మధుయాష్కీ (ఫైల్ ఫోటో)
సాక్షి, నిజామాబాద్ : ప్రజాకూటమి నిశ్శబ్ద విప్లవంలా అధికారంలోకి వస్తుందని ఏఐసీసీ కార్యదర్శి, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికలకు పోయిన కేసీఆర్‌కు మూతిపండ్లు రాలడం ఖాయమని, ఓటమి భయంతోనే కేసీఆర్ సహనం కోల్పోతున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. భోదన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని వందరోజుల్లో తెరిపిస్తామని ఎంపీ కవిత ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. జిల్లాలో కవిత ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా కట్టించలేకపోయ్యారని, కానీ ఎంపీ, ఎమ్మెల్యేలకు కార్యాలయాలు మాత్రం నిర్మించారని వెల్లడించారు.
ఆయన మాట్లాడుతూ ‘‘తెలంగాణ జాగృతి ఆస్తులను ప్రకటిస్తామని గతంతో కవిత అన్నారు. ఇప్పటి వరకు ఎందుకు ప్రకటించలేదు?. మేం అధికారంలోకి రాగానే వారి కుటుంబ సభ్యుల ఆస్తులన్నీ బయటపెడతాం. కేసీఆర్‌ది దైవభక్తి కాదు, ధనభక్తి. సోనియా గాంధీ, రాహుల్‌లను విమర్శించే స్థాయి ఆయనకు లేదు. అమరవీరుల స్థూపం నిర్మించలేని కేసీఆర్‌కు ఓట్లు అడిగే అర్హత లేదు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పోరేషన్‌లో వేల కోట్ల కుంభకోణం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేటీఆర్ బావమరిదిని జైలుకు పంపుతాం. రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేటీఆర్‌ది. తెలంగాణ ప్రజలు అలోచించి ఓటు వేయ్యాలి.’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment