పవన్కు అవగాహన ఉందో...లేదో: చిరంజీవి | Chiranjeevi's reacts brother Pawan Kalyan meets Narendra Modi | Sakshi
Sakshi News home page

పవన్కు అవగాహన ఉందో...లేదో: చిరంజీవి

Published Sat, Mar 22 2014 10:24 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్కు అవగాహన ఉందో...లేదో: చిరంజీవి - Sakshi

పవన్కు అవగాహన ఉందో...లేదో: చిరంజీవి

విశాఖ : తన సోదరుడు పవన్ కల్యాణ్ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలవటం ఆశ్చర్యానికి గురి చేసిందని కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. ఆయన శనివారం విశాఖలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ గోద్రా నరమేధంలో మోడీ పాత్ర ఉందన్న అంశంపై పవన్కు అవగాహన ఉందో...లేదో అని చిరంజీవి అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు.

 పదవీ కాంక్షతోనే విశాఖ కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ పార్టీ వీడి వేరే పార్టీల పంచన చేరారంటూ ఆయన విమర్శించారు. నాయకులు వీడినా కార్యకర్తలు తమ వెంటే ఉన్నారని చిరంజీవి అన్నారు.  కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ను పార్టీ సీనియర్లు ఆదుకోవాలని ఆయన సూచించారు.  నిరుత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకే బస్సు యాత్ర చేపట్టినట్లు చిరంజీవి తెలిపారు. కాంగ్రెస్లో కొత్త రక్తం ఎక్కించేందుకు 13 జిల్లాల్లో పర్యటిస్తామని ఆయన చెప్పారు. ఏ తప్పు చేయని కాంగ్రెస్ పార్టీని ఇతర పార్టీలు కష్టాల్లోకి నెట్టాయని చిరంజీవి వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement