శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో అందుబాటులో ఉన్న జలాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ, ఏపీకి కేటాయించింది. అక్టోబర్ అవసరాలకుగాను తెలంగాణకు 17.5 టీఎంసీలు, ఏపీకి 18.5 టీఎంసీలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఖరీఫ్‌కు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద 30.2 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 6 టీఎంసీలు, నల్లగొండ తాగునీటికి 4.1 టీఎంసీలు కలిపి మొత్తంగా 40.3 టీఎంసీలు కావాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఆగస్టులో కృష్ణా బోర్డును కోరింది. ఇందులో 15 టీఎంసీల నీటి విడుదలకు బోర్డు గతంలోనే అనుమతులిచ్చింది.