన్నారు. -
కళకళ...మిలమిల...
ఒక్కరు కాదు... ఇద్దరు కాదు.. దాదాపు వంద మంది కళాకారులు... ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు భాషలకు చెందిన కళాకారులు... ఒకే వేడుకలో పాల్గొంటే చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. సినీ ప్రేమికులకైతే అంతకన్నా ఆనందం మరోటి ఉండదు. ఆదివారం అలాంటి అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి తారలందర్నీ ఒకే వేదిక పైకి తీసుకొచ్చారు. ఆయన ఆధ్వర్యంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, పంజాబీ, హిందీ భాషలకు చెందిన తారలకు అవార్డుల ప్రదానం జరిగింది. కళాకారులకు నిజమైన ఆనందం దక్కేదెప్పుడు? తాము నటించిన చిత్రం ఘనవిజయం సాధించినప్పుడు. మరి.. రెట్టింపు ఆనందం దక్కేదెప్పుడు? ఆ చిత్రాలు అవార్డులు కూడా పొందినప్పుడు. ఆ విధంగా అవార్డులు అందుకున్న తారల ఆనందంతో వేదిక కళకళలాడింది... మిలమిల మెరిసింది. దాదాపు ఐదు గంటల పాటు ఆట, పాటలతో పసందుగా సాగిన ఈ వేడుకలో అవార్డు విజేతల ప్రసంగం వీక్షకులను ఆకట్టుకుంది. అలాగే, పలువురు కథానాయికల నృత్య ప్రదర్శన ఆహూతులను ఆనందపరిచింది. టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ -‘‘భారతదేశం గర్వించేలా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ... ఇలా ఏడు భాషల కళాకారులను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చాను. ఇన్ని భాషల కళాకారులను ఒకే వేడుకలో చూడాలన్న ఏడు కోట్ల తెలుగు ప్రజల కోరికను ఇలా తీర్చాను’’ అన్నారు. జమున: 1978లో సుబ్బరామిరెడ్డి నాకు ‘సిల్వర్ జూబ్లీ స్టార్’ అవార్డు ఇచ్చారు. ఏకధాటిగా 25ఏళ్లు కథానాయికగా నటించిన సందర్భంగా ఆ అవార్డు ప్రదానం చేశారు. సుబ్బరామిరెడ్డికి సినిమా తారలంటే పిచ్చి అనుకునే దాన్ని కానీ.. ఆయనకు కళలంటే చాలా ఇష్టం. శత్రుఘ్న సిన్హా: ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి మహానుభావులు ఉన్న పరిశ్రమ ఇది (తెలుగు). భారతీయ సినిమా ఖ్యాతిని పెంచిన ‘బాహుబలి’ రూపొందించిన సినిమా పరిశ్రమకు చెందినవాణ్ణి కావడం ఆనందంగా ఉంది. రాజమౌళి ఉన్న పరిశ్రమలో ఉండటం ఆనందంగా ఉందని అమితాబ్ కూడా నాతో అన్నారు. రిషి కపూర్: కళాకారులకు తమిళ్, హిందీ అనే వ్యత్యాసం లేదు. మేం మాట్లాడేది సినిమా భాష. చిరంజీవి: కళలను ప్రోత్సహించే దిశగా సుబ్బరామిరెడ్డి కృషి చేస్తున్నారు. అందుకే కాదనుకుండా ఈ వేడుకకు వచ్చాను. మన తెలుగువాడు రాజమౌళి తీసిన ‘బాహుబలి’ హాలీవుడ్ చిత్రాలకు దీటుగా ఉంది. మోహన్‌బాబు: సుబ్బరామిరెడ్డికి అన్ని భాషలవాళ్లను తీసుకొచ్చి, అవార్డులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? కళలను పోషించాలనే తపనతో ఇస్తున్నారు. బాలకృష్ణ: ప్రభు, రిషి కపూర్‌గారు, గుల్షన్ గ్రోవర్ ఇలా చాలా మంది ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది. రమేష్ సిప్పి తెరకెక్కించిన ‘షోలే’ చిత్రాన్ని థియేటర్లో 32 సార్లు చూశాను. వెంకటేశ్: కొత్త రకం ఫ్యామిలీఎంటర్టైనర్ అయిన ‘దృశ్యం’కి అందుకోవడం ఆనందంగా ఉంది. -
విశాఖలో కోటి శివలింగాలకు ప్రత్యేక పూజలు
-
టిఎస్ఆర్ మనవడి వివాహం
-
హైటెక్స్‌లో టీఎస్ఆర్ మనవడి వివాహ వేడుక
-
సీఎంను కలిసిన సినీ నటుడు రాజేంద్రప్రసాద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సీఎం కేసీఆర్‌ను రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ శనివారం సచివాలయంలో కలిశారు. రాజేంద్రప్రసాద్ తన కుమారుడి పెళ్లికి రావాలని ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందించగా... తన మనవడి వివాహానికి హాజరు కావాలని సీఎంను సుబ్బిరామిరెడ్డి ఆహ్వానించినట్లు సమాచారం. -
సుబ్బిరామిరెడ్డి మనవడి నిశ్చితార్ధం
-
కొత్తరాజధానికి రూ.5వేల కోట్లు ఇవ్వాలి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి తక్షణం 5వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి డిమాండ్ చేశారు. ధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో యూపీఏ ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని ఆయన కేంద్రాన్ని కోరారు. విభజన నేపథ్యంలో ఆర్ధిక సంక్షోభంలో చిక్కిన ఏపీ కోసం ఆర్ధిక సహాయం అందించాలన్నారు. బడ్జెట్ ఆర్ధిక పద్దులపై బుధవారం రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. బడ్జెట్లో ప్రకటించిన పలు పథకాలకు నిధులపై స్పష్టత ఇవ్వాలన్నారు. పథకాలకు నిధుల కేటాయింపులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను సమానంగా పరిగణించాలన్నారు. దేశ రాజధాని ఢిల్లీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిని రూపొందిస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నిలబెట్టుకోవాలన్నారు. రాజధాని నిర్మాణానికి ఎక్కువ నిధులివ్వాలని, తక్షణం రూ.5 వేల కోట్లు ప్రకటించాలని కోరారు. పునర్వ్యవస్థీకరణ చట్టం పేర్కొన్న మేరకు ఏపీకి రూ.15,691 కోట్లు కేటాయించాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు, ప్యాకేజీలు ఇవ్వాలన్నారు. విభజన చట్టంలోని హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలని, అదనపు సహాయం కింద రూ.8,606 కోట్లు ఇవ్వాలని కోరారు. ఎన్డీయే ప్రభుత్వం వంద రోజుల్లో అద్బుతాలు చేస్తామని చెప్పిందని, 60 రోజులు పూర్తయ్యాయని, దీనిపై బ్లూప్రింట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖ అత్యుత్తమం
విశాఖపట్నం: ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నాని రాజధానిగా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత టి సుబ్బరామి రెడ్డి కోరారు. రాజధానికి కావాల్సిన మౌళిక వసతులు విశాఖపట్నంలో ఉన్నాయని ఆయన చెప్పారు. కొత్త రాజధాని ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీకి ఈ మేరకు నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా సుబ్బరామి రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం విశాఖపట్నమని, అన్ని వసతులు ఉన్నాయని చెప్పారు. విశాఖపట్నంతో పాటు విజయవాడ, విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతం, కాకినాడ-రాజమండ్రి మధ్య ప్రాంతాలను కొత్త రాజధానికి పరిశీలించాలని శివరామకృష్ణన్ కమిటీకి సూచించారు. కాగా రోడ్డు, రైలు, విమానయాన మార్గాలు, భూమి, నీటి వనరులు తదితర సౌకర్యాల రీత్యా విశాఖపట్నం కొత్త రాజధానికి అనువుగా ఉంటుందని సుబ్బరామి రెడ్డి అభిప్రాయపడ్డారు. -
'పవన్ ఆలోచనల్లో నిలకడ లేదు'
విశాఖ : సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్‌కు రాజకీయ అవగాహన లేదని, ఆయన ఆలోచనల్లో నిలకడ లేదని వ్యాఖ్యానించారు. నిన్న మొన్నటి వరకూ ఇంటికే పరిమితమైన వ్యక్తి బయటకు వచ్చి దేశానికి సేవ చేస్తానంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కాంగ్రెస్‌ను విమర్శించే ముందు పవన్ ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదని సుబ్బరామిరెడ్డి హితవు పలికారు. ఓవైపు తన సోదరుడు, కేంద్రమంత్రి చిరంజీవిని పొగుడుతూ...మరోవైపు కాంగ్రెస్ పార్టీని విమర్శించటం ద్వంద్వనీతికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు కారణమైన నరేంద్ర మోడీని ఎందుకు బలపరుస్తున్నారో పవన్ కల్యాణ్‌కే స్పష్టత లేదని సుబ్బరామిరెడ్డి అన్నారు. మరోవైపు పవన్, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. -
కేవీపీ, టీస్సార్, ఎంఏఖాన్ నామినేషన్లు
హైదరాబాద్ : కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులుగా కేవీపీ రామచంద్రరావు, టీ.సుబ్బరామిరెడ్డి, ఎంఏఖాన్ మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. కేవీపీ నామినేషన్‌పై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీపీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ సంతకాలు చేశారు. రాజ్యసభ నామినేషన్లకు మంగళవారం తుదిగడువు కావడంతో, రాష్ట్రం నుంచి జరగనున్న ఆరు రాజ్యసభ సీట్లకు నామినేషన్లు దాఖలు కానున్నాయి. కాంగ్రెస్ నుంచి తిరుగుబాటు అభ్యర్ధులుగా ఉన్న ఎమ్మెల్సీ చైతన్యరాజు ఇప్పటికే నామినేషన్ వేశారు. కొందరు ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకోవటంతో చైతన్యరాజు మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా నామినేషన్ వేశారు. ఇక టీఆర్ఎస్ నుంచి కేశవరావు, టీడీపీ నుంచి సీతామహాలక్ష్మి, గరికిపాటి మోహనరావు నామినేషన్లు దాఖలు చేశారు. -
త్రీఎస్సార్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : సుబ్బరామిరెడ్డిని ముచ్చటగా మూడోసారి రాజ్యసభ సీటు వరించింది. రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. నెల్లూరులో పుట్టిపెరిగి, హైదరాబాద్‌లో వ్యాపారాలు చే సే ఆయన విశాఖ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. ఈ పర్యాయం రాజ్యసభ కాకుండా విశాఖ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తానని రెండేళ్ల ముందు నుంచే హడావుడి చేసిన ఆయన చివరకు పార్టీ అధిష్టానం నిర్ణయించిన విధంగా రాజ్యసభ బరిలో నిలవాల్సి వచ్చింది. గతంలో 1996, 98 సంవత్సరాల్లో రెండు పర్యాయాలు విశాఖ లోక్‌సభ నుంచి ఎన్నికైన ఆయన 1999లో ఓటమి చెందారు. ఆ తర్వాత 2002లో, 2008లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. రెండేళ్ల క్రితం నెల్లూరు లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి విశాఖ లోక్‌సభపైనే దృష్టి సారించి ప్రస్తుత ఎంపీ, కేంద్ర మంత్రి పురందేశ్వరికి పోటీగా గ్రూపు రాజకీయాలు చేస్తూ వచ్చారు. విశాఖలో సేవా కార్యక్రమాలను కూడా బాగా విస్తరించారు. ఇటీవలే కేజీహెచ్‌లో రోగుల సహాయకుల సౌకర్యార్థం సత్రాన్ని నిర్మించారు. -
విశాఖ టిక్కెట్ కోసం సుబ్బరామిరెడ్డి విశ్వప్రయత్నం
విశాఖపట్నం: విశాఖ లోక్‌సభ టికెట్ కోసం రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి విశ్వప్రయత్నం చేస్తున్నారు. శివభక్తుడైన సుబ్బరామి రెడ్డి కార్తీక మాస పూజలతో హోరెత్తించారు. మహాదేవుడి కటాక్షం కోసం విశాఖలో కుంభాభిషేకాలు నిర్వహించారు. తనకు ఎంపీ టికెట్ ఇచ్చేలా చూడమని బోళాశంకరుడిని కాకా పట్టే పనిలో పడ్డారు. ప్రజాప్రతినిధిగా కంటే, పూజలు చేసే ప్రజాబంధుగా ఆయన పేరుతెచ్చుకున్నారు. కార్తీక మాస పూజల్లో మునిగితేలారు. శివుని ఆశీస్సులు ఉంటే విశాఖ ఎంపీ టికెట్ సంపాదిస్తానన్న నమ్మకంతో కుంభాభిషేకాలు నిర్వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పీఠాధిపతులను వెంటబెట్టుకుని మరీ ఆయన నియోజకవర్గాల వారీగా పూజలు చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలు మారుతున్న నేపథ్యంలో విశాఖ నుంచి కేంద్ర మంత్రి పురందేశ్వరి పోటీ చేసే అవకాశం లేదని టీఎస్ఆర్ వర్గం భావిస్తోంది. సుబ్బరామిరెడ్డి కూడా ఎంపీ టికెట్ తనకే వస్తుందన్న ధీమాలో ఉన్నారు. ఎందుకైనా మంచిదన్న భావనతో కార్తీక మాసాన్ని కుంభాభిషేకాలతో నింపేశారు. -
మళ్లీ మళ్లీ చెప్పాలా? విశాఖ ఎంపీ టిక్కెట్ నాదే
నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీ టిక్కెట్ తనదేనని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు. బుధవారం నెల్లూరులో విలేకర్లు అడిగిన ప్రశ్నకు అసహనం వ్యక్తం చేసిన ఆయన మళ్లీ మళ్లీ చెప్పాలా? ఈసారి విశాఖ ఎంపీ టిక్కెట్ తనదేని వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ సంవత్సరం తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు సుబ్బరామిరెడ్డి తెలిపారు. గత కొన్నాళ్లుగా విశాఖ పట్నం టికెట్ కోసం పట్టుబడుతున్న ఆయన తాజాగా మరోసారి విశాఖ ఎంపీ సీటుపై తన మనసులో మాటను బయటపెట్టారు. ఎలాగయినా విశాఖ సీటును ఈ సారి కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న సుబ్బరామిరెడ్డి అవకాశం వచ్చినప్పుడల్లా దాని గురించే మాట్లాడటం విశేషం. రాబోయే ఎన్నికలలో విశాఖ నుండి లోక్‌సభకు పోటీ చేయాలని ఆయన పరితపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్రమంత్రి పురందేశ్వరి విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.