ప్రయోగాత్మక చిత్రాలతో కూడా భారీ కమర్షియల్ సక్సెస్ లు సాధించొచ్చని నిరూపించిన సౌత్ హీరో విక్రమ్. శివపుత్రుడు, అపరిచితుడు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న విక్రమ్ ఐ సినిమాతో కమర్షియల్ గా నిరాశపరిచినా.. నటుడిగా మాత్రం తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. అయితే ఐ తరువాత మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న చియాన్.. ప్రయోగాలను మాత్రం పక్కన పెట్టడం లేదు.