విశాఖ టిక్కెట్ కోసం సుబ్బరామిరెడ్డి విశ్వప్రయత్నం | Subbarami Reddy try to MP Ticket | Sakshi
Sakshi News home page

విశాఖ టిక్కెట్ కోసం సుబ్బరామిరెడ్డి విశ్వప్రయత్నం

Published Mon, Dec 2 2013 6:43 PM | Last Updated on Fri, Aug 10 2018 5:00 PM

విశాఖ టిక్కెట్ కోసం సుబ్బరామిరెడ్డి విశ్వప్రయత్నం - Sakshi

విశాఖ టిక్కెట్ కోసం సుబ్బరామిరెడ్డి విశ్వప్రయత్నం

విశాఖపట్నం: విశాఖ లోక్సభ టికెట్‌ కోసం  రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి విశ్వప్రయత్నం చేస్తున్నారు. శివభక్తుడైన సుబ్బరామి రెడ్డి  కార్తీక మాస పూజలతో  హోరెత్తించారు. మహాదేవుడి కటాక్షం కోసం విశాఖలో  కుంభాభిషేకాలు నిర్వహించారు.

తనకు ఎంపీ టికెట్‌ ఇచ్చేలా చూడమని బోళాశంకరుడిని కాకా పట్టే పనిలో పడ్డారు.  ప్రజాప్రతినిధిగా కంటే, పూజలు చేసే ప్రజాబంధుగా ఆయన పేరుతెచ్చుకున్నారు.  కార్తీక మాస పూజల్లో మునిగితేలారు.  శివుని ఆశీస్సులు ఉంటే  విశాఖ ఎంపీ టికెట్ సంపాదిస్తానన్న నమ్మకంతో కుంభాభిషేకాలు నిర్వహించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, పీఠాధిపతులను వెంటబెట్టుకుని మరీ ఆయన నియోజకవర్గాల వారీగా పూజలు చేస్తున్నారు.

 రాష్ట్ర రాజకీయాలు మారుతున్న నేపథ్యంలో విశాఖ నుంచి కేంద్ర మంత్రి పురందేశ్వరి పోటీ చేసే అవకాశం లేదని టీఎస్‌ఆర్‌ వర్గం భావిస్తోంది. సుబ్బరామిరెడ్డి కూడా ఎంపీ టికెట్‌ తనకే వస్తుందన్న ధీమాలో ఉన్నారు. ఎందుకైనా మంచిదన్న భావనతో కార్తీక మాసాన్ని కుంభాభిషేకాలతో నింపేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement