'పవన్ ఆలోచనల్లో నిలకడ లేదు' | Pawan Kalyan has No clarity over support to narendra modi, says T.subbarami reddy | Sakshi
Sakshi News home page

'పవన్ ఆలోచనల్లో నిలకడ లేదు'

Published Mon, Apr 21 2014 11:52 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

'పవన్ ఆలోచనల్లో నిలకడ లేదు' - Sakshi

'పవన్ ఆలోచనల్లో నిలకడ లేదు'

విశాఖ : సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్కు రాజకీయ అవగాహన లేదని, ఆయన ఆలోచనల్లో నిలకడ లేదని వ్యాఖ్యానించారు. నిన్న మొన్నటి వరకూ ఇంటికే పరిమితమైన వ్యక్తి బయటకు వచ్చి దేశానికి సేవ చేస్తానంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.

కాంగ్రెస్ను విమర్శించే ముందు పవన్ ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదని సుబ్బరామిరెడ్డి హితవు పలికారు. ఓవైపు తన సోదరుడు, కేంద్రమంత్రి చిరంజీవిని పొగుడుతూ...మరోవైపు కాంగ్రెస్ పార్టీని విమర్శించటం ద్వంద్వనీతికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు కారణమైన నరేంద్ర మోడీని ఎందుకు బలపరుస్తున్నారో పవన్ కల్యాణ్కే స్పష్టత లేదని సుబ్బరామిరెడ్డి అన్నారు. మరోవైపు పవన్, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement