ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీలు బయటపడ్డాయి. సచివాలయంలోని నాల్గవ బ్లాక్‌లోని పలు ఛాంబర్లలో వర్షపు నీరు లీక్ అవుతోంది. మంత్రి గంటా శ్రీనివాసరావు యాంటీ రూమ్‌తో పాటు రెవెన్యూ కార్యాలయం వర్షపు నీటితో నిండాయి. దీంతో రెవెన్యూ శాఖ సెక్షన్ లో ఉద్యోగుల పనికి ఆటంకం ఏర్పడింది. దీంతో బకెట్లతో వర్షపు నీటిని సిబ్బంది తొలగిస్తున్నారు. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఛాంబర్లలోని సీలింగ్ తడిసి ఊడిపోయింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.