pandu ranga rao
-
ప్రముఖ వైద్యుడు ఏపీ రంగారావు కన్నుమూత
హైదరాబాద్: దేశవ్యాప్తంగా 108, 104 అంబులెన్స్ సహాయ సేవల వ్యూహకర్త, ప్రెస్‌క్లబ్ సీనియర్ సభ్యుడు డాక్టర్ అయితరాజు పాండు రంగారావు (75) ఆదివారం తెల్లవారుజామున సోమాజిగూడలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఈయన గత కొంత కాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. పంజగుట్ట హిందూశ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈయనకు డాక్టర్ భరత్ అనే కుమారుడు ఉన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి చెందిన రంగారావు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెడ్‌క్రాస్ సొసైటీ మాజీ కార్యదర్శిగా, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రి చైర్మన్‌గా, భద్రాచలం ట్రైబల్ ఏరియా ఆస్పత్రి వైద్యాధికారిగా పలు సేవలందించారు. జోగినీ వ్యవస్థ నిర్మూలనకు, వారి పిల్లల చదువుల కోసం విశేషంగా కృషి చేశారు. ‘హాపింగ్ మెమరీస్’ పేరుతో ఈయన ఆత్మకథ కూడా ప్రచురితమైంది. పలువురి సంతాపం పేదలకు వైద్య సేవలు అందించడానికి, మెరుగుపర్చడానికి ఏపీ రంగారావు జీవితాంతం కృషి చేశారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రంగారావు మృతిపట్ల మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, డాక్టర్ లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి హరినారాయణ, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దేవేందర్‌సింగ్, కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి సుజాతారావు, ఉమ్మడి ఏపీ మాజీ విజిలెన్స్ కమిషనర్ సమల్, ఏపీ రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి మదన్మోహన్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
‘పాము’ కాదు..అవినీతి అనకొండ
-
‘పాము’ కాదు.. అవినీతి అనకొండ
- పాండురంగారావును సర్వీసు నుంచి తొలగింపునకు సిఫారసు - మాజీ మంత్రికి బినామీగా అనుమానం! - ముగిసిన సోదాలు..రూ.800 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు సాక్షి, అమరావతి: అక్రమాస్తులను పెద్దఎత్తున కూడబెట్టిన పురపాలక శాఖ ప్రజారోగ్య విభాగం ఈఎన్సీ పాము పాండురంగారావు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలోని మంత్రులు, మాజీ మంత్రులకు బినామీగా ఉన్నారనే అనుమానాలు రేగుతున్నాయి. రూ.800 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన పాండురంగారావు వెనుక ఉన్న పెద్దలు ఎవరన్న కోణంలో ఏసీబీ దృష్టి సారించకపోవడం గమనార్హం. శుక్ర, శనివారాల్లో సోదాలు నిర్వహించిన సోదాల్లో ఆస్తుల చిట్టాను లెక్కతేల్చిన ఏసీబీ ఆయన ఎవరికి బినామీ, మరికొన్ని కీలక కోణాలపై ఏసీబీ అధికారులు ఆరా తీయడం మరిచారు. రాష్ట్రానికి చెందిన కీలక మంత్రితో పాండురంగారావుకు ఇటీవల పొరపొచ్ఛాలు వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పాండురంగారావుకు చెక్ పెట్టేందుకు ఆ మంత్రి వ్యూహాత్మకంగా పావులు కదలిపినట్టు అధికారవర్గాల్లో చర్చ సాగుతోంది. ఇది ఇలా ఉంటే కృష్ణా జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి, ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో కీలకస్థానంలో ఉన్న వ్యక్తికి పాండురంగారావు అత్యంత సన్నిహితంగా ఉండేవారని చెబుతున్నారు. 2011లో పాండురంగారావు బదిలీని ఆ నేతే స్వయంగా రంగంలోకి దిగి నిలుపుదల చేయించినట్టు సమాచారం. అనంతరం 2014 ఎన్నికల్లో కృష్ణా జిల్లాకు చెందిన ఆ నేతకు పాండురంగారావు ఇతోధిక సాయం అందించినట్టు ప్రచారం జరుగుతోంది. పాండురంగారావుకు ఏపీలోని పలువురు కీలక నేతలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నాయకునిగా వ్యవహరించిన తెలంగాణ నాయకుడు, అప్పట్లో మంత్రిగా కూడా వ్యవహరించిన మరో తెలంగాణ నేతకు ఆయన బినామీగా వ్యవహరించారనేది విశ్వసనీయ సమాచారం. పాండురంగారావు హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లోనూ కీలక స్థానంలో పనిచేశారు. ఈ అంశాలపై ఏసీబీ, పోలీసు, ఇతర ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరుగుతుండటం విశేషం. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరుపర్చడంతో రిమాండ్ విధించింది. ఈ కేసులో ఇంకా అనేక వివరాలు తెలియాల్సి ఉందని, విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని కోరనున్నట్టు సమాచారం. ఆయన్ను సర్వీసు నుంచి తొలగించాలని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ ప్రభుత్వానికి నివేదించనున్నారు. -
కొలిక్కి వస్తున్న డీసీసీబీ కేసు
దేవరకొండ, న్యూస్‌లైన్: దేవరకొండ సహకార బ్యాంకు వ్యవహారం ఓ కొలిక్కివస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని రిమాండ్ చేయగా, శుక్రవారం మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అవినీతిపై మొదట నుంచి కో అంటే కోట్లు అన్నట్లుగా రెండంకెల సంఖ్యలో రూ.కోట్లను లెక్కేసినా చివరకు విచారణ అనంతరం రూ.4కోట్ల నుంచి 6కోట్ల రూపాయల మేర అవినీతి జరిగి ఉండవచ్చునని విచారణ అధికారులు, బ్యాంక్ అధికారులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. డీసీసీబీ ఇన్చార్జ్ చైర్మన్ పాండురంగారావు బృందం శుక్రవారం దేవరకొండకు వచ్చి డీఎస్పీ మనోహర్‌ను కలిసి విచారణ తీరును తెలుసుకున్నారు. వారు విచారణపై పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేసు స్థితి, బ్యాంకులో జరిగిన అవకతవకలకు సంబంధించిన వివరాలను పాండురంగారావు, డీఎస్పీ మనోహర్‌లు విలేకరులకు వివరించారు. గత సంవత్సరం మార్చి నుండి ఇప్పటి వరకు దేవరకొండ సహకార బ్యాంక్‌లో రూ.45.25లక్షల లావాదేవీలు జరిగినట్లు వారు తెలిపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పంట రుణాలు ఇచ్చిన మొత్తం రూ.9 కోట్లని తెలిపారు. ఇందులో రూ.21.50లక్షలు బంగారంపై రుణాలివ్వగా, కొత్తగా వచ్చిన బ్రాంచీలకు రూ.2.58లక్షలు అందించినట్లు పేర్కొన్నారు. వీటితోపాటు రూ.10.50లక్షల ఎల్టీ లోన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అయితే సహకార బ్యాంక్‌లో ఇప్పటివరకు రూ.9.05కోట్ల రుణాలివ్వగా అందులో సింహభాగం అవినీతి జరిగినట్లు భావించినా రూ.4కోట్ల నుంచి రూ.6కోట్లలోపే అవినీతి జరిగి ఉండవచ్చునని వారు భావించారు. ఇదిలా ఉండగా మరో కోణంలో విచారణ చేపట్టాల్సి ఉందని.. వాస్తవంగా రికార్డుల ప్రకారం రైతులకు మంజూరు చేసిన పంట రుణం ఎంత..? అందులో రైతులకు ముట్టింది ఎంత? అనే విషయాలకు కూడా వారు విచారణ చేయాల్సి ఉందన్నారు. అయితే కో ఆపరేటివ్ యాక్ట్ ప్రకారం ఒక్కో రైతును విడివిడిగా తీసుకున్న అప్పుపై విచారణ చేయడానికి కో ఆపరేటివ్ రిజిస్ట్రార్ అనుమతి కోసం ప్రతిపాధనలు పంపినట్లు తెలిపారు. అయితే ఆ యాక్ట్ ప్రకారం ప్రిన్సిపల్ సెక్రటరీ ఆమోదం లభిస్తే ఆ వైపు నుంచి విచారణ చేయడానికి ఆస్కారం ఉంటుందన్నారు. నాబార్ట్ నిధులతో ధాన్యం నిల్వ కేంద్రాలు.. నాబార్ట్ నిధులతో డీసీసీబీ నుండి ధాన్యం నిల్వ కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నట్లు పాండురంగారావు తెలిపారు. స్థలం, సొసైటీ రిజిస్ట్రేషన్‌తోపాటు అర్హులైన వారు ధాన్యం నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి ధరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నిల్వ కేంద్రాల నిర్వహణకు ఒక్కో మెట్రిక్ టన్నుకి రూ.4వేల చొప్పున 200 మెట్రిక్ టన్నుల వరకు నిల్వ కేంద్రాలు నిర్మించడానికి అనుమతులు ఇస్తామన్నారు. జిల్లాలోని 107 సొసైటీల పరిధిలో 187 గోదాములున్నాయని, అవసరమైన గోదాముల మరమ్మత్తుకు లక్షా 25వేల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. విచారణ తీరును పరిశీలించడానికి వచ్చిన బృందంలో పాండురంగారావుతోపాటు డీసీసీబీ సీఈఓ భాస్కర్‌రావు, డెరైక్టర్ లింగయ్య, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్రావులున్నారు. ఇరువురు రిమాండ్... సహకార బ్యాంక్ అవినీతి కేసులో పాత్రధారులైన మరో ఇరువురిని దేవరకొండ డీఎస్పీ మనోహర్ అదుపులోకి తీసుకొని విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న చందంపేటకు చెం దిన చిన్నా , తుల్జానాయక్లను అరెస్ట్ చేసి శుక్రవారం సాయంత్రం కోర్టుకు రిమాండ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే రెండు సొసైటీల పరిధిలో విచారణ పూర్తయిందని, మరికొన్ని రోజులో పూర్తిస్థాయిలో విచారణ ముగిస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వ్యవహరిస్తున్నామని ఆయన తెలిపారు.