రాష్ట్ర విభజన రాజకీయ స్వార్ధానికి పరాకాష్ట అని ఏపీ ఎన్జీవో నేతలు అన్నారు. పార్టీలకతీతంగా ఎంపీలంతా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయాలని కోరారు. రాజీనామాలతోనే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని వారు చెప్పారు. సీట్లు, ఓట్ల వేటలో యూపీఏ-2 ప్రభుత్వం ఉందని వారు విమర్శించారు. ఉద్యోగులమైన తమకు సామాజిక బాధ్యత కూడా ఉందని వారు చెప్పారు. అందుకే సమైక్యరాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్నామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, సిడబ్ల్యూసి ఆమోదం తెలపడంతో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ఎపి ఎన్జీఓలు కూడా తమ ఆందోళనను ఉధృతం చేశారు. హైదరాబాద్ నుంచి సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అనడంతో వారు సమ్మె హెచ్చరిక చేశారు. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపు ఇచ్చారు. కేంద్ర మంత్రులు, ఎంపిలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారి ఇళ్లను కూడా ముట్టడించారు. కొన్ని చోట్ల వారిని నిలదీశారు.
Published Tue, Aug 6 2013 4:17 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement