ప్రతీకాత్మక చిత్రం
సాక్షిప్రతినిధి,నిజామాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ రేసులో ఉన్న నేతలకు, ఎ మ్మెల్యే స్థానాలకు పోటీ చేయాలని భావిస్తున్న నాయకుల మధ్య ఆసక్తికరమైన అంతర్గత పోరు కొనసాగుతోంది. ఆయా స్థానాలకు ఒక్కో వర్గం ఒక్కో నేతను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తుండటం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారు తోంది. దీంతో టికెట్ రేసులో ఉన్న నేత లు ప్రత్యేకంగా స్పష్టత ఇచ్చుకోవాల్సి వ స్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మధుయాష్కిగౌడ్ పోటీ చేశారు. ఈసారి ఇక్కడి నుంచి కొత్త నేతను తెరపైకి తేవా లని ఒక వర్గం పావులు కదుపుతోంది.
2014 ఎన్నికల్లో ఓటమి పాలైన అనంతరం ఆయన నియోజకవర్గానికి అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారనే వాదనను గట్టిగా వినిపిస్తూ కొత్త నేతను బరిలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నారు. నాలు గేళ్ల పాటు నియోజకవర్గ ప్రజలతో సాగుతోంది. మధుయాష్కి వర్గం మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తోంది. ఓ వర్గం నేతలు కావాలనే ఈ ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తోంది. కర్నాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులు కావడం, అధినేత రాహుల్‌గాంధీ విదేశీ పర్యటన వ్యవహారాల బాధ్యతలు కూడా చూడాల్సి వస్తుండటంతో యాష్కి నియోజకవర్గానికి రాలేకపోయారని చెబుతున్నారు. త్వరలో రాహుల్‌గాంధీ యూరప్ పర్యటన అనంతరం నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.
మరోవైపు అసెంబ్లీ అభ్యర్థుల బలంతో యాష్కి గెలవలేదని, 2009 ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శమని చెబుతున్నారు. ఆ ఎన్నికల్లో ఒక్క బోధన్ మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటమి పాలైనా.. మధుయాష్కి మాత్రం విజయం సాధించారనే వాదనను తెరపైకి తెస్తున్నారు. ఇలా ఎంపీ స్థానానికి ఇతర నేతల పేర్లు ప్రచారంలోకి వస్తుండటం.. అభ్యర్థిత్వాల విషయంలో జోరుగా చర్చ జరుగుతుండటంతో మధుయాష్కి ఇటీవల ప్రత్యేకంగా స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. తాను నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచే పోటీ చేస్తానని హైదరాబాద్ గాం«ధీభవన్‌లో, ఉమ్మడి జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించారు.
జహీరాబాద్‌లో..
జహీరాబాద్ పార్లమెంట్ స్థానం విషయంలోనూ కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. సురేశ్‌షెట్కార్‌నే ఎంపీ అభ్యర్థిగా కొనసాగించాలనే ఒక వర్గం ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. మరో వర్గం నాయకులు కొత్తగా పార్టీలో చేరిన టీడీపీ నేత మదన్‌మోహన్‌రావును తెరపైకి తెస్తున్నారు. నారాయణఖేడ్ వంటి నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జులు బహిరంగంగానే ఎంపీ అభ్యర్థిత్వాలపై ప్రకటన చేస్తున్నారు. దీంతో ఆ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎన్నికల బరిలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య ఏమాత్రం సమన్వయం లోపించినా.. క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ పోరు ఆయా అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment