'తెలంగాణ ... కేసీఆర్ ఫాంహౌస్ కాదు' | Madhu yaskhi goud takes on Telangana Rashtra Samithi chief | Sakshi
Sakshi News home page

'తెలంగాణ ... కేసీఆర్ ఫాంహౌస్ కాదు'

Published Tue, Apr 15 2014 12:17 PM | Last Updated on Thu, Aug 16 2018 1:18 PM

'తెలంగాణ ... కేసీఆర్ ఫాంహౌస్ కాదు' - Sakshi

'తెలంగాణ ... కేసీఆర్ ఫాంహౌస్ కాదు'

తెలంగాణ అంటే కేసీఆర్ ఫాంహౌస్ కాదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ విమర్శించారు. మంగళవారం నిజాబామాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్ని మాట్లాడారు. ఈసందర్బంగా టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేస్తే దొరల పాలన వస్తుందని  ఆరోపించారు.

 

టీఆర్ఎస్ అంటే తెలంగాణ'రావుల' సమితి అని మధు యాష్కీ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబపార్టీ అని ఆయన గుర్తు చేశారు. అలాంటి టీఆర్ఎస్కు ఓటు వేస్తే తెలంగాణకే నష్టమని మధు యాష్కీ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ  థర్డ్ ఫ్రంట్కు మద్దతు ఇస్తామంటుందని మైనారిటీ ఓట్లు కోసమే ఆ పార్టీ అలా మాట్లాడుతుందని అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును అడ్డుకున్నది థర్ట్ఫ్రంట్ పార్టీలోని నేతలేనని మధు యాష్కీ గుర్తు చేశారు.



 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement