తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. అనంతపురం శిల్పారామంలో విధ్వంసం సృష్టించారు.
తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. నిన్న కాక మొన్న తిరుపతిలో టీడీపీ నాయకులు మద్యం తాగివచ్చి దుకాణాలను ధ్వంసం చేయగా, ఇప్పుడు అనంతపురంలో కూడా అదే తరహాలో ప్రవర్తించారు. (చదవండి: తిరుమలలో తెలుగు తమ్ముళ్ల వీరంగం)
అనంతపురం పట్టణంలో ఉన్న శిల్పారామానికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు అక్కడున్న ఫర్నిచర్ను, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపైన, ఇతర కార్యకర్తలు, నాయకులపైన శిల్పారామం కాంట్రాక్టర్ వేణుగోపాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేశారు.