Madhu Yaskhi Goud
-
‘తెలంగాణలో విద్యా వ్యవస్థనే నాశనం చేస్తున్న వ్యక్తి నవీన్ మిట్టల్’
సాక్షి, హైదరాబాద్: నిజాం కాలేజీలో హాస్టల్ భవనం కేటాయింపు విషయంలో విద్యార్థినిలు కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. ‘విద్యార్థులు చేస్తున్న ధర్నాకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాను. సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క, నేను కూడా మాజీ నిజాం కాలేజీ విద్యార్థులమే. ఇక్కడ హాస్టల్లో ఉండి మేము చదువకున్నవారిమే. అందువల్ల మీ ఇబ్బందులు, కష్టాలపై మాకు పూర్తి అవగాహన ఉంది. విద్యార్థులకు హాస్టల్ చాలా అవసరం అందులోనూ మహిళా విద్యార్థులకు ఇంకా ముఖ్యం. హాస్టల్ కేటాయింపు కోసం యూజీ విద్యార్థినులు చేస్తున్న ధర్నా, డిమాండ్‌కు మా మద్దతు పూర్తిగా ఉంటుంది. పీజీ విద్యార్థినులకు ఉస్మానియాలో హాస్టల్ ఉంది. కాబట్టి ఇక్కడ కట్టిన కొత్త హాస్టల్ భవనం యూజీ విద్యార్థినులకు ఇవ్వాలి. పీజీ విద్యార్థులకు ఇవ్వాలి అనుకుంటే మరో కొత్త భవనం కట్టి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. అధికారంలో ఉన్నారు కాబట్టి అహాంకారంతో ప్రవర్తిస్తే మంచిది కాదని నవన్ మిట్టల్‌ను హెచ్చరిస్తున్నాం. మొత్తం విద్యా వ్యవస్థనే నాశనం చేస్తున్న వ్యక్తి నవీన్ మిట్టల్. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు చదువు అందకుండా ఉన్నత విద్యను ప్రైవేట్‌పరం చేస్తున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలు, కాలేజీలకు సహకరిస్తూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోంది. టీఆర్ఎస్కు తొత్తులా నవీన్ మిట్టల్ పనిచేస్తున్నారు. నవీన్ మిట్టల్ వచ్చాకే ప్రభుత్వ కాలేజీలు మూత పడుతున్నాయి. విద్యార్థులకు మరో మార్గంలేక ప్రైవేట్ యూనివర్సిటీల్లో చేరేలా పరోక్షంగా ఒత్తిడి తీసుకువస్తోంది ఈ ప్రభుత్వం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తెలంగాణలో ఫోన్లు ట్యాప్ అవుతున్నది నిజమే: మధుయాష్కీ గౌడ్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోవడం బాధాకరమని ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. దీనిపై పార్టీ పెద్దల వద్ద చర్చ జరిగిందని తెలిపారు. త్వరలో ఏఐసీసీ ఇంఛార్జి నేతృత్వంలో సమీక్ష చేసుకుంటామన్నారు. త్వరలో ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యవేక్షణకు వస్తారన్నారు. పార్టీ ధిక్కరణ చర్యలకు పాల్పడే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్‌ను ఎవరూ సింగిల్‌గా గెలిపించలేరు. పార్టీలో ఉండాలనుకునేవారు కలిసి పనిచేయాల్సిందేనని అన్నారు. 'ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తూ బహుజనులు విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోంది. ప్రభుత్వ కళాశాలలు మూసేస్తున్నారు. యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇస్తున్నారు. తెలంగాణ లిక్కర్ పాలసీ ఢిల్లీ, పంజాబ్ పాలసీని కాపీ కొట్టినట్లు ఉంది. లిక్కర్ వ్యాపారంలో కల్వకుంట్ల కుటుంబానికి ప్రత్యేక అవకాశం ఇస్తున్నారు. యువతను లిక్కర్, డ్రగ్స్‌కు అలవాటు చేస్తున్నారు. తెలంగాణ లిక్కర్ స్కాం పై సిబిఐ విచారణ జరగాలి' అని పేర్కొన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికి కేసిఆర్ ప్రోటోకాల్ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ వెళ్లినపుడు మోడీ కాళ్ల మీద పడి వస్తారు. ఇక్కడికి ప్రధాని వస్తుంటే నాటకాలు అడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే టీఆర్ఎస్, బీజేపీ పంచాయతీ అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో దొంగలే దొంగ అన్నట్టు ఉందన్నారు. గవర్నర్‌కి అనుమానం ఉంటే హోంశాఖకి ఫిర్యాదు చేయాలన్నారు. తెలంగాణలో ఫోన్లు ట్యాప్ అవుతున్నది నిజమే. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. గవర్నర్ ఫోన్ ట్యాప్ అయితే ఇక ఎవరికి రక్షణ ఉంటుంది అని ప్రశ్నించారు. దీని పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేత విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. చదవండి: (తెలంగాణ పాలిటిక్స్‌లో హీటెక్కిస్తున్న మోదీ టూర్) -
‘ఉద్యమ పార్టీ పేరుతో అడ్డంగా దోచుకున్నారు.. ఆ 900 కోట్లు ఎక్కడివి?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, గాంధీభవన్ మధు యాష్కీ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ కాంక్షను విస్తరించడానికి జాతీయ పార్టీ పెడుతున్నాడు. మొదట ఉద్యమ పార్టీ అని టీఆర్ఎస్ను స్థాపించి దోచుకున్నారు. ఇప్పుడు జాతీయ పార్టీ అంటూ మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు కొంటున్నాడు.. అంటేనే కేసీఆర్ దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర దోపిడీ అన్న కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రంలో ఏం చేశాడు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగితే బహుజనులకు, రైతులకు న్యాయం జరుగుతుందని ఆనాడు కేసీఆర్ అన్నాడు. కానీ, తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ చేసిందేమీ లేదు. కొత్త పార్టీ మొదలైతే టీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తారు. తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటున్న కేసీఆర్.. తెలంగాణ జాతి ద్రోహి. కేసీఆర్.. తన కుమారుడు, కుమార్తె, అల్లుడి రాజ్య విస్తరణ కోసమే జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నాడు. తెలంగాణ కోసం పోరాటం చేసిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఒకసారి ఆలోచించాలి. 8 సంవత్సరాలు పార్టీకి 900 కోట్లు ఎలా వచ్చాయి. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ను బొంద పెట్టాలి అన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విగ్గుగాళ్లు, పెగ్గుగాళ్లు రాహుల్ గురించి మాట్లాడతారా?
సాక్షి, హైదరాబాద్: రాహుల్‌గాంధీ వరంగల్ సభ తర్వాత రాష్ట్రంలోని టీఆర్ఎస్ నేతలకు వణుకు పుడుతోందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ వ్యా ఖ్యానించారు. రాహుల్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రజల కు అర్థమయిందని, తెలంగాణ సమాజం మేల్కొందని చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత టీఆర్ఎస్, కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. కేసీఆర్ అంటేనే మోసం, దగా అని ఆరో పించిన మధుయాష్కీ విగ్గుగాళ్లు, పెగ్గుగాళ్లకు రాహుల్ గురించి వి మర్శించే అర్హత లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇవ్వక పోతే టీఆర్ఎస్ నేతలు మొజంజాహి మార్కె ట్లో గులాబీపూలు అమ్ముకునే వారని ఎద్దేవా చేశారు. -
పన్ను నొప్పా.. పన్నుల నొప్పా: మధు యాష్కీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు. రైతుల సమస్యలు పరిష్కరించకుండా పన్నునొప్పి పేరుతో తన అక్రమాల, అవినీతి సొమ్ములకు వచ్చే పన్నుల నొప్పి నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ‘కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుది నొప్పి కాదు.. వచ్చింది పన్నులు నొప్పి మాత్రమే. టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు సిగ్గులేకుండా ధరల పెరుగుదలను జాతీయ రహదారులను దిగ్బంధిస్తూ ప్రజలను, ప్రయాణీకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యమంత్రి మాత్రం ఢిల్లీలో పండుకుంటాడు.ప్రధానిని కలవడు. వీళ్లు మాత్రం రోడ్ల మీద ధర్నా చేస్తారు. ప్రభుత్వంలో ఉన్న బీజేపీ-టీఆర్ఎస్లు సమస్యలను పరిష్కరించాలి కానీ.. వాళ్లే ప్రశ్నిస్తే.. సమస్యలను ఎవడు పరిష్కరించాలి...?? పరిష్కరించాల్సినోళ్లే ధర్నాల పేరుతో రోడ్ల మీద డ్రామాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రజల పక్షాన పోరాటం చేస్తే అరెస్టులు చేస్తారా?? పెంచి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని.. ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చిన ఇన్నేళ్లలో ఏనాడైనా ఇంధన ధరలపై రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ ను తగ్గించాడా?, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించి ప్రజలకు ఊరటనిస్తే.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎందుకు తగ్గించలేదో ప్రజలకు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు మధుయాష్కీ చదవండి: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్.. -
భూ పంపిణీ చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదే
సాక్షి, భూదాన్‌పోచంపల్లి: పేదలకు భూమిని పంపిణీ చేసిన చరిత్ర కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని సేవాగ్రామ్ వరకు రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో చేపట్టిన సర్వోదయ సంకల్ప పాదయాత్ర ను ప్రారంభించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, పీసీసీ వర్కింగ్‌ప్రెసిడెంట్ మహేశ్‌బాబు, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూదానోద్యమంలో ప్ర«థమ భూదాత వెదిరె రాం చంద్రారెడ్డి సమాధి వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మాట్లాడుతున్న మల్లు భట్టివిక్రమార్క అనంతరం టూరిజం పార్కు ఆవరణ లో ఉన్న ఆచార్య వినోబాభావే, వెదిరె రాంచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం వేళ ఆచార్య వినోబాభావే పోచంపల్లిని సందర్శించారన్నారు. రాం చంద్రారెడ్డి వద్ద 100 ఎకరాల భూమిని సేకరించి ఆయన భూదానోద్యమానికి శ్రీకారం చుట్టా రని గుర్తు చేశారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో భూసంస్కరణ చట్టాలు తెచ్చి భూమి లేని నిరుపేదలకు లక్షలాది ఎకరాలు పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అయితే నేడు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నాడు పేదలకు పంచిన అసైన్డ్ భూములను లాక్కుంటోందని విమర్శించారు. అసైన్డ్, భూదాన భూములను ధరణి పోర్టల్‌లోని పార్ట్ బీలో నమోదు చేయడం వల్ల ఇటు పాసుపుస్తకాలు రాక, అటు రైతుబంధు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
మధుయాష్కీ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు'
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు అవసరం ఉందంటూ ఏఐసీసీ కార్యదర్శి, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. మధుయాష్కి తనతో మాట్లాడారని, పీసీసీ మార్పుపై ఆయన ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో 60వేల కోట్లు ఖర్చు చేశామనడంపై ఆయన మాట్లాడుతూ.. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఇక్కడే మేము వ్యవసాయం చేశాం. కేసీఆర్ హైదరాబాద్‌లో 60వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఎక్కడ చేశారో తెలియదు. వరదలు పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగాయి. వర్షాలకే నగరం సగం మునిగిందంటే ఇది టీఆర్ఎస్ పని తీరుకు నిదర్శనం. వరదల్లో వంద మంది చనిపోతే.. ఒక్కచోట కూడా పరామర్శించలేదు. 550 కోట్లు వరద బాధితులకు ఇస్తామన్నారు. (పీసీసీ మార్పు: మధుయాష్కీ హాట్ కామెంట్స్) రూ.2 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో రూ.5 వేల కోట్లు హైదరాబాద్‌కు ఇవ్వలేరా..?. ప్రతీ కుటుంబానికి 50వేల రూపాయల పరిహారం ఇవ్వాలి. ప్రజల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామంటే ముఖ్యమంత్రి, సీఎస్ అపాయింట్ ఇవ్వడం లేదు. వరద సహాయాన్ని దోచుకుతింటున్నారు. రూ.350కోట్లు నగదు ఎలా డ్రా చేస్తారు. లబ్ధిదారుల జాబితా ఎందుకు ఇవ్వడం లేదు. వరద సహాయం అతిపెద్ద కుంభకోణం. దోపిడీపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. 3లక్షల 87వేల మంది లబ్దిదారుల జాబితా ఎందుకు ఇవ్వరు. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. జరుగుతున్న దోపిడీని గవర్నర్‌కు ఫోన్లో వివరించాం. విచారణ జరిపించాలని కోరాం. కరోనా సమయంలో రూ.1,500 బ్యాంకు లో వేసిన ప్రభుత్వం.. ఇప్పుడు రూ.10వేలు క్యాష్ ఎట్లా ఇస్తారు. గ్రేటర్ ఎన్నికల కోసం ఇంతగా దిగజారాలా. పరిహారం దోపిడీపై వదిలేది లేదు. అధికారులను కోర్టుకు ఈడ్చుతాం అని అన్నారు. -
అంబేద్కర్ సాక్షిగా పసుపు బోర్డు సాధిస్తా..
ఆర్మూర్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాక్షిగా పసుపు బోర్డును, ఎర్రజొన్నలకు కనీస మద్దతు ధరను, ఎన్ఆర్ఐ పాలసీని సాధిస్తానని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ అబేద్కర్ విగ్రహం ఎదుట ప్రతిజ్ఞ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని అబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ముందర ఉ గాది పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ఈ ప్రతిజ్ఞ చేశారు. ఈ మూడు సమస్యల పరి ష్కారం కోసం కృషి చేసి రైతులు, గల్ఫ్ బాధితుల రుణం తీర్చుకుంటానన్నారు. ఇచ్చిన మాటకు క ట్టుబడి తెలంగాణ అమరవీరుల బలిదానాలను చూడలేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకున్న సోనియాగాంధి రాజకీయ వారసుడైన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కేంద్రంలో ఏర్పడబోయే ప్ర భుత్వం ద్వారా సత్వరమే పసుపు బోర్డును ఏర్పాటు చేపిస్తానన్నారు. వాణిజ్య పంట లైన పసుపు, ఎర్రజొన్నలను ఎంఎస్పీ ప రిధిలోకి తీసుకొని రైతులకు గిట్టుబాటు ధ ర ఇప్పించే విధంగా కృషి చేస్తానన్నారు. ఉపాధి కోసం గల్ఫ్‌బాట పట్టి అర్ధాకలితో అలమటిస్తున్న గల్ఫ్ బాధితుల కోసం గల్ఫ్ పాలసీని రూపొందింపజేస్తానన్నారు. దేశంలోని అన్ని పార్టీల మద్దతును కూడగట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి పసుపు, ఎర్రజొ న్న రైతుల సమస్యలను పరిష్కరించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి తనను పార్లమెంట్‌కు పంపిం చాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షు డు పీసీ భోజన్న, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార చంద్రమోహన్, ఆలూర్ గంగారెడ్డి, ఇట్టెం జీవన్ తదితరులు పాల్గొన్నారు. -
మీరు ఇస్తామన్న 30 కోట్లు ఏవి?
సాక్షి, నిజామాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని నిజామాబాద్ మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. మద్దతు ధర కోసం ఆర్మూర్ రైతులు కొన్ని రోజులుగా ధర్నా చేస్తున్నా స్థానిక ఎంపీ కవిత పట్టించుకోవడంలేదని ఆయన మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పంటల మద్దతు ధర కోసం రైతులు ధర్నా చేస్తే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం దారుణమన్నారు. పసుపు, ఎర్రజొన్నల పంటలకు గిట్టుబాటు ధర కల్పిచాలని కోరుతూ.. నిజామాబాద్, ఆర్మూర్ రైతులు గత కొద్దిరోజులుగా జాతీయరహదారిపై ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతుల ఆందోళన వెనుక ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని, సీఎం కేసీఆర్ రైతుల ఆందోళనకు రాజకీయ రంగు అంటగడుతున్నారని మండిపడ్డారు. జైల్లో పెట్టిన రైతులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు నిధులు ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తామన్న రూ.30 కోట్లు ఏవని మధుయాష్కీ ప్రశ్నించారు. -
‘నిశ్శబ్ద విప్లవం.. అధికారం మాదే’
సాక్షి, నిజామాబాద్ : ప్రజాకూటమి నిశ్శబ్ద విప్లవంలా అధికారంలోకి వస్తుందని ఏఐసీసీ కార్యదర్శి, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికలకు పోయిన కేసీఆర్‌కు మూతిపండ్లు రాలడం ఖాయమని, ఓటమి భయంతోనే కేసీఆర్ సహనం కోల్పోతున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. భోదన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని వందరోజుల్లో తెరిపిస్తామని ఎంపీ కవిత ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. జిల్లాలో కవిత ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా కట్టించలేకపోయ్యారని, కానీ ఎంపీ, ఎమ్మెల్యేలకు కార్యాలయాలు మాత్రం నిర్మించారని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ‘‘తెలంగాణ జాగృతి ఆస్తులను ప్రకటిస్తామని గతంతో కవిత అన్నారు. ఇప్పటి వరకు ఎందుకు ప్రకటించలేదు?. మేం అధికారంలోకి రాగానే వారి కుటుంబ సభ్యుల ఆస్తులన్నీ బయటపెడతాం. కేసీఆర్‌ది దైవభక్తి కాదు, ధనభక్తి. సోనియా గాంధీ, రాహుల్‌లను విమర్శించే స్థాయి ఆయనకు లేదు. అమరవీరుల స్థూపం నిర్మించలేని కేసీఆర్‌కు ఓట్లు అడిగే అర్హత లేదు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పోరేషన్లో వేల కోట్ల కుంభకోణం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేటీఆర్ బావమరిదిని జైలుకు పంపుతాం. రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేటీఆర్‌ది. తెలంగాణ ప్రజలు అలోచించి ఓటు వేయ్యాలి.’’ అని అన్నారు. -
డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పాలనలో దేశంలోనే డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ మారిందని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం గౌడ కులస్తులను అణచివేసే చర్యలకు పాల్పడుతోందని, కులాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. ఆదివారం గాంధీభవన్‌లో మాజీ మంత్రి డి.కె.అరుణ, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారదలతో కలిసి జోగులాంబ గద్వాల జిల్లా గౌడ సంఘం ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. వారి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. డ్రగ్స్ తీసుకునే సినిమా రంగం వాళ్లతో తన కుమారుడు కేటీఆర్‌కు సంబంధాలున్నాయనే డ్రగ్స్ జోలికి కేసీఆర్ వెళ్లడం లేదని ఆరోపించారు. కేటీఆర్‌కు పబ్‌లు, క్లబ్‌లలో వాటా ఉంది నిజం కాదా? అని ప్రశ్నించారు. గౌడ కులస్తులను అణచివేస్తున్నారని, కల్తీ కల్లు పేరుతో ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గీత కార్మికులకు కనీసం ఎక్స్‌గ్రేషియా రాకుండా అడ్డుపడుతున్నారన్నారు. కులాల పేరిట విద్యార్థులను కూడా కేసీఆర్ విభజిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల పేరిట విడగొడుతున్నారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే కల్లు, గీత కార్మికుల సమస్యలను పరిష్కరించేలా మేనిఫెస్టోలో చేర్చుతామని తెలిపారు. అందరినీ మోసం చేస్తున్న పాపాత్ముని పాలన త్వరలోనే అంతం కాబోతుందని యాష్కీ జోస్యం చెప్పారు. కులాలను చీల్చాలని చూస్తున్నారు: డీకే ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కులాలను చీల్చి లబ్ధి పొందాలని చూస్తున్నారని డీకే అరుణ విమర్శించారు. గౌడేతర కులాలకు కూడా టీఎఫ్టీ లైసెన్సులు ఇస్తున్నారని, అన్ని కులాల భవనాలకు వందల జీవోలు వచ్చాయి కానీ ఏ కులానికీ భవనాలను నిర్మించలేదని ఆమె ఆరోపించారు. కేసీఆర్ హామీలను చూశాం.. మోసాలను చూశాం.. ఇక చాలు అంతా కలిసి కాంగ్రెస్‌కి అండగా ఉండాలని కోరారు. గీత కార్మికులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. -
కాంగ్రెస్‌లో వర్గపోరు
సాక్షిప్రతినిధి,నిజామాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ రేసులో ఉన్న నేతలకు, ఎ మ్మెల్యే స్థానాలకు పోటీ చేయాలని భావిస్తున్న నాయకుల మధ్య ఆసక్తికరమైన అంతర్గత పోరు కొనసాగుతోంది. ఆయా స్థానాలకు ఒక్కో వర్గం ఒక్కో నేతను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తుండటం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారు తోంది. దీంతో టికెట్ రేసులో ఉన్న నేత లు ప్రత్యేకంగా స్పష్టత ఇచ్చుకోవాల్సి వ స్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మధుయాష్కిగౌడ్ పోటీ చేశారు. ఈసారి ఇక్కడి నుంచి కొత్త నేతను తెరపైకి తేవా లని ఒక వర్గం పావులు కదుపుతోంది. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైన అనంతరం ఆయన నియోజకవర్గానికి అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారనే వాదనను గట్టిగా వినిపిస్తూ కొత్త నేతను బరిలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నారు. నాలు గేళ్ల పాటు నియోజకవర్గ ప్రజలతో సాగుతోంది. మధుయాష్కి వర్గం మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తోంది. ఓ వర్గం నేతలు కావాలనే ఈ ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తోంది. కర్నాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా నియమితులు కావడం, అధినేత రాహుల్‌గాంధీ విదేశీ పర్యటన వ్యవహారాల బాధ్యతలు కూడా చూడాల్సి వస్తుండటంతో యాష్కి నియోజకవర్గానికి రాలేకపోయారని చెబుతున్నారు. త్వరలో రాహుల్‌గాంధీ యూరప్ పర్యటన అనంతరం నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. మరోవైపు అసెంబ్లీ అభ్యర్థుల బలంతో యాష్కి గెలవలేదని, 2009 ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శమని చెబుతున్నారు. ఆ ఎన్నికల్లో ఒక్క బోధన్ మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటమి పాలైనా.. మధుయాష్కి మాత్రం విజయం సాధించారనే వాదనను తెరపైకి తెస్తున్నారు. ఇలా ఎంపీ స్థానానికి ఇతర నేతల పేర్లు ప్రచారంలోకి వస్తుండటం.. అభ్యర్థిత్వాల విషయంలో జోరుగా చర్చ జరుగుతుండటంతో మధుయాష్కి ఇటీవల ప్రత్యేకంగా స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. తాను నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచే పోటీ చేస్తానని హైదరాబాద్ గాం«ధీభవన్‌లో, ఉమ్మడి జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించారు. జహీరాబాద్‌లో.. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం విషయంలోనూ కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. సురేశ్షెట్కార్నే ఎంపీ అభ్యర్థిగా కొనసాగించాలనే ఒక వర్గం ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. మరో వర్గం నాయకులు కొత్తగా పార్టీలో చేరిన టీడీపీ నేత మదన్మోహన్రావును తెరపైకి తెస్తున్నారు. నారాయణఖేడ్ వంటి నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జులు బహిరంగంగానే ఎంపీ అభ్యర్థిత్వాలపై ప్రకటన చేస్తున్నారు. దీంతో ఆ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎన్నికల బరిలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య ఏమాత్రం సమన్వయం లోపించినా.. క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ పోరు ఆయా అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని చెబుతున్నారు. -
లోకల్ వాళ్లకే ఇవ్వాలి
- ఎంపీ టిక్కెట్‌పై టీఆర్ఎస్ దళిత నేతల డిమాండ్ - ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారికే టిక్కెట్ - టీఆర్ఎస్ దళిత నేతల భేటీ - గులాబీ బాస్‌ను కలవాలని నిర్ణయం సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. అధికార టీఆర్ఎస్లో టిక్కెట్ విషయంలో పోటీ పెరుగుతోంది. ఉద్యమంలో పని చేసినవారు, తర్వాత పార్టీలోకి వచ్చిన వారి అంశంపై ఇప్పుడు అధిక చర్చ జరుగుతోంది. వీటికి తోడు స్థానికత అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో జిల్లాలోని నేతలకే అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్లోని దళిత నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన వారికి అవకాశం ఇవ్వాలని అంటున్నారు. ఈ అంశంపై జిల్లాలో గులాబీ పార్టీ ముఖ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హన్మకొండలోని ఓ దళిత నేత ఇంట్లో ఈ భేటీ జరిగింది. తెలంగాణ ఉద్యమం కీలక సమయంలో టీఆర్ఎస్లో క్రియాశీలకంగా పని చేసిన పసునూరి దయాకర్, గుడిమల్ల రవికుమార్, జన్ను జకారియా, ప్రొఫెసర్ సాంబయ్య, జోరిక రమేశ్, చింతల యాదగిరి ఈ భేటీలో పాల్గొన్నారు. త్వరలోనే జిల్లాలోని టీఆర్ఎస్ దళిత నేతలు మరోసారి భేటీ కావాలని అనుకున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను త్వరలోనే స్వయంగా కలిసి స్థానికులకే పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతల ద్వారా ముఖ్యమంత్రిని కలవాలని అనుకున్నారు. టీఆర్ఎస్ ముఖ్యనేతలు టి.హరీశ్‌రావు, కేటీఆర్, కవితలను కలిసి జిల్లాలో పోటీ చేసే అవకాశం ఇచ్చే అంశంపై తమ అభిప్రాయాన్ని వివరించేందుకు సిద్ధమవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ టిక్కెట్ స్థానికులకే ఇవ్వాలనే అంశంపై వీలైనంత త్వరగా జిల్లాలోని దళిత కులాల నేతలందరితో మరోసారి భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. అంతటా చర్చ టీఆర్ఎస్లో ‘స్థానిక’ అంశం తెరపైకి రావడంపై చర్చ జరుగుతోంది. జిల్లాకు సంబంధం లేని పలువురు గులాబీ నేతలు ఇటీవల వచ్చి తమకు అవకాశం ఇవ్వాలని చెప్పుకుటుండడం స్థానిక నేతలకు ఆందోళన కలిగిస్తోంది. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల బాధ్యుడు గాదరి బాలమల్లు, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో మాజీ సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో స్థానిక నేతలు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుల్లోనే ఒకరికి అవకాశం ఇచ్చే ఉద్దేశంలో ఉందని.. కాంగ్రెస్ ఇదే విధంగా నిర్ణయం తీసుకున్న సందర్భంలో టీఆర్ఎస్ స్థానికేతరులకు అవకాశం ఇస్తే పార్టీకి ఇబ్బందికరంగా ఉంటుందని అంటున్నారు. టీఆర్ఎస్లో, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన వారికే అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేతను కోరాలని స్థానిక నేతలు నిర్ణయానికి వచ్చారు. కొత్తగా కొందరు నేతలు, తటస్థులు పార్టీ టిక్కెట్ కోసం చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నారని.. ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని అనుకున్నారు. మొత్తంగా ఉప ఎన్నికలు జరిగే తేదీలో స్పష్టత లేనప్పటికీ అవకాశం విషయంలో మాత్రం టీఆర్ఎస్లో ఇప్పుడే హడావుడి మొదలైంది. -
'తెలంగాణ ... కేసీఆర్ ఫాంహౌస్ కాదు'
తెలంగాణ అంటే కేసీఆర్ ఫాంహౌస్ కాదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ విమర్శించారు. మంగళవారం నిజాబామాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్ని మాట్లాడారు. ఈసందర్బంగా టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేస్తే దొరల పాలన వస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ'రావుల' సమితి అని మధు యాష్కీ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబపార్టీ అని ఆయన గుర్తు చేశారు. అలాంటి టీఆర్ఎస్కు ఓటు వేస్తే తెలంగాణకే నష్టమని మధు యాష్కీ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ థర్డ్ ఫ్రంట్‌కు మద్దతు ఇస్తామంటుందని మైనారిటీ ఓట్లు కోసమే ఆ పార్టీ అలా మాట్లాడుతుందని అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును అడ్డుకున్నది థర్ట్‌ఫ్రంట్ పార్టీలోని నేతలేనని మధు యాష్కీ గుర్తు చేశారు. -
‘పేట’ను బీజేపీకి ఇవ్వొద్దు
నరసన్నపేట, న్యూస్‌లైన్ :నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని టీడీపీ అధిష్టానం బీజేపీకి కేటాయించడంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థే పోటీ చేసేలా అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఆయన నిర్ణయం మారని పక్షంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి బగ్గు రమణమూర్తిని కోరారు. నరసన్నపేటను బీజేపీకి కేటాయించారని తెలిసి నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆదివారం రాత్రి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. నాలుగు మండలాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలు పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అవసరమైతే ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయాలని బగ్గు రమణమూర్తిని డిమాండ్ చేశారు. తామంతా విరాళాలు సేకరించి మరీ గెలిపించుకుంటామని ప్రకటించారు. అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చి నరసన్నపేట నియోజకవర్గం టీడీపీ జాబితాలోనే ఉంచేలా.. బగ్గు రమణమూర్తికే టికెట్ వచ్చేలా చూడాలని జిల్లా పార్టీ నేతలను డిమాండ్ చేశారు. ఈ విషయమై కింజరాపు అచ్చెన్నాయుడుతో చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు. టీడీపీలోనే కొనసాగుతా.. సమావేశంలో పాల్గొన్న బగ్గు రమణమూర్తి ఉద్వేగంతో ప్రసంగించారు. బీజేపీతో పార్టీ పొత్తు పెట్టుకున్న కారణంగా తనకు టికెట్ రావడం లేదన్న ఆవేదన కంటే ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం నెరవేరడం లేదని బాధగా ఉందని చెప్పారు. పార్టీలోనే కొనసాగుతానని పేర్కొన్నారు. నరసన్నపేట నియోజకవర్గం పొత్తు జాబితాలో చేరేలా జిల్లాకు చెందిన కొందరు నాయకుల పలుకుబడి ఉపయోగించారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ నేతలు గొద్దు చిట్టిబాబు, చింతు పాపారావు, తమ్మినేని భూషణరావు, బెవర రాము, శిమ్మ చంద్రశేఖరరావు, బోయిన సతీష్, వారణాశి మురళీ తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరూ ఇద్దరే..
జాతీయ నేతల పంతం కవులనాథుల్లో ఉత్కంఠ కరీంనగర్ ఎంపీ టిక్కెట్ ఎవరికో.. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కమలం గూటిలో టికెట్ల ఉత్కంఠ కొనసాగుతోంది. కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి ఆ పార్టీకి చెందిన ఇద్దరు జాతీయ స్థాయి నాయకులు పోటీపడుతుండటం ఆసక్తి రేపుతోంది. కమలనాథులందరి నోటా వీరిద్దరిపైనే చర్చ జరుగుతోంది. కేంద్ర మాజీ మంత్రి సీహెచ్.విద్యాసాగర్‌రావు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు ఈ సీటును ఆశిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరికీ అవకాశం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. గతంలో ఆ పార్టీకి ఇక్కడ గెలిచిన చరిత్ర ఉండటం, తెలంగాణ ప్రాంతంలో పార్టీ ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావటంతో పార్టీ నేతలు ఈ సీటుపై గంపెడాశలు పెట్టుకున్నారు. టీడీపీతో ఉన్నత స్థాయిలో పొత్తు కుదరడం, ఆ పార్టీలో లోకసభకు పోటీచేసే సరైన అభ్యర్థి లేకపోవడంతో, సర్దుబాటులో ఈ సీటు ఖచ్చితంగా తవుకే దక్కుతుందని బీజేపీ ధీవూతో ఉంది. అందుకే.. ఎంపీ అభ్యర్థిత్వాల చర్చ జోరందుకుంది. గతంలో ఇక్కడ పోటీ చేసి గెలిచిన విద్యాసాగర్‌రావు కేంద్రంలో మంత్రిగా పని చేశారు. ఈసారి ఆయనకు పోటీగా మురళీధరరావు ఇదే సీటు కోరుతుండటంతో ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి కత్తిమీద సాములా తయారైంది. వీరిద్దరి పేర్లను రాష్ట్ర పార్టీ ఇప్పటికే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి అందించినట్లు తెలుస్తోంది. వీరిరువురు కూడా ఎన్నికల కమిటీలో ఉండడం విశేషం. ఏడాదిగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ ఇద్దరు నేతల హడావుడి పార్టీ శ్రేణుల్లో కొత్త హుషారు తెచ్చిపెట్టింది. ఈసారి తనకే సీటు దక్కుతుందని ధీమాతో ఉన్న విద్యాసాగర్‌రావు తనదైన శైలిలో నియోజకవర్గంలో పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ కార్యకర్తలతో మమేక మవుతున్నారు. తన కున్న పాత పరిచయాలతో ముఖ్య నేతలను చేరదీసే ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. కొత్తగా జిల్లా తెరపైకి వచ్చిన మురళీధరరావు వినూత్న కార్యక్రమాలతో వేగం పెంచారు. జాతీయ నాయకులతో ఉన్న సాన్నిహిత్యాన్ని వినియోగించుకుని పార్టీ కార్యక్రమాలు.. ప్రచారాన్ని హోరెత్తించారు. ఉత్తర తెలంగాణలోని సామాజిక సమస్యలు... పరిష్కారం పేరిట... సదస్సులను నిర్వహిస్తూ ఆయా వర్గాల్లో పట్టు పెంచుకునేందుకు ఎత్తులు వేశారు. వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో ఇద్దరి మధ్య పోటీ బిగ్ ఫైట్‌ను తలపిస్తోంది. ఇటీవలి జాతీయ కౌన్సిల్ సమావేశాల తర్వాత మురళీధర్‌రావు పార్టీ కార్యకలాపాల వేగం మరింత పెంచారు. సోషల్ వెబ్సైట్లు, మిస్డ్ కాల్ ఇస్తే నేరుగా మాట్లాడే.. అధునాతన ప్రచార హంగులను వినియోగిస్తున్నారు. నమో టీమ్‌లతో పాటు రెండు ప్రచార రథాలను రంగంలోకి దింపారు. పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడి, మురళీధర్‌రావు ఫొటోలతో ఇంటింటికో స్టిక్కర్, కరపత్రాలు పంచుతున్నారు. వాతావరణం అనుకూలంగా ఉందనే ప్రచారంతో ఈసారి ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని ఇద్దరు నేతలు తమతమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమకు అనుకూలంగా ఉన్న జాతీయ నేతలతో పావులు కదుపుతున్నారు. -
విశాఖ టిక్కెట్ కోసం సుబ్బరామిరెడ్డి విశ్వప్రయత్నం
విశాఖపట్నం: విశాఖ లోక్‌సభ టికెట్ కోసం రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి విశ్వప్రయత్నం చేస్తున్నారు. శివభక్తుడైన సుబ్బరామి రెడ్డి కార్తీక మాస పూజలతో హోరెత్తించారు. మహాదేవుడి కటాక్షం కోసం విశాఖలో కుంభాభిషేకాలు నిర్వహించారు. తనకు ఎంపీ టికెట్ ఇచ్చేలా చూడమని బోళాశంకరుడిని కాకా పట్టే పనిలో పడ్డారు. ప్రజాప్రతినిధిగా కంటే, పూజలు చేసే ప్రజాబంధుగా ఆయన పేరుతెచ్చుకున్నారు. కార్తీక మాస పూజల్లో మునిగితేలారు. శివుని ఆశీస్సులు ఉంటే విశాఖ ఎంపీ టికెట్ సంపాదిస్తానన్న నమ్మకంతో కుంభాభిషేకాలు నిర్వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పీఠాధిపతులను వెంటబెట్టుకుని మరీ ఆయన నియోజకవర్గాల వారీగా పూజలు చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలు మారుతున్న నేపథ్యంలో విశాఖ నుంచి కేంద్ర మంత్రి పురందేశ్వరి పోటీ చేసే అవకాశం లేదని టీఎస్ఆర్ వర్గం భావిస్తోంది. సుబ్బరామిరెడ్డి కూడా ఎంపీ టికెట్ తనకే వస్తుందన్న ధీమాలో ఉన్నారు. ఎందుకైనా మంచిదన్న భావనతో కార్తీక మాసాన్ని కుంభాభిషేకాలతో నింపేశారు. -
కిరణ్ ఆరిపోయే దీపం
కమ్మర్పల్లి, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరిపోయే దీపమని, అందుకే తెలంగాణపై తప్పుడు కూతలతో కేంద్రం వద్ద మొరుగుతున్నాడని ఎంపీ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన రచ్చబండ-3 కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కూతలకు తెలంగాణ ప్రజలు భయాందోళనలకు గురి కావద్దన్నారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా చూడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకున్నా, వారి తాత ముత్తాతలు దిగి వచ్చినా తెలంగాణను ఆపలేరన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక అభివృద్ధి చేయడంతోపాటు అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడతామన్నారు. రాజ్యాంగ ప్రక్రియ జరుగుతోంది.. -ప్రభుత్వ విప్ అనిల్ అనంతరం ప్రభుత్వ విప్ అనిల్ మాట్లాడారు. మహిళలకు స్థానిక ఎన్నికల్లో 33 శాతం నుంచి 50 శాతం వరకు రిజర్వేషన్లు పెంచిన పుణ్యం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి చెందుతుందన్నారు. తల్లిదండ్రులకు ఆడపిల్ల భారం కాకూడదనే బంగారుతల్లి పథకం ప్రవేశపెట్టినట్లు చెప్పారు. చంద్రబాబు సమన్యాయం పేరిట తెలంగాణను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రాజకీయ రంగులు మారుస్తూ సమన్యాయమంటూ మళ్లీ ప్రజలను తికమకపెడుతున్నారన్నారు. తెలంగాణ టీడీపీ నాయకులు తమ అధినేతను నిలదీసి తెలంగాణపై ఉన్న చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. డిసెంబర్ 20న తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందాక, జనవరి ఒకటి తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. తెలంగాణ అంశం రాజకీయ ప్రక్రియ దాటి రాజ్యాంగ ప్రక్రియ వైపు సాగుతోందన్నారు. సీమాంధ్రులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా సోనియా గాంధీ ఒకసారి ఇచ్చిన మాట తప్పదన్నారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్‌ల వల్ల కానిది సోనియా గాంధీ తెగించి ఇచ్చిన మాటకు కుట్టుబడిందన్నారు. కమ్మర్పల్లి నుంచి తడపాకల గోదావరి వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ. 14 కోట్లు మంజూరు చేయించినట్లు విప్ పేర్కొన్నారు. మండల కేంద్రాల్లోనే సదరన్ శిబిరాలు వికలాంగుల కోసం మండల కేంద్రాల్లోనే సదరన్ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. అనంతరం బంగారు తల్లి, రేషన్‌కార్డులు, పింఛన్, గృహ నిర్మాణ మంజూరు, విద్యుత్ బిల్లు మాఫీ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.