ఒళ్లు దగ్గర పెట్టుకో...లేదంటే | Behave yourself Amazon, Shaktikanta Das lashes out at the e-com giant | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 16 2017 4:42 PM | Last Updated on Thu, Mar 21 2024 8:44 PM

ఈ కామర్స్ జెయింట్ అమెజాన్ కు మరో గట్టి షాక్ తగిలింది. స్వయానా విదేశాంగ మంత్రి తీవ్ర హెచ్చరికలు జారీ చేసినా తీరు మార్చుకోకపోవడంపై తీవ‍్ర అగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా దేశంలోని రెండవ అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ అత్యుత్సాహంపై ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ మండిపడ్డారు. భారత గౌరవ చిహ్నాల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టేనని అమెజాన్ కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. భారత చిహ్నాలు, చిహ్నాలను గురించి వాచాలత్వాన్ని ప్రదర్శించడాన్ని ఒక భారతీయుడిగా సహించలేక పోతున్నానంటూ ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న భారత జాతీయ పతాకంతో కూడిన డోర్ మేట్స్ .. ఇప్పుడు గాంధీ బొమ్మలు ముద్రించిన చెప్పులు విక్రయంపై ఆయన స్పందించారు. మర్యాదగా ప్రవర్తిస్తే మంచిది.. లేదంటే ప్రమాదం తప్పదంటూ వరుస ట్వీట్లలో హెచ్చరించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement