
సీఎంను కలిసిన సినీ నటుడు రాజేంద్రప్రసాద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సీఎం కేసీఆర్‌ను రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ శనివారం సచివాలయంలో కలిశారు. రాజేంద్రప్రసాద్ తన కుమారుడి పెళ్లికి రావాలని ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందించగా... తన మనవడి వివాహానికి హాజరు కావాలని సీఎంను సుబ్బిరామిరెడ్డి ఆహ్వానించినట్లు సమాచారం.