Handri-neeva
-
సాగర్ 4 గేట్ల నుంచి దిగువకు నీరు
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్: శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్‌గేట్లను గురువారం సాయంత్రం మూసేశారు. మంగళవారం ఇన్‌ఫ్లో పెరగడంతో నాలుగోసారి బుధవారం గేట్లను ఎత్తిన విషయం తెలిసిందే. ఇన్‌ఫ్లో తగ్గుతుండడంతో గురువారం ఉదయం 9 గంటలకు ఒక గేటు, మధ్యాహ్నం మూడుగంటలకు ఒక గేటు, సాయంత్రం ఆరుగంటలకు మరో గేటు మూసేశారు. జూరాల, సుంకేసుల నుంచి జలాశయానికి 96,467 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. విద్యుత్ ఉత్పాదన అనంతరం 64,048 క్యూసెక్కులు, స్పిల్ వే ద్వారా 72,569 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు వదిలారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 18 వేల క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజలస్రవంతికి 1,688 క్యూసెక్కు లు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,186 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 212.4385 టీఎంసీల నీరు ఉంది. డ్యామ్ నీటిమట్టం 884.40 అడుగులకు చేరింది. నాగార్జునసాగర్ జలాశయం నాలుగు రేడియల్ క్రస్ట్‌గేట్ల ను ఐదడుగులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 33,454 క్యూసెక్కులు, నాలుగు గేట్ల ద్వారా 32,316 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ, వరద కాలువలు, ఎస్ఎల్బీసీకి కలిపి మొత్తం 1,03182 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ప్రస్తుతం సాగర్ జలాశయంలో నీటిమట్టం 589.80 అడుగులు ఉంది. 311.4474 టీఎంసీల నీరు ఉంది. -
రూ.5,036 కోట్లతో.. గాలేరు నగరి, హంద్రీనీవా ఎత్తిపోతల
సాక్షి, అమరావతి: గాలేరు నగరి, హంద్రీనీవాలను అనుసంధానం చేయడం ద్వారా రెండు పథకాల కింద ఆయకట్టుకు సమర్థంగా నీళ్లందించే పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కృష్ణా నదికి వరద వచ్చే 40 రోజుల్లోనే వరద జలాలను ఒడిసి పట్టి ప్రాజెక్టులను నింపడం ద్వారా దుర్భిక్ష రాయలసీమను సుభిక్షం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధృడ సంకల్పంతో పనులు చేపట్టిన విషయం తెలిసిందే. ► గాలేరు నగరి సుజల స్రవంతి నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి కాలువలోకి నీటిని ఎత్తిపోసే పనులను రూ.5,036 కోట్లతో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ► గండికోట సీబీఆర్(చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) ఎత్తిపోతల, గండికోట పైడిపాలెం ఎత్తిపోతల అభివృద్ధి పనులను రూ.3,556.76 కోట్లతో చేపట్టేందుకు కూడా పరిపాలన అనుమతి ఇచ్చింది. ► గాలేరు నగరి సుజల స్రవంతి నుంచి గండికోట రిజర్వాయర్‌కు మరో పది వేల క్యూసెక్కులు తరలించేందుకు వీలుగా వరద కాలువలో 52.184 కి.మీ నుంచి 58.835 కి.మీ వరకు అదనపు టన్నెల్ తవ్వకం పనులను రూ.604.80 కోట్లతో చేపట్టడానికి అంగీకరించింది. ► సీబీఆర్ నుంచి ఎర్రబెల్లి చెరువులోకి నీటిని ఎత్తిపోసి గిడ్డంగివారిపల్లి వద్ద కొత్తగా 1.20 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్‌లోకి తరలించి పులివెందుల, వేముల మండలాల్లో యూసీఐఎల్(యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) ప్రభావిత ఏడు గ్రామాల్లో సూక్ష్మనీటిపారుదల పద్ధతిలో పది వేల ఎకరాలకు నీళ్లందించే పనులను రూ.1,113 కోట్లతో చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బుధవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. ► వీటికి సంబంధించిన టెండర్ షెడ్యూళ్లను జ్యుడిషియల్ ప్రివ్యూ(న్యాయ పరిశీలన)కు పంపేందుకు జలవనరుల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ► వైఎస్సార్ జిల్లాలో ఆదినిమ్మాయపల్లె ఆనకట్టకు దిగువన పుష్పగిరి దేవాలయం వద్ద ఒక టీఎంసీ సామర్థ్యంతో పెన్నా నదిపై రిజర్వాయర్ నిర్మాణానికి డీపీఆర్ రూపకల్పనకు కూడా రూ.35.50 లక్షలతో పరిపాలన అనుమతి మంజూరైంది. -
అన్నదాతకు హంద్రీ–నీవా వరం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కళ్లెదుటే గలగలా నీళ్లు పారుతున్నా ఏడేళ్లుగా పొలాలకు పారించుకోలేని దుస్థితి సీమ రైతన్నలకు ఇక తొలగిపోనుంది. రాయలసీమ సాగునీటి కష్టాలు తీర్చే బృహత్తర ప్రాజెక్టు హంద్రీ–నీవా సుజల స్రవంతి ఫేజ్–1 ద్వారా ఆయకట్టుకు సాగునీరు ఇస్తామని, ఫేజ్–2లో చెరువులకు నీరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బడ్జెట్లో ప్రకటించడం పట్ల అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ‘సీమ’ వాసుల 15 ఏళ్ల స్వప్నం సాకారమై బీడు భూములు కృష్ణా జలాలతో తడిసి బంగారు పంటలు పండించనున్నాయని పేర్కొంటున్నారు. 2004 జూలై 24న వైఎస్సార్ శంకుస్థాపన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రూ.6,850 కోట్ల వ్యయంతో హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం పనులకు శ్రీకారం చుట్టారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 40 టీఎంసీలను ఎత్తిపోసి ‘సీమ’లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ పథకానికి 2004 జూలై 24న శంకుస్థాపన చేశారు. ఐదేళ్లలో రూ.4,340.36 కోట్లు ఖర్చు చేశారు. అయితే వైఎస్ మృతి చెందటం హంద్రీ–నీవాకు శాపంగా మారింది. ఎట్టకేలకు 2012లో కృష్ణమ్మ కర్నూలు జిల్లాలోని పందికోన, కృష్ణగిరితోపాటు ‘అనంత’లోని జీడిపల్లి రిజర్వాయర్లకు చేరుకున్నా రైతులకు మాత్రం నిరాశే మిగిలింది. 2012 నవంబర్ 29న ‘అనంత’లోని జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు చేరాయి. 2014 ఖరీఫ్‌లోనే హంద్రీ–నీవా తొలి దశ కింద 1.98 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని ప్రకటించిన నాటి టీడీపీ సర్కారు మాట నిలబెట్టుకోలేదు. పైగా ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులు చేయవద్దని 2015 ఫిబ్రవరిలో చంద్రబాబు ప్రభుత్వం జీవో 22 జారీ చేయడం గమనార్హం. దీంతో ఐదేళ్లుగా కృష్ణా జలాలు కళ్లెదుటే పారుతున్నా పొలంలోకి మళ్లించుకోలేని దుస్థితిలో సీమ రైతులు ఉన్నారు. హంద్రీ–నీవా ద్వారా 40 టీఎంసీలను ఎత్తిపోసి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించాలని డీపీఆర్‌లో నిర్దేశించారు. ఫేజ్–1లో 1.98 లక్షల ఎకరాలున్నాయి. కృష్ణగిరి, పందికోన, జీడిపల్లి రిజర్వాయర్లు ఇందులో ఉన్నాయి. వీటి డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించాలి. ఇందులో కర్నూలు జిల్లాలో 80 వేల ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1.18 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. నిత్యం కరువుతో అల్లాడే ఆలూరు నియోజకవర్గంలో 48 వేల ఎకరాలు, పత్తికొండలో 10 వేల ఎకరాలకు నికరంగా సాగునీరు అందనుంది. ఉరవకొండలో కూడా 70 వేల ఎకరాలకు అత్యధికంగా సాగునీరు అందనుంది. సాగునీరు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో డిస్ట్రిబ్యూటరీ పనులు ఇక వేగవంతం కానున్నాయి. పిల్ల కాలువ పనుల్లో గత సర్కారు తాత్సారం.. కర్నూలు జిల్లాలో పందికోన రిజర్వాయర్ నుంచి 61,400 ఎకరాలకు సాగునీరు అందించాలి. ఇందులో కుడి కాలువ కింద 50,626 ఎకరాలు, ఎడమ కాలువ కింద 10,774 ఎకరాల ఆయకట్టు ఉంది. కుడి కాలువ పరిధిలో 32 డిస్ట్రిబ్యూటరీలు ఉండగా 28 డిస్ట్రిబ్యూటరీలు పూర్తయ్యాయి. ఎడమ కాలువ పరిధిలోని మొత్తం 11 డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తయ్యాయి. అయితే వీటి నుంచి పిల్ల కాలువల పనులు చేయడంలో గత ప్రభుత్వం తాత్సారం చేసింది. రెండు ప్యాకేజీలుగా పిల్ల కాలువ పనులకు టెండర్లు పిలిచారు. 28వ ప్యాకేజీ పనులను మాక్స్ ఇన్ఫ్రా దక్కించుకుంది. 29వ ప్యాకేజీ పనులను ఆర్‌మెహిత్, బూరత్నమ్(జాయింట్ వెంచర్) కంపెనీలు దక్కించుకున్నాయి. ఈ రెండు కంపెనీలు 87–90 శాతం పనులు పూర్తి చేశాయి. మిగతా పనులు నిలిపివేయడంతో పిల్ల కాలువల పనులకు బ్రేక్ పడింది. అనంతపురం జిల్లాలో 36వ ప్యాకేజీ ద్వారా అత్యధికంగా 80,600 ఎకరాల ఆయకట్టుకు నీరందించాలి. ఈ పనులను రూ.336 కోట్లతో ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ సంస్థ దక్కించుకుంది. ఈ పనులు కూడా పూర్తి కాకపోవడంతో ఆయకట్టుకు నీరు అందలేదు. వీటిని సమీక్షించి పనులు చేయని కాంట్రాక్టులను రద్దు చేసి త్వరగా డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేస్తే కనీసం వచ్చే ఖరీఫ్ నుంచైనా ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. అప్పుల నుంచి అన్నదాతలకు విముక్తి హంద్రీ–నీవా ద్వారా ఆయకట్టుకు నీరందిస్తే కర్నూలు, అనంతపురం జిల్లాల్లో దాదాపు 2 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. వర్షాధారంగా పంటలు సాగు చేసి అప్పుల పాలయ్యే దుస్థితి రైతన్నలకు తప్పుతుంది. రైతులు, రైతు కూలీలు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పని ఉండదు. ఫేజ్–2లో కూడా చెరువులకు నీరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో గొల్లపల్లి, చెర్లోపల్లి, మారాల రిజర్వాయర్ల పరిధిలోని రైతులకు మేలు జరుగుతుంది. -
ముఖ్యనేత జేబుల్లోకి కమీషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి వరదలై పారుతోంది. అందినంత దండుకోవడమే ప్రభుత్వ పెద్దలు పనిగా పెట్టుకున్నారు. తాజాగా మూడు ఎత్తిపోతల పథకాల పనులను తనకు బాగా కావాల్సిన కాంట్రాక్టర్లకు అప్పగించి, రూ.375 కోట్లు కొల్లగొట్టేందుకు ‘ముఖ్య’నేత స్కెచ్ వేశారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో భాగమైన అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల, భైరవానితిప్ప(బీటీపీ) ఎత్తిపోతల, పత్తికొండ ఎత్తిపోతల పథకాల్లో అంచనా వ్యయాలను విపరీతంగా పెంచేసి, టెండర్లు పిలిచారు. అస్మదీయ కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించారు. ముఖ్యనేతకు కావాల్సిన కాంట్రాక్టు సంస్థలు తప్ప ఇతరులెవరూ టెండర్లలో పాల్గొనకుండా బెదిరింపులకు దిగారు. చివరకు అస్మదీయ కాంట్రాక్టు సంస్థలు అధిక ధరలతో సింగిల్ బిడ్లను దాఖలు చేశాయి. వాటిని ఆమోదించాలంటూ అధికారులపై ముఖ్యనేత ఒత్తిడి తెచ్చారు. చేసేది లేక.. నిబంధనలకు విరుద్ధమైనా సింగిల్ బిడ్లను ఆమోదించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. టెండర్ నోటిఫికేషన్ జారీ చేయకముందే అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల పథకంలో అంచనా వ్యయాన్ని రూ.205.54 కోట్లు, భైరవానితిప్ప ఎత్తిపోతల పథకంలో రూ.42.78 కోట్లు, పత్తికొండ ఎత్తిపోతల పథకంలో రూ.77.93 కోట్ల మేర పెంచేసినట్లు సాక్షాత్తూ జలవనరుల శాఖ అధికారులే చెబుతున్నారు. ఈ విషయంలో 2017–18 స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లను(ఎస్ఎస్ఆర్)ను కూడా ముఖ్యనేత పట్టించుకోలేదు. మూడు పథకాల్లో అంచనా వ్యయాలను రూ.326.25 కోట్లు పెంచినట్లు స్పష్టమవుతోంది. సింగిల్ బిడ్లను ఆమోదించాలట! అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల పథకం పనులకు ముఖ్యనేతకు బాగా కావాల్సిన కాంట్రాక్టు సంస్థ 4.65 శాతం అధిక ధరలకు(ఎక్సెస్) సింగిల్ బిడ్‌ను దాఖలు చేసింది. బీటీపీ ఎత్తిపోతల పథకం పనులకు అధికార పార్టీ ఎమ్మెల్సీ బినామీ సంస్థ 4.32 శాతం అధిక ధరలకు బిడ్ దాఖలు చేసింది. పత్తికొండ ఎత్తిపోతల పథకం పనులకు ముఖ్యనేతతో అనుబంధం ఉన్న కంపెనీ 4.52 శాతం అధిక ధరలకు బిడ్ దాఖలు చేసింది. ముఖ్యనేత ఒత్తిడి మేరకు సింగిల్ బిడ్లను ఆమోదించి.. ఆయా సంస్థలకు పనులు అప్పగించాలని కమిషనర్ ఆఫ్ టెండర్స్‌కు జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. తాను ఎంపిక చేసిన సంస్థలకే పనులు దక్కేలా చక్రం తిప్పిన ముఖ్యనేత.. టెండర్లను ఖరారు చేయాలంటూ సీవోటీపై ఒత్తిడి తెస్తున్నారు. సింగిల్ బిడ్ దాఖలైన టెండర్లను నిబంధనల మేరకు రద్దు చేసి మళ్లీ టెండర్లు నిర్వహించాలి. కానీ, సింగిల్ బిడ్ దాఖలైన టెండర్లను ఆమోదించాలంటూ సీవోటీపై ముఖ్యనేత ఒత్తిడి పెంచుతున్నారు. ముఖ్యనేత జేబుల్లోకి కమీషన్లు మూడు ఎత్తిపోతల పథకాల అంచనా వ్యయాలను పెంచడం వల్ల అస్మదీయ కాంట్రాక్టర్లకు రూ.326.25 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. అధిక ధరలకుపనులను అప్పగించడం వల్ల అదనంగా మరో రూ.49.13 కోట్ల మేర లాభం వస్తుంది. అంటే ఖజానాపై రూ.375.38 కోట్ల భారం పడుతుంది. కాంట్రాక్టర్లతో ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ సొమ్ముంతా కమీషన్ల రూపంలో ముఖ్యనేత జేబుల్లోకి చేరనుంది. -
ఏళ్లు గడుస్తున్నా నీరివ్వరేం?
సాక్షి, అనంతపురం: హంద్రీ–నీవా ప్రాజెక్ట్ కింద ఉన్న ఆయకట్టుకు నీటి ని అందించడంలో టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి హయాంలో 80 శాతా నికి పైగా పనులు పూర్తయ్యాయని, అలాంటిది ఈ మూడేళ్లలో కనీసం స్ట్ర క్చర్లు కూడా నిర్మించలేని దౌర్బాగ్య పరిస్థితిలో టీడీ పీ ప్రభుత్వం ఉందన్నారు. హంద్రీ–నీవా ప్రాజెక్ట్ పురోగతిపై శనివారం స్థానిక హంద్రీ–నీవా కార్యాలయంలో హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ రామకృష్ణారెడ్డితో కలిసి ఆ యన మూడు గంటల పాటు సమీక్షించారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ఏమైంది? ‘ఉరవకొండ నియోజకవర్గంలోని హంద్రీ– నీవా ఆయకట్టుకు నీటి విడుదల అంశాన్ని గతేడాది అసెంబ్లీలో లేవనెత్తాం. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు. మార్చిలోగా హంద్రీ–నీవా ఆయకట్టుకు నీరిస్తామంటూ అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు హామీనిచ్చారు. అయితే పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. ఆయకట్టు స్ట్రక్చర్ పనులే ప్రారంభించకుండానే మార్చి నాటికి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం సాధ్యమవుతుందా?’ అని ఎస్ఈని ప్రశ్నించారు. ఎక్కడి పనులు అక్కడేనా? ‘33వ ప్యాకేజీ పనులు గిట్టుబాటు కావడం లేదని కాంట్రాక్టర్లు పనులు నిలిపేస్తే.. అదనపు రేట్లకు టెండర్లు ఇచ్చుకుంటూ ప్రజాధనం లూటీ చేస్తున్నారే తప్ప పనుల్లో పురోగతి చూపడం లేదు. మొత్తం 11 స్ట్రక్చర్లకు గాను ఐదింటిని మాత్రమే పూర్తి చేశారు. ఒక కిలోమీటర్లు కాలువ బ్లాస్టింగ్ చేయాల్సి ఉందన్నారు. 17 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సిన 34వ ప్యాకేజీలో 45 స్ట్రక్చర్లు నిర్మించాల్సి ఉంది. ఈ పనులన్నీ ఎప్పటికి పూర్తి చేయగలుగుతారు. పని చేయని కాంట్రాక్ట్ సంస్థలను వెంటనే బ్లాక్‌లిస్టులో పెట్టండి. అవసరమైతే బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 5 కోట్లను జప్తు చేయండి. 36వ ప్యాకేజీలో జీడిపల్లి రిజర్వాయర్ ద్వారా మొత్తం 80 వేల ఎకరాలకు నీరివ్వాల్సి ఉంది. మిగిలిపోయిన పనులకు రూ.55 కోట్లతో చేయాల్సి ఉండగా రూ. 275 కోట్లు పెంచుకుని కొత్త కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. పనులు ఎక్కడా చేపట్టకపోతే అధికారులుగా మీరేమి చేస్తున్నారు’ అంటూ నిలదీశారు. అన్ని చెరువులకు నీళ్లివ్వాలి ఆమిద్యాల లిప్ట్ పనులకు వెంటనే టెండర్లు పిలవడంతో పాటు హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా ఉరవకొండ నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. వజ్రకరూరు నుంచి గుంతకల్లు వరకు గ్రావిటీ ద్వారా నీటిని తరలించి 13 చెరువులను నింపాలన్నారు. ఈ పనులు చేపట్టాలని సూచించారు. అవసరమైతే మొబైల్ లిప్ట్‌లు తెప్పించి మెయిన్ కెనాల్ నుంచి చెరువులకు నీటిని తరలించాలని కోరారు. రైతులకు లబ్ధి చేకూర్చేందుకు సమష్టిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. నిధుల దోపిడీకే టెండర్లు హంద్రీ–నీవా మొదటి దశలో ఐదు శా తం పనులు మాత్రమే పూర్తి చేస్తే ఆయకట్టుకు నీరివ్వచ్చునని విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ మూడేళ్లలో ఒక్క ఎకరాకు కూడా నీరివ్వకుండా ఉరవకొండ నియోజకవర్గ రైతులను మోసం చేసి కు ప్పంకు నీటిని తీసుకుపోవడానికి ప్రత్నిం చిన చంద్రబాబు, ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బైరవాని తిప్ప ప్రాజెక్టు, పేరూరు డ్యాంలకు నీళ్లిస్తామం టూ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉం దని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికలకు డ బ్బులు దాచుకునేందుకు ఈ పనులకు టెండర్లు పిలుస్తున్నారని, గ్రావిటీ ద్వారా నీళ్లిచ్చే అవకాశాలు ఉన్నా లిఫ్ట్‌లు పెడు తూ రూ. వందల కోట్లు దోచుకునేందుకు కుట్రలు చేశారని విమర్శించారు. -
తెలంగాణకు 17.5.. ఏపీకి 18.5 టీఎంసీలు
-
తెలంగాణకు 17.5.. ఏపీకి 18.5 టీఎంసీలు
♦ ఇరు రాష్ట్రాలకు నీటి విడుదలపై కృష్ణా బోర్డు నిర్ణయం ♦ తెలంగాణకు సాగర్ ఎడమ కాల్వ కింద 15 టీఎంసీలు ♦ హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలకు 2.5 టీఎంసీలు ♦ ఏపీ వాటాగా హంద్రీ-నీవాకు 5, చెన్నై తాగునీటికి 3, తెలుగుగంగకు 5 టీఎంసీలు సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో అందుబాటులో ఉన్న జలాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ, ఏపీకి కేటాయించింది. అక్టోబర్ అవసరాలకుగాను తెలంగాణకు 17.5 టీఎంసీలు, ఏపీకి 18.5 టీఎంసీలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఖరీఫ్‌కు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద 30.2 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 6 టీఎంసీలు, నల్లగొండ తాగునీటికి 4.1 టీఎంసీలు కలిపి మొత్తంగా 40.3 టీఎంసీలు కావాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఆగస్టులో కృష్ణా బోర్డును కోరింది. ఇందులో 15 టీఎంసీల నీటి విడుదలకు బోర్డు గతంలోనే అనుమతులిచ్చింది. తర్వాత సాగర్ ఎడమ కాల్వ కింద జోన్-1, జోన్-2లోని ఖరీఫ్ సాగు అవసరాలకు 15 టీఎంసీలు కేటాయించాలంటూ తెలంగాణ మరో లేఖ రాసింది. ఇక ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు కింద 11 టీఎంసీలు, హంద్రీనీవా కింద 5, సాగర్ ఎడమ కాల్వ కింద 2.5 టీఎంసీలు కావాలని విన్నవించింది. వీటిని పరిశీలించిన బోర్డు తాజాగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఇరురాష్ట్రాలు ఎంత మేర నీటిని వినియోగించాయో వివరిస్తూ ప్రస్తుత కేటాయింపులు చేయడం గమనార్హం. మూడు చోట్ల వాటాకు మించి.. కృష్ణా బేసిన్లో ఇప్పటివరకు తెలంగాణ ఏఎంఆర్పీ కింద 10.21 టీఎంసీలు, ఎడమ కాల్వ కింద 5.13, కల్వకుర్తి కింద 1.745 టీఎంసీలు కలిపి మొత్తంగా 17 టీఎంసీలను వినియోగించుకున్నట్లు బోర్డు తన లేఖలో పేర్కొంది. ఏపీ పోతిరెడ్డిపాడు కింద 23.79 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వ కింద 9.98, కృష్ణా డెల్టా కింద 20.41, హంద్రీనీవా కింద 9.33 టీఎంసీలు కలిపి మొత్తంగా 63.524 టీఎంసీలు వినియోగించుకుందని వివరించింది. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ఏఎంఆర్పీ కింద వాటాకు మించి వినియోగం చేశారని లేఖలో తెలిపింది. అధికంగా వినియోగిస్తే ఈ నీటిని వాడొద్దు తాజాగా కృష్ణా బోర్డు తెలంగాణకు సాగర్ ఎడమ కాల్వ కింద 15 టీఎంసీలు, హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలకు 2.5 టీఎంసీలు కలిపి 17.5 టీఎంసీల వినియోగానికి అంగీకరించింది. హంద్రీనీవాకు 5 టీఎంసీలు, చెన్నై తాగునీటికి 3, ఎస్ఆర్బీసీకి 3, తెలుగుగంగ ప్రాజెక్టు 5, సాగర్ ఎడమ కాల్వ కింద 2.5 టీఎంసీలు కలిపి మొత్తంగా ఏపీకి 18.5 టీఎంసీల విడుదలకు అంగీకారం తెలిపింది. ఇవి గత ఆగస్టులో నీటి కేటాయింపులకు అదనమని, అప్పటి ఆదేశాల్లో పేర్కొన్న దాని కంటే ఎక్కువగా వాడుకొని ఉంటే ప్రస్తుత నీటిని వాడటానికి అవకాశం ఉండదని స్పష్టంచేసింది. ఒకవేళ తక్కువగా వినియోగించి ఉంటే మిగిలిన నీటిని వినియోగించుకోవచ్చని వివరించింది. ఏ రాష్ట్రమైనా అధికంగా నీటిని వాడుకొని ఉంటే ఆ రాష్ట్రం త్రిసభ్య కమిటీకి ఆ విషయాన్ని తెలియజేయాలని సూచించింది. -
పెదబాబు డైరెక్షన్లో చినబాబు యాక్షన్
సాగునీటిలో అవినీతి సునామీ! అధికారులపై కీలకమంత్రి వత్తిళ్లు అదనపు చెల్లింపులు.. అందులో వాటాలు.. నాలుగు ప్రాజెక్టుల్లో రూ. 748 కోట్ల లూటీ ఏవో కుంటిసాకులు చూపించడం.. జరుగుతున్న పనులను ఆపేయడం.. కాంట్రాక్టులు రద్దు చేయడం.. ఆ తర్వాత అవే కాంట్రాక్టు పనుల అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేయడం.. ఆ కాంట్రాక్టులను సొంత మనుషులకు కట్టబెట్టడం.. యథేచ్ఛగా ప్రజా ధనాన్ని లూటీ చేయడం... ఇదీ సాగునీటి రంగంలో సాధించిన ప్రగతి. పెదబాబు డైరెక్షన్లో, చినబాబు నాయకత్వంలో... కాంట్రాక్టర్ల ముసుగులో ఉన్న అధికార పార్టీ ఎంపీలు, బినామీ కాంట్రాక్టర్లు అందినకాడికి దోచుకుంటున్నారు. వాటాలు పంచుకు తింటున్నారు. ఇరిగేషన్లో అవినీతిని ఏరులుగా పారిస్తున్నారు. పెదబాబు, చినబాబు, వీరికి తోడైన మంత్రి అవినీతి లీలలకు సాగునీటి శాఖ అధికారులు నివ్వెరపోతున్నారు. అవినీతి కోసం వేసిన సరికొత్త బాటలు చూసి అవాక్కవుతున్నారు. ఇరిగేషన్లో ‘బాబు’ల అవినీతి వ్యవహారాలకు మచ్చుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం. రూ. 748 కోట్లు లూటీ చేసిన ఓ నాలుగు ప్రాజెక్టులను పరిశీలిద్దాం.. ‘ఘోర’కల్లులో రూ.350 కోట్లు ఓ ప్రాజెక్టు పనులు 92 శాతం పూర్తయ్యాయి. బిల్లులూ చెల్లించేశారు. మిగిలిన 8 శాతం పనులకు ఎంత ఖర్చవుతుంది? ఖర్చులు పెరిగాయనుకున్నా ఎంత ఉండవచ్చు. మహా అయితే మిగిలిన బిల్లు రెట్టింపు.. కానీ 92 శాతం పనులకు ఎంత చెల్లించారో మిగిలిన 8 శాతం పనులకు అంత చెల్లించబోతున్నారు. ఆ మేరకు అంచనా వ్యయం పెంచేసి పంచుకోబోతున్నారు. ఆ కథేమిటో చూద్దామా... ప్రాజెక్టు వివరాలివీ: గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా శ్రీశైలం కుడి ప్రధాన కాలువ(ఎస్ఆర్బీసీ) 56.77 కి.మీల వద్ద 12.44 టీఎంసీల సామర్థ్యంతో కర్నూల్ జిల్లాలోని గోరకల్లులో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. శ్రీశైలం జలాశయానికి వరద వచ్చినప్పుడు ఎస్ఆర్బీసీ ద్వారా తరలించి, గోరకల్లు రిజర్వాయర్‌లో నిల్వ చేసి గాలేరు-నగరి సుజల స్రవంతి ఆయకట్టుకు నీళ్లందించడానికి ఈ ప్రాజెక్టు ఉద్దేశించింది. ఈ రిజర్వాయర్ పనులకు 2005లో టెండర్ పిలిచారు. సాబీర్-షూ-ప్రసాద్(జాయింట్ వెంచర్) సంస్థ 14.33 శాతం తక్కువ ధరకు కోట్ చేసి.. రూ.448.20 కోట్లకు పనులను చేజిక్కించుకుంది. ఈ జాయింట్ వెంచర్లో సింహభాగం వాటా టీడీపీ మాజీ మంత్రికి చెందిన సాబీర్ సంస్థదే కావడం గమనార్హం. ఇప్పటికే 92 శాతం పనులను పూర్తి చేసిన కాంట్రాక్టర్ రూ.428 కోట్లను బిల్లుల రూపంలో పొందారు. మరో రూ.20.20 కోట్ల విలువైన 8 శాతం పనులు మాత్రమే చేయాల్సి ఉంది. అవినీతి స్కెచ్ ఇలా గోరకల్లు ప్రాజెక్టులో తట్టెడు మట్టెత్తకుండానే రూ.350 కోట్లు కొట్టేసేందుకు ‘మాస్టర్’ప్లాన్ వేశారు. పెదబాబు డెరైక్షన్‌లో కీలక మంత్రి చక్రం తిప్పారు. అధికారపార్టీకి చెందిన మాజీ మంత్రి అయిన కాంట్రాక్టర్‌తో కలసి మాస్టర్‌ప్లాన్ అమలుకు పూనుకున్నారు. జలాశయంలోకి నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఇన్‌ఫాల్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడాన్ని సాకుగా చూపి అంచనా వ్యయాన్ని రూ.448.20 కోట్ల నుంచి రూ.840.34 కోట్లకు పెంచేశారు. అదనపు పని విలువ రూ.42.17 కోట్లకు మించదని జలవనరుల శాఖ అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. తక్కిన రూ.350 కోట్లను కాంట్రాక్టర్‌తో కలసి పెదబాబు దోచుకోవడానికి రంగం సిద్ధం చేశారు. పులిచింతలలో రూ. 300 కోట్లు ప్రాజెక్టు పూర్తి చేయకుండా కాంట్రాక్టరే జాప్యం చేశాడు. ధరలు పెరిగాయి కాబట్టి అదనంగా చెల్లించాలన్నాడు. జిల్లా కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కోర్టు చెప్పినదానికన్నా ఇంకా అదనంగా తనకు డబ్బురావాల్సి ఉందని కాంట్రాక్టరు వాదిస్తున్నాడు. పై న్యాయస్థానానికి వెళ్లి ప్రజాధనాన్ని కాపాడేందుకు ప్రయత్నించాల్సిన రాష్ర్టప్రభుత్వం కాంట్రాక్టరుకు అదనంగా చెల్లించడానికి సిద్ధమౌతోంది. ఇదీ ప్రాజెక్టు కృష్ణా డెల్టాలో 12.57 లక్షల ఎకరాల ఆయకట్టుకు సకాలంలో నీళ్లందించాలన్న లక్ష్యంతో కృష్ణా నదిపై నాగార్జునసాగర్‌కు 121 కి.మీల దిగువన.. ప్రకాశం బ్యారేజీకి 83 కి.మీల ఎగువన పులిచింతల ప్రాజెక్టుకు అక్టోబర్ 15, 2004న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.268.87 కోట్లతో చేపట్టిన పులిచింతల హెడ్ వర్క్స్ పనులను టీడీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ సంస్థ చేజిక్కించుకుంది. టెండర్ ఒప్పందం ప్రకారం పనులను మార్చి 31, 2007 నాటికే పూర్తి చేయాలి. అప్పట్లో ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినా పనులను పూర్తిచేయడంలో కాంట్రాక్టు సంస్థ తీవ్ర జాప్యం చేసింది. ఒకానొక దశలో చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవడంతో పనుల్లో కొంత కదలిక వచ్చింది. భారీ దోపిడీకి స్కెచ్ ఇలా పెదబాబు వ్యూహం మేరకు .. 2014 నుంచి వడ్డీతో కలిపి మొత్తం రూ.300 కోట్లు చెల్లించాలంటూ పులిచింతల కాంట్రాక్టర్ జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్‌కు లేఖ రాశారు. అదనంగా రూ.300 కోట్లు ఇవ్వాలంటూ కాంట్రాక్టర్ అలా లేఖ రాశారో లేదో పెదబాబు సూచనల మేరకు మంత్రి ఇలా స్పందించారు. కృష్ణా జిల్లా ప్రిన్సిపల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం తరఫున హైకోర్టును ఆశ్రయించాల్సిన మంత్రి తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. యాసిడ్ దాడి బాధితురాలికి అదనపు పరిహారం చెల్లించకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడిన చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టరుకు మాత్రం అదనంగా చెల్లించడానికి ఉత్సాహపడుతోంది. పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్టర్‌కు తక్షణమే రూ.300 కోట్లు చెల్లించాలంటూ ఆ శాఖ ఉన్నతాధికారులపై మంత్రి ఒత్తిడి తెస్తున్నారు. పులిచింతల కాంట్రాక్టర్‌తో ఆది నుంచి ఉన్న సంబంధాలు.. పెదబాబు డెరైక్షన్‌లో వాటాలు పంచుకోవడానికి ఒప్పందం కుదరడం వల్లే మంత్రి ఒత్తిడి తెస్తున్నారంటూ జలవనరుల శాఖ కీలక అధికారి ఒకరు ‘సాక్షి’తో ధృవీకరించడం గమనార్హం. హంద్రీ-నీవాలో రూ. 54 కోట్లు నచ్చినవారి కోసం ‘జరుగుతున్న పనులు’ రద్దు చేశారు. అంచనా వ్యయం పెంచి నిబంధనలకు విరుద్ధంగా అప్పగించారు. మూడొంతుల పనులకు బిల్లులూ చెల్లించేశారు. ఈ దశలో ఆ కాంట్రాక్టరును తప్పించి మరో బినామీ కాంట్రాక్టరును తెరపైకి తెచ్చారు. ఒక వంతు పనికి గాను ప్రాజెక్టు వ్యయానికన్నా రెట్టింపునకు పెంచేశారు. పెంచిన మొత్తాన్ని పంచుకోవడానికి పథకమేశారు. అదేమిటో మీరే చూడండి... ప్రాజెక్టు వివరాలివీ హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 40 టీఎంసీలను ఎత్తిపోసి రాయలసీమలో 4.04 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా హంద్రీ-నీవా ప్రధాన కాలువ సమీపంలో చిత్తూరు జిల్లా కేవీ పల్లె మండలం అడవిపల్లె వద్ద 1.089 టీఎంసీల సామర్థ్యంతో ఓ రిజర్వాయర్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఈ రిజర్వాయర్‌కు నీళ్లందాలంటే చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలంలోని గొల్లపల్లె నుంచి వైఎస్సార్ కడపజిల్లా చిన్నమండ్యం మండలంలో కోటగడ్డకాలనీ వరకు 4.54 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాలి. 4.54 కిమీల సొరంగం పనులతోపాటూ 1.1 కిమీల ప్రధాన కాలువ తవ్వకం పనులను 20వ ప్యాకేజీ కింద రూ.45.57 కోట్లకు ఏకేఆర్ కోస్టల్ అనే సంస్థ తొలుత చేజిక్కించుకుంది. ప్రధాన కాలువ 1.1 కిమీల తవ్వకం పనులను పూర్తి చేసిన ఆ సంస్థ.. 800 మీటర్ల మేర సొరంగం పనులనూ పూర్తి చేసింది. ఇందుకు ఆ సంస్థకు రూ.18.97 కోట్లను బిల్లుల రూపంలో చెల్లించారు. దోపిడీకి స్కెచ్ ఇలా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సొంత పార్టీ నేతలకు పనులు కట్టబెట్టి.. నిధులు దోచిపెట్టడానికి పెదబాబు ఎత్తులు వేశారు. ఆ క్రమంలోనే పనులు చేయడం లేదనే సాకు చూపి సొరంగం పనులను రద్దు చేసి, ఏకేఆర్ కోస్టల్ సంస్థ చేయగా మిగిలిన పనులను అంటే 3.74 కిమీల సొరంగం పనులను రూ.28.6 కోట్లకు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే కన్స్ట్రక్షన్స్ సంస్థకు ఏకంగా ‘నామినేషన్’పై అప్పగించేశారు.రూ.పది లక్షల విలువైన పనులను మాత్రమే నామినేషన్‌పై అప్పగించవచ్చు. అంటే.. సొంత పార్టీ నేతకు పనులు కట్టబెట్టడానికి నిబంధనలు తుంగలో తొక్కారన్నమాట. ఆర్కే కన్స్ట్రక్షన్స్ సంస్థ 300 మీటర్ల పనులను మాత్రమే చేసింది. ఇందుకు ఆ సంస్థకు రూ.11.88 కోట్లు బిల్లులు చెల్లించారు. తక్కిన రూ.16.77 కోట్ల విలువైన పనులను రద్దు చేసి.. అంచనాలు పెంచేసి మరో బినామీ కాంట్రాక్టర్‌కు అప్పగించి..దోపిడీ చేయడానికి సిద్ధమయ్యారు. ఆమేరకు అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.70.82 కోట్లకు పెంచేసి టెండర్లు పిలిచారు. అంటే రూ. 54 కోట్ల మేర కాజేయడానికి రంగం సిద్ధం చేశారన్నమాట. అవుకులో రూ.44 కోట్ల లూటీ వాటాల వ్యవహారంలో తేడాలు రావడంతో రెండు ప్రాజెక్టులలో అదనపు దోపిడీ గురించి బైటపడింది. ఓ ఎంపీ, మంత్రి ఒకరి విషయం మరొకరు బైటపెట్టుకున్న ఉదంతమిది. ధరలేవీ పెరగకపోయినా కుంటిసాకులు చెప్పి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారు. ఇద్దరికీ పెదబాబు రాజీ కుదర్చడంతో ఆ అదనపు బిల్లులను ప్రభుత్వం చెల్లించేసింది. ఈ వివరాలేమిటో చూద్దామా..? ప్రాజెక్టు వివరాలివీ గాలేరు - నగరి సుజల స్రవంతి పథకం (జీఎన్ఎస్ఎస్)లో భాగంగా అవుకు సొరంగం పనులు చేపట్టారు. జీఎన్ఎస్ఎస్ వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని అవుకు రిజర్వాయర్‌కు తరలించడానికి వీలుగా అవుకు టన్నెల్ -2 తవ్వకం పనుల (30వ ప్యాకేజీ) ని రూ. 401 కోట్లకు ఎన్సీసీ - మేటాస్ (జాయింట్‌వెంచర్) సంస్థ చేజిక్కించుకుంది. దోపిడీ పథకమిదీ టన్నెల్ తవ్వకంలో బండరాళ్లు అడ్డురావడం, మట్టిపెళ్లలు విరిగిపడడం వల్ల అలైన్మెంట్ మార్చాల్సి వచ్చిందనే కుంటిసాకులు చూపుతూ 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల పని అదనంగా చేయాల్సి వచ్చిందంటూ 2015 అక్టోబర్‌లో ఎన్సీసీ - మేటాస్ సంస్థ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాసింది. అదనంగా చేసిన పనికి రూ. 44 కోట్లు చెల్లించాలని కోరింది. ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్రక్షన్ (ఈపీసీ) నిబంధనల ప్రకారం అదనంగా చేసిన పనికి ఎలాంటి బిల్లులు చెల్లించనక్కరలేదు. అందులోనూ డీజిల్, పెట్రోలు, ఇనుము ధరలు తగ్గాయి. సిమెంట్ ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ పెదబాబు, చినబాబుల డెరైక్షన్‌లో కాంట్రాక్టర్‌కు రూ. 44 కోట్లు అదనంగా చెల్లించాలంటూ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులపై తీవ్రఒత్తిడి తీసుకొచ్చారు. ఇదే ప్రాజెక్టులో 29 వ ప్యాకేజీలో మిగిలిపోయిన రూ.12 కోట్ల విలువైన పనులను రద్దు చేసి రూ. 110 కోట్లకు పెంచి తెలుగుదేశం ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్కు కట్టబెట్టారు. అందులో రూ. 35 కోట్లను చెల్లించేశారు. అది తనకు తెలియకుండానే జరిగిందని జలవనరులశాఖ మంత్రి దేవినేని వ్యాఖ్యానించడంతో కినుక వహించిన సీఎం రమేశ్ 30వ ప్యాకేజీలో అదనంగా చెల్లించబోతున్న రూ. 44 కోట్ల సంగతిని బయటపెట్టారు. అయితే ఇద్దరి మధ్య పెదబాబు రాజీ కుదర్చడంతో ఆ తర్వాత వివాదాలన్నీ సమసిపోయాయి. 30వ ప్యాకేజీలో రూ.44 కోట్ల బిల్లును ప్రభుత్వం చెల్లించేసింది. -
'పుట్టినరోజున ఇచ్చిన మాటైనా నిలబెట్టుకో బాబూ'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో హంద్రీ-నీవాకు రూ.13 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది వాస్తవం కాదా? అంటూ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కనీసం పుట్టినరోజు నాడు ఇచ్చిన మాటనైనా నిలబెట్టుకోవాలన్నారు. వైఎస్ హయాంలోనే హంద్రీ-నీవా పనులు వేగవంతంగా జరిగాయని ఆయన అన్నారు. హంద్రీ-నీవా కాలయాపనకు మీరు కారణం కాదా? అంటూ ఆయన చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. రాయలసీమ ప్రజలు దుర్భర జీవితం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని చెప్పారు. ' సింగపూర్, జపాన్ పక్కన పెట్టి రైతుల గురించి ఆలోచించండి' అంటూ హితవు పలికారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలబడి వారిని ఆదుకునే చర్యలు చేపట్టాలని వై. విశ్వేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
'పుట్టినరోజు ఇచ్చిన మాటైనా నిలబెట్టుకో'
-
'ఎన్టీఆర్ రూపకల్పన చేస్తే..మేం పూర్తి చేస్తాం'
అనంతపురం : హంద్రినీవా సుజల స్రవంతిని ఎన్టీఆర్ రూపకల్పన చేశారని, దాన్ని పూర్తి చేసే అవకాశం తమకు దక్కిందని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ అన్నారు. హంద్రినీవా పనులను 15 రోజులకొకసారి సమీక్షిస్తామని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఇప్పటికే 32వేల ఎకరాలను సమీకరించినట్లు దేవినేని ఉమ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ మాట్లాడుతూ హంద్రినీవా పనులను త్వరలో పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. హంద్రినీవా సుజల స్రవంతి కాలువ పనులను మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాధరెడ్డి, దేవినేని ఉమ, ఎమ్మెల్యే బాలకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. -
చంద్రబాబుకు సవాల్ విసిరిన శైలజానాథ్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శైలజానాథ్ విరుచుకుపడ్డారు. హంద్రీనీవా ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. దీనిపై బహిరంగ చర్చకు శైలజనానాథ్ సవాల్ విసిరారు. ఆయన శనివారం ఇందిరా భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలో కేవలం ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకున్నారని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ఓ పక్క రైతులు సాగునీటితో ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు మాత్రం టూరిజం అంటూ సమావేశాలు పెట్టుకోవటం శోచనీయమన్నారు. బాబు నోట సింగపూర్, మలేషియా తప్ప మరో మాట రావటం లేదని శైలజానాథ్ ఎద్దేవా చేశారు. -
భూతంలా జలయజ్ఞం!
హైదరాబాద్: జలయజ్ఞాన్ని భూతంలా చూపించి పబ్బం గడుపుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ దిశగానే సాగునీటి రంగంపై శ్వేతపత్రం రూపొందించడానికి కసరత్తు కొనసాగిస్తోంది. శ్వేతపత్రం రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం మీద నిందలు మోపే విధంగా శ్వేతపత్రాన్ని రూపొందించాలని సీఎం సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముగింపు దశలో ఉన్న పులిచింతల, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ వంటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయడానికి అవకాశం ఉన్నా వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వీటిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే ఫలితాలు అందుతాయి. అలాంటి ప్రాజెక్టుల పనుల్ని పక్కన పెట్టిన ప్రభుత్వం జలయజ్ఞాన్ని భూతంలా చూపించాలని తాపత్రయపడుతోంది. ఇదే తపన ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేయడంపై చూపిస్తే వేలాది ఎకరాలకు నీరు అందేది. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన హయాంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు కూడా పైసా ఇవ్వని విషయం తెలిసిందే. అయితే సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఇదే జలయజ్ఞంపై ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కొత్త ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంపై అధికారుల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.