silparamam
-
శిల్పారామం..ఇక కొత్త రూపం!
జిల్లాలో కడపతోపాటు పులివెందులలో శిల్పారామాలు ఉన్నాయి. రోజువారి జీవితంలో అలసిన వారికి ఈ ఆరామాలు ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వీటిని ఏర్పాటు చేసి పదేళ్లు కావస్తోంది. చిన్నచిన్న మార్పులు మినహా మారుతున్న కాలానికి అనుగుణంగా పెద్దగా మార్పులేవీ జరగలేదు. ఇటీవల సందర్శకులు నూతనత్వం కొరవడిందని పెదవి విరుస్తున్నారు. ఒక దశలో శిల్పారామాల నిర్వహణ ప్రభుత్వానికి బరువుగా మారింది. ప్రతి ఆదివారం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా స్థానికంగా స్పాన్సర్లను వెతుక్కోవలసి వచ్చింది. దీంతో ఆదాయం తగ్గింది. ప్రభుత్వం దీన్ని గమనించి కొత్త అందాలతో శిల్పారామాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమైంది. రాష్ట్ర శిల్పారామాల స్పెషలాఫీసర్ బి.జయరాజ్ కడప శిల్పారామంలో చేపట్టాల్సిన మార్పులను పరిశీలించేందుకు కడప నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. కడప కల్చరల్ : కడప, పులివెందుల శిల్పారామాలలో జనం సందడి తగ్గినట్లు కనిపిస్తోంది. కారణం? ఆదాయం తగ్గలేదుగానీ పెరగని మాట నిజమే. ఆశించిన మేరకు ఆర్థికంగా అభివృద్ధి కనిపించడం లేదు. మీ దృష్టికి వచ్చిన లోపాలు ఏమిటి? నివారణకు తీసుకుంటున్న చర్యలేమిటి? కడప శిల్పారామం నగరం నుంచి దూరమని పలువురు ప్రజలు భావిస్తున్నారు. ఎస్టేట్ తర్వాత మూడు, నాలుగు కిలోమీటర్ల వరకు నిర్మానుష్యంగా ఉంటుంది. కానీ ఇటీవల నగరం వైపు నుంచి రైల్వేట్రాక్ వరకు, శిల్పారామం నుంచి పెట్రోలు బంకు వరకు అక్కడక్కడా భవనాలు వెలిశాయి. జనం సందడి పెరుగుతోంది. శిల్పారామాల పూర్తిస్థాయి అభివృద్ధికి చేపట్టనున్న చర్యలేమిటి? వీటిని పూర్తిగా ఆధునికీకరిస్తాం. స్థానికతను కోల్పోకుండా ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ సందర్శకులకు మెరుగైన వసతులు కల్పిస్తాం. వారు ఉల్లాసంగా గడిపేందుకు శిల్పారామానికి కొత్త లుక్ వచ్చేలా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఏమేం మార్పులు చేపడతారు? ముఖ్యంగా వినోదానికి, ఉల్లాసంగా గడపడానికి అనుగుణంగా మార్పులు చేస్తాం. కొన్ని సాంకేతిక కారణాలతో గ్రీనరీ (పచ్చిక) లేకుండా పోయింది. కడప శిల్పారామంలో ఓ భాగాన్ని పూర్తిగా పచ్చికతో నింపుతాం. ప్రస్తుతం షాపింగ్ స్టాల్స్ దూరంగా విసిరేసినట్లు ఉన్నాయి. వాటిని ఎదురెదురుగా దగ్గరలో ఉండేటట్లు మారుస్తాం. తరుచూ హస్తకళా రూపాల ప్రదర్శన, విక్రయాలు ఏర్పాటు చేస్తాం. నైపుణ్యం గల కళాకారులకు స్టాల్స్‌ను ఉచితంగా ఇస్తాం. సందర్శకుల కోసం పాత్‌వేలను అభివృద్ధి చేస్తాం. సౌకర్యవంతంగా సేద తీరేందుకు పలుచోట్ల బెంచీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ప్రత్యేకించి వినోదం కోసం ఏం చేస్తున్నారు? కడప శిల్పారామానికి పడమర వైపునగల చెరువును నీటితో నింపి బోటింగ్, వాటర్‌గేమ్స్ నిర్వహించాలని ఆలోచిస్తున్నాం. 56 ఎకరాల చెరువులో 40 ఎకరాల్లో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించేందుకు అనుకూలంగా మార్చేందుకు కృషి చేస్తున్నాం! ఆధునీకరణ అన్నారు...వివరాలు చెప్పగలరా..? ఆధునీకరణ కోసం అంతర్జాతీయ అనుభవం గల ఇద్దరు యువ అర్కిటెక్చర్లకు ఈ పని అప్పగించాం. వారు ప్రత్యేకించి కడప శిల్పారామాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించనున్నారు. ఇప్పటికే ఇక్కడ పర్యటించి సందర్శకుల అభిప్రాయాలు సేకరించారు. ఆ ప్రణాళిక అమలైతే కడప శిల్పారామానికి కొత్త లుక్ వస్తుందని చెప్పగలను. సందర్శకులను ఆకట్టుకునేందుకు సీమ రుచులు లాగా స్థానిక వంటకాలు, ఆహార పదార్థాలు, అల్పాహారం అందించేందుకు ఫుడ్ కోర్టును ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయని భావిస్తున్నారు? ఈనెలాఖరుకు మాస్టర్ ప్లాన్‌ను తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తాం. కార్యాలయ పరమైన అనుమతులు అనంతరం సీఎం ఆమోదంతో వెంటనే పనులు చేపడతాం. జూలై నాటికి దశలవారీగా అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయగలమన్న విశ్వాసం ఉంది. ఈ పనులను ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యాల సమ్మేళనంతో 40–60 శాతం పద్ధతిలో చేపడుతాం. రాష్ట్రంలో శిల్పారామాల పరిస్థితి ఎలా ఉంది? పులివెందుల శిల్పారామాన్ని ఆధునీకరించి ఆర్థికంగా మెరుగైన స్థితికి చేర్చేందుకు అంచనాలు రూపొందిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది శిల్పారామాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. ప్రస్తుతం కడపతోపాటు తిరుపతి, విశాఖ, అనంతపురం, పుట్టపర్తిలలో శిల్పారామాలు ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు, కాకినాడ, విజయనగరంలలో పనులు సాగుతున్నాయి. 21న కర్నూలులో శిల్పారామానికి శంకుస్థాపన నిర్వహించనున్నాం. -
ఆహ్లాదం కరువు
శిల్పారామం... ఈ పేరు ఎత్తితే చాలు అక్కడ అభివృద్ధి చేసిందంతా తామేనని ఊరూ వాడా తేడాలేకుండా ఢంకా భజాయిస్తున్నారు కొందరు అధికార పార్టీ నేతలు. ఆహ్లాదం కోసం పార్కులో ఏర్పాటు చేసిన కొలనులో నీళ్లు లేకపోవడంతో ఎండిపోయిన చెరువును తలపిస్తోంది. పార్కులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇదేమి అభివృద్ధి అంటూ పెదవివిరుస్తున్నారు. కొలనులో ఉన్న బాతులు, కొంగలు కూడా కొద్ది పాటి నీరులోనే సేద తీరుతున్నాయి. -
శిల్పారామంలో చిరు గజ్జెల రవళి
పీఎం పాలెం : దశాబ్దాల సాంస్కతిక చరిత్ర కలిగి ఉన్న నగరంలోని టీఎస్ కళాసమితి 43 వార్షికోత్సవాలు శిల్పారామం(జాతర)లో గల కల్యాణ మండపం హాలులో ఆదివారం ఘనంగా జరిగాయి. ఉత్సహాల్లో భాగంగా ఉదయం బాల కళాకారుల ప్రదర్శన ప్రేక్షకులను అబ్బురపరిచింది. వందమంది చిన్నారులు అంతా సాయిమయం అనే గీతానికి అలవోకగా కూచిపూడి నృత్యం ప్రదర్శించి ఉత్సవానికి వన్నె తెచ్చారు. 62 సంవత్సరాల వయసులో ... ఈ ఉత్సవాలలో మరో ప్రతేక్యత అన్నమయ్య విరచితం ‘ఒకపరి .. ఒకపరి’ కీర్తనకు ఆకుల సుశీల (62) ప్రదర్శించిన శాస్త్రీయ నత్యం. ఈమె కూడా టీఎస్ కళా సమితిలో నత్యశిక్షణ పొందారు. తాను నేర్చుకున్న నత్యాన్ని వివిధ సందర్భాల్లో ప్రదర్శన ఇస్తూ కళామతల్లికి సేవ చేస్తున్నారు. అలాగే రఘువంశ సుదాంబుది చంద్రశ్రీ... అంటూ సాగిన కీర్తనకు వేదికపై కళాకారుల నత్య ప్రదర్శన అలరించింది. ఉత్సవం ముగింపు కార్యక్రమానికి హాజరైన దక్షిణ నియోజక వర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ తాను కూడా టీఎస్ కళాసమితిలో నత్య శిక్షణ పొందానన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు ఎంతోమంది కూచిపూడి నృత్యంలో రాణించి కీర్తి ప్రతిష్టలు ఆర్జించారన్నారు. ఉత్తమ కళాకారులకు పురస్కారాలు కూచిపూడి నృత్యంలో నిష్ణాతులైన ఎం.శివజ్యోతి, బి.విజయజ్యోతి, పి.అరుణ్ సాయికుమార్, ఎన్. సదాశివుడు, ఎం. కామాక్షీ త్రిపుశ్రీలను వేదికపై టీఎస్ కళాసమితి వ్యవస్థాపకులు ప్రతాప్ మాస్టారి స్మారక పురస్కారాలు ఎంఎల్ఏ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కొసనా, నాట్యాచార్యులు టి. కల్యాణి, కె. వినయ్ ప్రకాష్, నాగరాజు పట్నాయక్, ఎ. కిషోర్, ఉమాపతి వర్మ, టి. కల్యాణి, తదితరులు పాల్లొన్నారు. కూచిపూడి నృత్యానికి మంచి రోజులు కూచిపూడి నృత్యం పట్ల నేటి యువతకు సద్భావం ఉంది. ఇది మంచి పరిణామం. ప్రస్తుతం నేను ఆంధ్రాయూనివర్సిటీ నృత్య విభాగంలో తాత్కాలిక ఆచార్యునిగా పనిచేస్తున్నాను. సాయికుమార్ కళాసమితిని స్థాపించి ఆసక్తి కల చిన్నారులకు నత్య శిక్షణ ఆస్తున్నాను. –పి.అరుణ్ సాయి కుమార్, నాట్యాచార్యులు వేలమందికి నృత్య శిక్షణ టీఎస్ కళాసమితి ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకూ సుమారు 6 వేల మందికి పైగా కూచి పూడి నృత్యంలో శిక్షణ పొందారు. నత్యంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నృత్యప్రదర్శనలు ఇచ్చి, తద్వారా కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన వారెందరో ఉన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారెందరో సొంతంగా నత్య శిక్షణ సంస్థలు నెలకొల్పి రాణిస్తున్నారు. –ఎస్.హేమసాయి, నత్య శిక్షకులు నృత్యంతో అందం, ఆరోగ్యం ప్రస్తుతం నా వయస్సు 62. బ్యాంకు ఆఫ్ బరోడాలో ఆఫీసర్ ర్యాంకులో పదవీ విరమణ చేశాను. భారతీయ సంప్రదాయాలు, కూచిపూడి నృత్యం అంటే ఎంతో ఇష్టం. 53 సంవత్సరాల వయసులో టీఎస్ కళాసమితిలో చేరి నృత్య శిక్షణ పొందాను. అప్పటి నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా నృత్య ప్రదర్శనలు ఇస్తున్నాను. నృత్య కళాకారిణిగా గర్వ పడుతున్నాను. ప్రదర్శనకు నా వయసు అడ్డుగా నేను భావించడం లేదు. అందం, ఆరోగ్యాలకు నృత్యం ఎంతో ఉపయోగ పడుతుందని విశ్వసిస్తున్నాను. కళాసమితి వార్షికోత్సవంలో నృత్య ప్రదర్శన ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. –ఆకుల సుశీల, విశాఖపట్నం -
బ్యూటీ ఫుల్.. బతుకమ్మ
-
బ్యూటీ ఫుల్.. బతుకమ్మ
-
బ్యూటీ ఫుల్.. బతుకమ్మ
సద్దుల సద్దు మోగకముందే.. ఆనందం అంబరాన్నంటింది. రంగురంగుల బతుకమ్మకు అన్ని రంగాల ఆడపడుచులు ఆటపాటలతో ఆరాధించారు. తీరొక్క పూల కొమ్మకు తమదైన రీతిలో ఉయ్యాల పాటలు వినిపించారు. సంబరాల వేడుకను సయ్యాటలతో జరుపుకున్నారు. కళాకారులు, యాక్టర్లు, యాంకర్లు, లాయర్లు, క్రీడాకారిణులు.. పిన్నలు, పెద్దలు, రాజకీయ రమణులు.. ఇలా అన్ని రంగాలకు చెందిన మగువలు జనజాతరలో మమేకమయ్యారు. బతుకమ్మ పాటకు.. దాండియా ఆటను జోడించి కలర్‌ఫుల్ వేడుకను కళ్లముందుంచారు. గౌరమ్మకు జానపదాలతో గళార్చన చేసి మురిపెంగా గంగ ఒడికి చేర్చారు. సెల్కాన్ సౌజన్యంతో సాక్షి ‘సిటీప్లస్’ ఆధ్వర్యంలో శిల్పారామంలో మంగళవారం జరిగిన బతుకమ్మ సంబరాలు.. సైబర్వనంలో గునుగు పూల పరిమళం వెదజల్లింది. - సాక్షి, సిటీప్లస్ ‘ఆడబిడ్డకు బతుకునిమ్మంటూ ఉయ్యాలో... ఆడ బిడ్డకు బతుకునివ్వమంటూ ఉయ్యా లో... బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’.. పాటలతో పచ్చని ఆవరణ అణువణువూ ప్రతిధ్వనించింది. ఈ పాటలకు రాగం కలిపిన వారిలో రాజకీయనేతలూ ఉన్నారు. కాలు కదిపిన వారిలో కళాకారులూ ఉన్నారు. లాంగ్గార్డెన్లో ఒక వైపుగా నెలకొల్పిన బంగారు పూల బతుకమ్మ కాంతులు వెదజల్లింది. మధ్యలో ఏర్పాటు చేసిన చిన్న వేదికపై ఒక్కొక్కరుగా బతుకమ్మలను అమర్చారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రముఖ న్యూస్‌రీడర్ స్వప్న స్వాగత వచనాలతో సెలబ్రిటీల రాక ప్రారంభమైంది. ఒకరి వెంట ఒకరుగా వచ్చిన విభిన్న రంగాల ప్రముఖులు బతుకమ్మ సంబరాలకు సిద్ధమయ్యారు. తెలంగాణ సంప్రదాయ సంగీత రీతులను ఆస్వాదిస్తూ, ముచ్చట్లతో గడిపారు. అందరూ హాజరైన అనంతరం ఆటపాటలకు తెరలేచింది. సంప్రదాయానికి వందనం.. మెత్తని పచ్చిక మీద నర్తించిన పాదాలు... ప్రకృతికి ప్రణమిల్లిన తెలంగాణ సంప్రదాయానికి ఘన వందనాలు అర్పించాయి. అచ్చమైన తెలంగాణ ప్రాంత గ్రామీణ మహిళలు అందించిన సహకారాన్ని ఆనందంగా అందుకుంటూ.. అక్కడికక్కడే ఆటపాటల్లో ఇన్స్టంట్ ట్రైనింగ్ తీసుకుని మరీ పలువురు సినీ, గ్లామర్ రంగపు అమ్మాయిలు ఆడిపాడిన తీరు అందరినీ అలరించింది. మన పండుగ అంటే మనది మాత్రమే కాదు మన లో మమేకమైన అందరిదీ అనే సరికొత్త సిద్ధాంతానికి జన్మనిచ్చిందీ సంబరం. పురుషులమైతేనేం.. ఆటపాటలకు మేము సైతం సై అంటూ పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ వంటివారు సైతం పాల్గొనడం విశేషం. అపురూప ‘కళ’యిక... రాత్రి 9గంటల దాకా నిర్విరామంగా సాగిందీ సందడి. రాజకీయనేతలు, యువ సినీతారలు, అందాల రాణులు, సంప్రదాయ కళాకారులు... ఇలా విభిన్న రంగాలకు చెందిన మహిళల అపూర్వ కలయికతో తెలంగాణలోనే ఇప్పటిదాకా జరిగిన వాటిల్లో అత్యంత వైవిధ్యభరిత వేడుకగా నిలిచింది. ఈ సంబరంలో శిల్పారామం సందర్శకులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన సినీ, రాజకీయ, గ్లామర్ రంగ ప్రముఖుల ఆటోగ్రాఫ్స్ తీసుకుంటూ, ఫొటోలు దిగుతూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. కోలాహలంగా దాండియా... దసరా వేడుకలో భాగంగా సిటీప్లస్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాండియా కార్యక్రమం సైతం అతిథులను ఉర్రూతలూగించింది. రంగు రంగుల స్టిక్స్‌ను చేతబూనిన యువతులు, సెలబ్రిటీలు శిల్పారామం ఆవరణకు కొత్త శోభను అద్దారు. దాదాపు 2 గంటలకు పైగా సాగిన దాండియా సంబరంలో సందర్శకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంజాయ్ చేశారు. అద్భుతమైన సంగీత నేపధ్యంలో సాగిన ఈ సందడిని తమకు సమర్పించిన సాక్షి సిటీప్లస్కు వీరంతా హ్యాట్సాఫ్ చెప్పారు. ఆకట్టుకున్న ఆర్జే సూర్య... కార్యక్రమం ముగింపు సందర్భంగా బిగ్ ఎఫ్ ఎమ్ ఆర్జే సూర్య అందించిన మిమిక్రీ హర్షధ్వానాలు అందుకుంది. అటు మెగాస్టార్ నుంచి ఇటు సూపర్‌స్టార్ దాకా పలువురు నటుల్ని ఆయన అనుకరించిన తీరు, అందుకు గాను అల్లుకున్న కథనం అహుతుల్ని నవ్వుల్లో ముంచెత్తింది. స్వరాష్ట్రంలో తొలిసారి.. ఇది మహిళల పండుగ. కులాలకు అతీతంగా అందరి మధ్య అనుబంధాలను పెంచే పండుగ. తొలిసారి సొంత రాష్ట్రంలో అధికారికంగా సెలిబ్రేట్ చేసుకోవడాన్ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. - శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే సామాజిక పండుగ.. ఆటపాటలు, ఆడవాళ్ల ముచ్చట్లు, ఇరుగుపొరుగు క్షేమసమాచారాలు.. ఇలా అన్నీ కలసి బతుకమ్మ ఓ సామాజిక పండుగలా అనిపిస్తుంది. - కార్తీక రెడ్డి, నగర మాజీ మేయర్ పూల పండుగ బతుకమ్మ అంటే పూల పండుగ. పూలను పూజించే పండుగ. ప్రకృతి ఒడిలో పుట్టిన అందమైన పూలను సేకరించడం మొదలు.. వాటిని గౌరమ్మగా తీర్చిదిద్ది.. ఆటపాటలతో ఎంతో ఆసక్తిగా సాగే పండుగ. - రేష్మ, సినీనటి తెలంగాణ ఆయువుపట్టు తెలంగాణ సంప్రదాయానికి బతుకమ్మ ఆయువుపట్టు. బతుకమ్మ పాటను మించిన చైతన్య గీతం మరొకటి లేదు. చరిత్ర మొదలు చుట్టుపక్కల జరిగే విషయాల వరకూ అన్నీ బతుకమ్మ పాటల్లో భాగమవ్వడమే ఈ పండుగ ప్రత్యేకత. - డాక్టర్ బండారు సుజాత శేఖర్, రచయిత్రి అన్నింటా ముందుకు.. ఈ బతుకమ్మకు అందరూ ఒక చోట చేరడం నాకు చాలా హ్యాపీగా ఉంది. బతుకమ్మను తెలంగాణ రాష్ట్రం ఇంత గొప్పగా సెలబ్రేట్ చేయడం చాలా బాగుంది. ఇప్పట్నుంచి తెలంగాణ అన్నింటా ముందుండాలని కోరుకుంటున్నాను. - నైనా జైస్వాల్, టీటీ ప్లేయర్ రంగుల బతుకమ్మలు.. బతుకమ్మ గొప్పదనం కళ్లకు కట్టినట్టుగా కనిపించింది ఇక్కడ. బాగా ఎంజాయ్ చేశాను. అందరూ రంగురంగుల చీరల్లో బతుకమ్మల్లా మెరిశారు. - అనూష, విజే పోరు బాట.. హోరు పాట తెలంగాణ పోరుబాటలో బతుకమ్మ ఆటపాటలు కీలక భూమిక పోషించాయి. రాష్ట్ర సాధన ఉద్యమంలో బతుకమ్మలు చేతబూని ఉద్యమించిన మగువలందరూ ఇప్పుడు వేడుకగా జరుపుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే బతుకమ్మ వైభవం దేశవ్యాప్తంగా విస్తరించాలి. ఈ పండుగ ఒక్క ప్రాంతానికి పరిమితం కాకూడదు. అన్ని వర్గాల ప్రజలను ఈ పండుగలో భాగస్వాములను చేయాలి. అప్పుడే ఈ జనం పండుగ ఘనంగా జరిగినట్టు అవుతుంది. - డీకే అరుణ, మాజీ మంత్రి దేశమంతా ఆడాలి.. బతుకమ్మను అందంగా పేర్చడం వచ్చు. అమ్మమ్మ పాట పాడుతుంటే మా పెదనాన్న, చిన్నాన్న, పిల్లలమంతా కలసి ఆడేవాళ్లం. అడుగులో అడుగేస్తూ సాగే బతుకమ్మ ఆట ఆడటం కూడా ఒక కళే. తెలంగాణ వచ్చాక దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. మన బతుకమ్మను దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకునేలా చేసే బాధ్యత మనదే. - అలేఖ్య పుంజల పట్నం వచ్చిన తల్లి పల్లెపల్లెను.. ప్రతి గడపను పలకరించిన బతుకమ్మ.. ఇప్పుడు నగరానికి వచ్చేసింది. సిటీలో అన్ని చోట్ల ఘనంగా జరుపుకుంటున్న బతుకమ్మ వేడుకలే దీనికి నిదర్శనం. బతుకమ్మ పండుగ .. ప్రకృతిని కొలిచే పండుగ. అమ్మవారిని ఆటపాటలతో పూజించే పండుగ ఇది. - వి. మమత , టీజీవో అధ్యక్షురాలు - ఫొటోలు: ఠాకూర్, రాజేష్ సృజన్, రాజేష్ రెడ్డి -
4జీ వైఫై... వస్తోందోయ్!
ఎప్పుడూ నాలుగు గోడల మధ్య కూర్చొని పని చేయడం కంటే అప్పుడప్పుడూ ఆరుబయట కూర్చొని ప్రకృతి అందాలను తిలకిస్తూ... పక్షుల కిలకిలారావాలు వింటూ విధులు నిర్వహిస్తే ఎంత బాగుంటుందో కదూ... ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు బోర్ కొట్టకుండా ఉండేందుకు ఇలాంటి వాతావరణాన్ని కోరుకుంటుంటారు. త్వరలో వారి కల నెరవేరబోతోంది. మాదాపూర్‌లో 4జీ వైఫై సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. మాదాపూర్: మాదాపూర్‌లో త్వరలో 4జీ వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఐటీ కారిడార్‌లో వైఫై సేవలందించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. ఐటీ ఉద్యోగులతో పాటు విద్యార్థులు, వ్యాపారులు, సాధారణ ప్రజలూ వైఫై సేవలు వినియోగించుకునేందుకు వీలుంటుంది. మాదాపూర్ శిల్పారామంలో వైఫై పనులు చురుగ్గా సాగుతున్నాయి. రిలయన్స్ సంస్థ 4జీ వైఫై అండర్ గ్రౌండ్ కేబుల్ పనులు దాదాపు పూర్తి చేసింది. శిల్పారామంలో ప్రతి 250 మీటర్ల దూరానికి ఆరేసి వైఫై పాయింట్లను ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారం లాన్ వద్ద, ఆంపీ థియేటర్, నైట్‌బజార్, రూరల్ మ్యూజియం, కోనసీమ, రద్దీగా ఉండే ప్రాంతాలలో పాయింట్లు ఏర్పాటు చేశారు. త్వరలో 4జీ సేవలను సందర్శకులకు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆంపీ థియేటర్ వద్ద గ్రౌండ్ బాస్ మాస్ట్ (జీబీఎం)ను ఏర్పాటు చేశారు. ఈ జీబీఎం 500 మీటర్ల రేడియేషన్‌ను కవర్ చేస్తుంది. దాదాపుగా శిల్పారామంలోని అన్ని ప్రాంతాలకు వైఫై అందుబాటులో ఉంటుంది. హైటెక్ సిటీలో... సైబర్ పెరల్, హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్, హెచ్ఐసీసీ వద్ద కూడా వైఫై పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో మాదాపూర్‌లోని ఐటీ కారిడార్‌లో వైఫై సేవలు అందుబాటులోకి వచ్చే వీలుంది. -
అందాల ఖాదీ
తారలు దిగివచ్చి మలె ్లలు కురిపిస్తే ఎలా ఉంటుందో శిల్పారామంలో శుక్రవారం కనిపించింది. సంప్రదాయ రీతిలో నిఫ్ట్ విద్యార్థులు సాగించిన ఫ్యాషన్ పెరేడ్ అదరహో అనిపించింది. ఆదరణ కోల్పోతున్న ఖాదీ, హ్యాండ్లూమ్ డిజైనింగ్స్‌ను ప్రమోట్ చేస్తూ వారు నిర్వహించిన ఎత్నిక్ ఫ్యాషన్ షో ఆహూతులను కట్టిపడేసింది. ఖాదీ, హ్యాండ్లూమ్స్ డిజైనింగ్స్ ధరించి విద్యార్థులు చేసిన ర్యాంప్‌వాక్ అంద ర్నీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శిల్పారామం ప్రత్యేకాధికారి మధుసూదన్, నిఫ్ట్ డెరైక్టర్ ఎన్జే రాజాంరాం తదితరులు పాల్గొన్నారు. - మాదాపూర్ -
శిల్పారామంలో తెలుగు తమ్ముళ్ల వీరంగం
తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. నిన్న కాక మొన్న తిరుపతిలో టీడీపీ నాయకులు మద్యం తాగివచ్చి దుకాణాలను ధ్వంసం చేయగా, ఇప్పుడు అనంతపురంలో కూడా అదే తరహాలో ప్రవర్తించారు. (చదవండి: తిరుమలలో తెలుగు తమ్ముళ్ల వీరంగం) అనంతపురం పట్టణంలో ఉన్న శిల్పారామానికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు అక్కడున్న ఫర్నిచర్‌ను, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపైన, ఇతర కార్యకర్తలు, నాయకులపైన శిల్పారామం కాంట్రాక్టర్ వేణుగోపాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేశారు. -
బిగ్‌బజార్ సంపూర్ణ మహిళ ముగింపు ఉత్సవం
-
బైక్ రైడర్ల సాహసాలు
-
శిల్పారామం..ఎల్లిపోతాంది!
నిధులున్నా ప్రారంభంకాని పనులు =స్థలం ఆక్రమణ వల్లే అంటున్న పర్యాటక శాఖ.. =ఆ బూచితో తరలించాలని చూస్తున్నదంటున్న రెవెన్యూ శాఖ =కలెక్టర్ ఆదేశంతో తిరిగి సర్వే.. సాక్షి ప్రతినిధి, వరంగల్ : కనుమరుగవుతున్న పల్లె సంస్కృతిని ప్రస్తుత తరాలకు చాటిచెప్పే శిల్పారామం నిర్మాణంపై సందిగ్ధం నెలకొంది. హస్తకళలకు పునరుజ్జీవం కల్పించే శిల్పారామం జిల్లాలో నిర్మాణమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఐదేళ్ల క్రితం మంజూరైన ఈ ప్రాజెక్టుకు నిధుల కొరత లేకున్నా అధికారుల చిత్తశుద్ధిలేమి సమస్యగా మారింది. శిల్పారామం ప్రాజెక్టుకు కేటాయించిన స్థలం ఆక్రమణలకు గురవడం వల్లే నిర్మాణ పనులు మొదలు పెట్టడం లేదని పర్యాటక శాఖ... కేటాయించిన స్థలంలో ఎలాంటి ఆక్రమణలు లేవని రెవెన్యూ శాఖ అధికారులు చెప్పుకుంటూపోతున్నారు. రెండు శాఖల మధ్య సమన్వయలేమితో శిల్పారామం నిర్మాణం ముందుకు సాగడం లేదు. కేటాయించిన స్థలంలో ఆక్రమణలను సాకుగా చూపి శిల్పారామం ప్రాజెక్టును జిల్లా నుంచి తరలిం చేందుకు పర్యాటక శాఖ ప్రయత్నిస్తోందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నా యి. ప్రాజెక్టు పనుల తీరు చూసినా ఇదే పరిస్థి తి కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలో నిర్మించే శిల్పారామం కోసం నాలుగు నెలల క్రితమే రూ.5 కో ట్ల గ్రాంటు విడుదలైంది. కాకతీయ ఉత్సవాల ప్రారంభం సమయంలోనే శిల్పారామంను ప్రారంభిస్తామని చెప్పిన పర్యాటక శాఖ... ఉత్సవాలు మగిసినా ఇప్పటికీ స్థలం చదును చేయకపోవడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. రెండు నెలల క్రితం జిల్లాకు వచ్చిన శిల్పారామం విభాగం అధికారులు సైతం వెంటనే నిర్మాణ పనులు చేపడతామని చెప్పినా పనులకు మోక్షం లభించడం లేదు. మంచినీటి రిజర్వాయర్లకు సంబంధించి కార్పొరేషన్ అధికారులతో మంగళవారం కలెక్టర్ జి.కిషన్ వద్ద జరిగిన సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాలకు భూమి కేటాయింపు పై చర్చ జరిగింది. శిల్పారామం ప్రారంభం కాకపోవడానికి ఆక్రమణలే కారణమని ప్రస్తావన వచ్చింది. దీంతో కలెక్టర్ జి.కిషన్ రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలి సింది. శిల్పారామం నిర్మాణానికి కేటాయించిన స్థలంలో ఎలాంటి ఆక్రమణలూ లేకుండా చూ డాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు సెలవు రోజైన బుధవారం శిల్పారామం స్థలానికి వెళ్లి సర్వే చేశారు. నివేదికను తయారు చేసి కలెక్టరుకు ఇచ్చేందుకు సన్నద్ధమయ్యారు. ఈ సర్వే తర్వాత కూడా పనులు మొదలుకాకుంటే... శిల్పారామం ఇతర జిల్లాలకు వెళ్లిపోవడం ఖాయమని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. 2008లోనే నిర్ణయం వరంగల్ నగరపాలక సంస్థ పరిధిలోని గోపాలపురంలో రూ.5 కోట్లతో శిల్పారామం ఏర్పా టు చేయాలని చేయాలని 2008లో వైఎస్ రాజ శేఖరరెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. 89 సర్వే నంబరులోని చెరువు శిఖం భూమిలో 17.5 ఎకరాలను రెవెన్యూ శాఖ ఈ ప్రాజెక్టు కోసం ఇ చ్చింది. హస్తకళలను, కళాకృతులను ప్రదర్శిం చేందుకు 25 స్టాళ్లు, ఆడిటోరియం, ఓపెన్ఎయి ర్ థియేటర్‌తో శిల్పారామం నిర్మించేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన హస్తకళాకారులు జి ల్లాలో ఉన్నప్పటికీ వారి కళలను ప్రదర్శించేం దుకు వేదిక కరువైంది. శిల్పారామం పూర్తయితే పెంబర్తి, చేర్యాల కళాకారులకు మంచి ఊతం లభించేంది. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వేదిక అందుబాటులోకి వచ్చేంది. జిల్లా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, అధికారుల చిత్తశుద్ధితో ఇప్పుడు శిల్పారామం ఏర్పాటు డోలాయమానంలో పడింది.