నగరంలో కురిసిన భారీ వర్షానికి ఇప్పటివరకూ 8మంది చనిపోయినట్లు సమాచారం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు భారీ వర్షాలు, తాజా పరిస్థితులు, సహాయక చర్యలపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఉన్నతాధికారులతో కేటీఆర్ సమీక్ష జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉదయం ఆరు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసిందన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు చెప్పారు.