ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖ అత్యుత్తమం | Subbarami Reddy favours Visakhapatnam as new capital of Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖ అత్యుత్తమం

Published Tue, May 13 2014 3:43 PM | Last Updated on Wed, Oct 17 2018 3:49 PM

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖ అత్యుత్తమం - Sakshi

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖ అత్యుత్తమం

విశాఖపట్నం: ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నాని రాజధానిగా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత టి సుబ్బరామి రెడ్డి కోరారు. రాజధానికి కావాల్సిన మౌళిక వసతులు విశాఖపట్నంలో ఉన్నాయని ఆయన చెప్పారు.


కొత్త రాజధాని ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీకి ఈ మేరకు నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా సుబ్బరామి రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం విశాఖపట్నమని, అన్ని వసతులు ఉన్నాయని చెప్పారు. విశాఖపట్నంతో పాటు విజయవాడ, విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతం, కాకినాడ-రాజమండ్రి మధ్య ప్రాంతాలను కొత్త రాజధానికి పరిశీలించాలని శివరామకృష్ణన్ కమిటీకి సూచించారు. కాగా రోడ్డు, రైలు, విమానయాన మార్గాలు, భూమి, నీటి వనరులు తదితర సౌకర్యాల రీత్యా విశాఖపట్నం కొత్త రాజధానికి అనువుగా ఉంటుందని సుబ్బరామి రెడ్డి అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement