lashes out
-
వర్షం వస్తే.. నగరం నరకం!
సాక్షి, హైదరాబాద్: నగరంలో గత వరద అనుభవాలతో లోతట్టు, సమస్యాత్మక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ముంపు సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్ఎన్డీపీని ఏర్పాటు చేసింది. పనులు చేపట్టడంలో జరిగిన ఆలస్యంతో ఎక్కడా పనులు పూర్తికాలేదు. దీంతో.. తాత్కాలిక ఉపశమనంగా ఎక్కడికక్కడ వాననీరు నిల్వకుండా వెంటనే తొలగించేలా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. అన్ని జోన్లలోని నాలాల వెంబడి క్షేత్రస్థాయి సర్వేలతో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించారు. అక్కడ భద్రత చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎస్ఎన్డీపీ కింద దాదాపు రూ.747 కోట్ల విలువైన 37 వరద కాల్వల పనులు చేపట్టారు. బాటిల్ నెక్స్‌గా ఉన్న నాలాలు వెడల్పు చేయడం, బాక్స్డ్రెయిన్ల నిర్మాణం, రీమోడలింగ్, వంటి పనులు వీటిల్లో ఉన్నాయి. పనులైతే మొదలైనప్పటికీ, ఇవి ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రాణనష్టం వాటిల్లకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో ఆమేరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంకా పూర్తికాని పనులు.. ఇవి కాక 2000 సంవత్సరంలో జరిగిన ఘటనల్ని దృష్టిలో ఉంచుకొని వెడల్పు తక్కువగా ఉన్న నాలాలకు పైకప్పుల ఏర్పాటు, అన్ని నాలాలకు అవసరమైన మరమ్మతులు, పైప్లైన్లు, డ్రెయిన్ల ఏర్పాటు వంటి పనుల కోసం రూ.298.34 కోట్లు మంజూరు చేశారు. మొత్తం 468 పనులకు రూ.139.78 కోట్లతో 98 పనులు పూర్తిచేశారు. రూ. 94.11కోట్ల విలువైన 98 పనులు కొనసాగుతున్నాయి. కోర్టు వివాదాలు తదితరమైన వాటితో రూ.5.82 కోట్ల విలువైన 19 పనులు పనులు రద్దు చేశారు. మిగతా పనులు ఆయా దశల్లో ఉన్నాయి తప్ప పూర్తి కాలేదు. ఎమర్జెన్సీ టీమ్స్.. వర్షాకాల ఫిర్యాదులపై వెంటనే రంగంలోకి దిగి వాన నీటినిల్వలు తొలగించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బందితో 168 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, 160 స్టాటిక్ లేబర్ టీమ్స్ ఏర్పాటు చేశారు. స్టాటిక్టీమ్స్ నీరు నిలిచే ప్రాంతాలకు దగ్గరలో ఉండి వెంటనే నీటిని తోడిపోస్తాయి. అందుకు 237 పంప్సెట్లను సమకూర్చుకున్నారు. అక్టోబర్ వరకు పనిచేసే ఈటీమ్స్ కోసం రూ. 36.98కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. ఇవి కాక ప్రధాన రహదారుల మార్గాల్లో రోడ్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ ఏజెన్సీలు తమ మార్గాల్లో పనుల కోసం 29 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవి జీహెచ్ఎంసీ నుంచి కాగా, వాటర్‌బోర్డు, విద్యుత్ విభాగాల అధికారులు సైతం జీహెచ్ఎంసీ కాల్సెంటర్కందే ఫిర్యాదులు పరిష్కరించేలా జీహెచ్ఎంసీ కాల్సెంటర్లో 040– 21 11 11 11 ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు. ►ఎక్కడైనా రోడ్లపై నీరు, మురుగు నిలిచినా, విద్యుత్ సమస్యలు తలెత్తినా ఇవి వెంటనే రంగంలో దిగుతాయని మేయర్ పేర్కొన్నారు. ప్రాణాపాయం జరగకుండా పటిష్ట చర్యలు.. ►900కుపైగా ప్రాంతాలకు ఇన్చార్జి అధికారులు ►వర్షాల కారణంగా ఎక్కడా, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడటంతోపాటు ►సమస్యాత్మక ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పనులు చేపట్టేందుకు వీలుగా అధికారులను ఇన్చార్జులుగా నియమించారు. ►ఎల్బీనగర్ జోన్లో 74 సమస్యాత్మక ప్రాంతాలకు 76 మంది అధికారులను ఇన్చార్జులుగా నియమించారు. చార్మినార్ జోన్లో 52 సమస్యాత్మక ప్రాంతాలకు 32 మంది అధికారులను, ఖైరతబాద్జోన్లోని 711 ప్రాంతాలకు 81 మంది అధికారులను, శేరిలింగంపల్లి జోన్‌లోని 52 సమస్యాత్మక ప్రాంతాలకు 52 మంది అధికారులను, కూకట్పల్లి జోన్‌లోని 48 సమస్యాత్మక ప్రాంతాలకు 49 మంది అధికారులను,సికింద్రాబాద్ జోన్‌లోని 55 సమస్యాత్మ కప్రాంతాలకు 79 మంది అధికారులను ఇన్‌ఛార్జులుగా నియమించారు. వారి నేతృత్వంతో దిగువస్థాయి సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి వాన సమస్యల్ని పరిష్కరిస్తారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
పవన్ కళ్యాణ్‌పై హోంమంత్రి సుచరిత మండిపాటు
-
ఆఫ్ఘన్ బౌలర్‌పై ఆఫ్రిది తిట్ల పురాణం
కొలంబొ : శ్రీలంకలో జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్‌లో సోమవారం కాండీ టస్కర్స్, గాలే గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కాండీ టస్కర్స్ 25 పరుగుల తేడాతో గాలే గ్లాడియేటర్స్‌పై గెలుపొందింది. మ్యాచ్ ముగిసిన అనంతరం షేక్ హాండ్ ఇచ్చుకునే సందర్భంలో గ్లాడియేటర్స్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ప్రత్యర్థి ఆటగాడిపై తిట్లతో విరుచుకుపడ్డాడు. అసలు విషయంలోకి వెళితే.. గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్న మహ్మద్ ఆమిర్, టస్కర్స్ బౌలర్ నవీన్ హుల్ హక్ మధ్య మాటల యుద్దం చోటుచేసుకుంది. నవీన్ హుల్ హక్ ఆమిర్నుద్దేశించి స్లెడ్జింజ్‌కు పాల్పడ్డాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమిర్ నవీన్వైపు దూసుకెళ్లాడు. ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకోవడానికి తయారయ్యారు. ఇంతలో మునాఫ్ పటేల్ సహా ఇతర ఆటగాళ్లు వారిద్దరిని అడ్డుకున్నారు. (చదవండి : బంతి పట్టనున్న శ్రీశాంత్.. రైనా శుభాకాంక్షలు) మ్యాచ్ అనంతరం షేక్‌హ్యాండ్ ఇచ్చుకునే సందర్భంలో గ్లాడియేటర్ కెప్టెన్ ఆఫ్రిది అందరితో సరదాగానే చేతులు కలిపాడు. తీరా నవీన్ హుల్ హక్ దగ్గరకు రాగానే ముఖం కోపంగా పెట్టి.. అతనిపై విరుచుకుపడ్డాడు. ఏమైంది నీకు.. ఎందుకు అమిర్‌తో అలా ప్రవర్తించావు. ఒక సీనియర్ బౌలర్‌పై ఈ విధంగా వ్యవహరించడం తప్పు .. అంటూ కోపంతో పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కాండీ టస్కర్స్ బ్రెండన్ టేలర్, కుషాల్ మెండిస్ బ్యాటింగ్‌లో మెరవడంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గ్లాడియేటర్స్ 171 పరుగుల వద్దే ఆగిపోయింది. దనుష్క గుణతిలక ఒక్కడే 53 బంతుల్లో 82 పరుగులతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ ఆఫ్రిది గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆఫ్రిది నాయకత్వంలోని గ్లాడియేటర్స్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అన్నీ ఓడిపోయి చివరిస్థానంలో ఉండగా.. టస్కర్స్ మాత్రం తొలి విజయం నమోదు చేసింది. కాగా ఎల్పీఎల్లో మొదటిస్థానంలో జఫ్నా స్టాలియన్స్ మొదటిస్థానంలో ఉండగా.. కొలంబొ కింగ్స్ రెండో స్థానంలో కొనసాగుతుంది. (చదవండి : సచిన్, సెహ్వాగ్ లాంటి ఆటగాళ్లు టీంలో లేరు..) -
టెల్కోలపై సుప్రీం తీవ్ర ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: టెలికం సంస్థలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. ఏజీఆర్ బకాయిల ఛార్జీల చెల్లింపుల విషయంలో ఎలాంటి ఎలాంటి పునఃసమీక్ష ఉండదని తేల్చి చెప్పింది. ఇందుకు అనుమతినిచ్చిన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ)పై సుప్రీంకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజీఆర్‌ను లెక్కించేందుకు మరోసారి ప్రయత్నించవద్దని స్పష్టం చేసింది. ఈ విషయంలో స్వీయ మదింపు చేసుకున్న కంపెనీలపై కూడా కోర్టు మొట్టికాయలు వేసింది. అసలు వీటిని ఎవరు సమీక్షించమన్నారంటూ జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లుగా పేర్కొంది. గత ఏడాది అక్టోబర్ 24 న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు నిర్ణయించిన ఏజీఆర్ బకాయిలను స్వీయ అంచనా వేయడం లేదా తిరిగి అంచనా వేయడం ఉండదని స్పష్టం చేసింది. బకాయిలు వసూలుపై ప్రభుత్వ తీరుపై కూడా కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సుప్రీం పునర్స మీక్షకు గడువు ఇవ్వాలన్న కేంద్రం వాదనను తోసిపుచ్చింది. కోర్టును ప్రభావితం చేయడానికి ప్రతిఒక్కరూ ప్రయత్నిస్తున్నారని, కానీ అది సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఒకవేళ మళ్లీ తిరిగి సమీక్షిస్తే కోర్టు గతంలో తప్పుచేసినట్లు అవుతుందని, ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒప్పుకునేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బకాయిల చెల్లింపుల పునర్సమీక్షకు అనుమతించిన అధికారుల్ని సహించేది లేదని హెచ్చరించింది. టెలికం కంపెనీలు తప్పనిసరిగా ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సిదేనని గత ఆక్టోబర్‌లోనే సుప్రీంకోర్టు తీర్పుఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బకాయిల్ని మళ్లీ సమీక్షించాలంటూ అనేకసార్లు కోర్టును ఆశ్రయించాయి టెలికాం కంపెనీఉ. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని సైతం ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత నెలలోనూ సుప్రీంకోర్టు సంస్థలపైనా, ప్రభుత్వంపై విరుచుకుపడింది. దీంతో కొన్ని సంస్థలు బకాయిల్లో కొంత మొత్తాన్ని చెల్లించాయి. కానీ మరోసారి కోర్టు సమీక్షిస్తే కొంత మినహాయింపు లభించే అవకాశం ఉందని భావించిన సంస్థలు వేచిచూశాయి. కానీ తాజా మరోసారి సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో బకాయిలే పూర్తిగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఏజీఆర్ బకాయిల చెల్లింపులు 20 ఏళ్ల పాటు వాయిదాల రూపంలో చెల్లించేందుకు సంస్థలకు వెసులుబాటు కల్పిస్తూ విధివిధానాలను రూపొందించేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. ఏజీఆర్ చార్జీల చెల్లింపు వల్ల సంస్థ పనితీరు దెబ్బతింటే ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని పేర్కొంది. లక్షలాది మంది వినియోగదారుల పైనా ప్రతికూల ప్రభావం ఉంటుందని చెబుతూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
పెట్రోలియం శాఖ వాళ్లు దేవుళ్లా: సుప్రీం
న్యూఢిల్లీ: పెట్రోలియం కోక్ దిగుమతులపై నిషేధం విషయమై సమయానికి స్పందించకపోవడంతో పెట్రోలియం మంత్రిత్వ శాఖపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘పెట్రోలియం శాఖ వాళ్లు దేవుళ్లా? వాళ్లకిష్టమొచ్చినప్పుడు స్పందిస్తారా? భారత ప్రభుత్వం కన్నా పెద్దదా పెట్రోలియం శాఖ? పనిలేకుండా కూర్చున్న జడ్జీలు వారికి కావాల్సినంత సమయం ఇస్తారని అనుకుంటున్నారా?’ అంటూ జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెట్రోలియం కోక్ (బొగ్గు ఆకారంలో ఉండే పారిశ్రామిక ఇంధనం) దిగుమతులపై నిషేధానికి సంబంధించి పెట్రోలియం శాఖ తన నివేదికను కేవలం ఆదివారమే తమకు సమర్పించిందని పర్యావరణ, అటవీ శాఖ కోర్టుకు చెప్పడంతో జడ్జీలు కోపోద్రిక్తులయ్యారు. పెట్రోలియం శాఖకు 25 వేల రూపాయల జరిమానా విధించి నాలుగు రోజుల్లో చెల్లించాల్సిందేనని ఆదేశించారు. -
మరోసారి రెచ్చిపోయిన ట్రంప్: దుమారం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. వలసదారులపై విచక్షణ రహిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. వాషింగ్టన్ పోస్ట్ అందించిన సమాచారం ప్రకారం అతి చెత్త(షిట్ హోల్) దేశాలనుంచి ఇమ్మిగ్రెంట్స్ అమెరికాకు ఎందుకు వస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై డెమెక్రాట్లు,ఇతర రాజకీయ ప్రముఖులు మండిపడుతున్నారు. ట్రంప్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హైతీ, ఎల్ సాల్వడార్, ఆఫ్రికన్ దేశాలనుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని బీబీసి రిపోర్ట్ చేసింది. వీరికి బదులుగా నార్వే లాంటి దేశాల నుంచి వలస వచ్చిన వారిని నియమించుకోవాలని ట్రంప్ తన సభ్యులకు సూచించారు. గురువారం ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందించిన మేరీల్యాండ్ డెమోక్రాటిక్ చట్టసభ సభ్యుడు ఎలిజా కమ్మింగ్స్ ట్వీట్ చేశారు. ఇది క్షమించరాని ప్రకటన అంటూ తీవ్రంగా ఖండించారు. ఉటా రిపబ్లికన్, కాంగ్రెస్ లో ఏకైక హైతీ-అమెరికన్ మియా లవ్ ఇవి దుర్మార్గమైన, విభజన, అహంకార పూరిత వ్యాఖ్యలని మండిపడ్డారు. వెంటనే ట్రంప్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అజెండా నిజంగా మేక్ అమెరికా వైట్ ఎగైన్ ఎజెండా అని మరోసారి రుజువైందని బ్లాక్ డెమోక్రాటిక్ శాసనసభ్యుడు సెడ్రిక్ రిచ్మండ్ విమర్శించారు. జాత్యహంకారంతో అధ్యక్షుడు ట్రంప్ మరింత దిగజారిపోతున్నారని జాతీయ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ అఫ్ కలర్డ్ పీపుల్ ఆరోపించింది. అటు వైట్ హౌస్ ట్రంప్ వ్యాఖ్యలను వెనకేసుకొచ్చింది. కొంతమంది వాషింగ్టన్ రాజకీయవేత్తలు విదేశాల కోసం పోరాటం చేస్తోంటే..అధ్యక్షుడు ట్రంప్ అమెరికన్ ప్రజల కోసం పోరాడుతున్నారని వైట్ హౌస్ ప్రతినిధి రాజ్ షా ఒక ప్రకటనలో తెలిపారు. -
ఒళ్లు దగ్గర పెట్టుకో...లేదంటే
-
ఒళ్లు దగ్గర పెట్టుకో...లేదంటే
న్యూఢిల్లీ: ఈ కామర్స్ జెయింట్ అమెజాన్ కు మరో గట్టి షాక్ తగిలింది. స్వయానా విదేశాంగ మంత్రి తీవ్ర హెచ్చరికలు జారీ చేసినా తీరు మార్చుకోకపోవడంపై తీవ్ర అగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా దేశంలోని రెండవ అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ అత్యుత్సాహంపై ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ మండిపడ్డారు. భారత గౌరవ చిహ్నాల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టేనని అమెజాన్ కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. భారత చిహ్నాలు, చిహ్నాలను గురించి వాచాలత్వాన్ని ప్రదర్శించడాన్ని ఒక భారతీయుడిగా సహించలేక పోతున్నానంటూ ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న భారత జాతీయ పతాకంతో కూడిన డోర్ మేట్స్ .. ఇప్పుడు గాంధీ బొమ్మలు ముద్రించిన చెప్పులు విక్రయంపై ఆయన స్పందించారు. మర్యాదగా ప్రవర్తిస్తే మంచిది.. లేదంటే ప్రమాదం తప్పదంటూ వరుస ట్వీట్లలో హెచ్చరించారు. అమెజాన్ భారతదేశ గుర్తులు, ఐకాన్స్ పట్ల అలక్ష్యంగా వ్యవహరిస్తోందనీ, ఇది సరైందని కాదని వ్యాఖ్యానించారు. భారతీయుల మనోభావాల విషయంలో వివక్ష చూపితే అమేజాన్ తనంతట తానే ప్రమాదం కొనితెచ్చుకున్నట్టు అవుతుందనీ.. హుందాగా వ్యవహరించాలని హెచ్చరించారు. మరోవైపు ఈ వ్యవహారంపై విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ ను ప్రశ్నించినపుడు.. డోర్ మేట్స్ వ్యవహారంపై వాషింగ్టన్ లోని భారత రాయబారి ద్వారా అమెజాన్ కు మన నిరసనను తెలియజేయాలని సూచించామన్నారు. భారతీయుల సెంటిమెంట్ ను, మనోభావాలను గౌరవించాలని ఆదేశించినట్టు తెలిపారు. కాగా హిందూ దేవతల బొమ్మలతో కూడిన డోర్ మేట్స్ వ్యవహారంలో ఇప్పటికే కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ అమెజాన్ సంస్థకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. తక్షణమే వాటి విక్రయాలను నిలిపివేసి భారత్ కు క్షమాపణ చెప్పాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా చేస్తే అమేజాన్ ప్రతినిధులకు వీసాలు కూడా ఇవ్వమని తేల్చిచెప్పారామె. దాంతో అమేజాన్ ఇండియా ప్రతినిధి దిగి వచ్చి క్షమాపణలు తెలిపిన సంగతి తెలిసిందే. Amazon,better behave. Desist from being flippant about Indian symbols & icons. Indifference will be at your own peril. — Shaktikanta Das (@DasShaktikanta) January 15, 2017 Comment on amazon was as a citizen of India as I felt strongly about it. Nothing more should be read into it. — Shaktikanta Das (@DasShaktikanta) January 15, 2017