సినీనటుడు నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని వివాహం మతుకుమిల్లి శ్రీభరత్‌తో ఈ ఉదయం 8.52కు హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి పలువురు కేంద్ర మంత్రులతోపాటు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన దిగ్గజాలు హాజరయ్యారు. శ్రీభరత్ కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు సోదరి కుమారుడు, విశాఖపట్నం టీడీపీ నాయకుడు ఎంవీఎస్ మూర్తికి మనుమడు. ఈ సంబంధాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుదిర్చారు. బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రహ్మణికి, చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు 2007 ఆగస్టులో వివాహం జరిగిన విషయం తెలిసిందే.
Published Wed, Aug 21 2013 9:20 AM | Last Updated on Thu, Mar 21 2024 8:40 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement