సద్దుల సద్దు మోగకముందే.. ఆనందం అంబరాన్నంటింది. రంగురంగుల బతుకమ్మకు అన్ని రంగాల ఆడపడుచులు ఆటపాటలతో ఆరాధించారు. తీరొక్క పూల కొమ్మకు తమదైన రీతిలో ఉయ్యాల పాటలు వినిపించారు. సంబరాల వేడుకను సయ్యాటలతో జరుపుకున్నారు. కళాకారులు, యాక్టర్లు, యాంకర్లు, లాయర్లు, క్రీడాకారిణులు.. పిన్నలు, పెద్దలు, రాజకీయ రమణులు.. ఇలా అన్ని రంగాలకు చెందిన మగువలు జనజాతరలో మమేకమయ్యారు. బతుకమ్మ పాటకు.. దాండియా ఆటను జోడించి కలర్‌ఫుల్ వేడుకను కళ్లముందుంచారు. గౌరమ్మకు జానపదాలతో గళార్చన చేసి మురిపెంగా గంగ ఒడికి చేర్చారు. సెల్‌కాన్ సౌజన్యంతో సాక్షి ‘సిటీప్లస్’ ఆధ్వర్యంలో శిల్పారామంలో మంగళవారం జరిగిన బతుకమ్మ సంబరాలు.. సైబర్‌వనంలో గునుగు పూల పరిమళం వెదజల్లింది.
Published Wed, Oct 1 2014 8:29 AM | Last Updated on Fri, Mar 22 2024 10:46 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement