
చంద్రబాబుకు సవాల్ విసిరిన శైలజానాథ్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శైలజానాథ్ విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శైలజానాథ్ విరుచుకుపడ్డారు. హంద్రీనీవా ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. దీనిపై బహిరంగ చర్చకు శైలజనానాథ్ సవాల్ విసిరారు.
ఆయన శనివారం ఇందిరా భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలో కేవలం ప్రాజెక్ట్లకు శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకున్నారని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ఓ పక్క రైతులు సాగునీటితో ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు మాత్రం టూరిజం అంటూ సమావేశాలు పెట్టుకోవటం శోచనీయమన్నారు. బాబు నోట సింగపూర్, మలేషియా తప్ప మరో మాట రావటం లేదని శైలజానాథ్ ఎద్దేవా చేశారు.