పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు ఆ దేశ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పనామా పత్రాల కుంభకోణంలో షరీఫ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశాలిచ్చింది. షరీఫ్ కుటుంబ సభ్యులు విదేశాల్లో నల్లధనం దాచుకున్నారని పనామా పత్రాల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టాలని పాకిస్తాన్ తెహ్రీక్- ఇ- ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అన్వర్ జహీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన పాక్ సుప్రీం ధర్మాసనం.. షరీఫ్‌పై విచారణకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది.