అక్రమాస్తులను పెద్దఎత్తున కూడబెట్టిన పురపాలక శాఖ ప్రజారోగ్య విభాగం ఈఎన్‌సీ పాము పాండురంగారావు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలోని మంత్రులు, మాజీ మంత్రులకు బినామీగా ఉన్నారనే అనుమానాలు రేగుతున్నాయి. రూ.800 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన పాండురంగారావు వెనుక ఉన్న పెద్దలు ఎవరన్న కోణంలో ఏసీబీ దృష్టి సారించకపోవడం గమనార్హం.