పాకిస్థాన్ సైన్యం పెట్రేగిపోతుండటంతో సరిహద్దులు కాల్పులతో దద్దరిల్లుతున్నాయి. పాక్ సైన్యం మంగళవారం విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఎనిమిది మంది భారత పౌరులు ప్రాణాలు విడిచారు. 22 మంది గాయపడ్డారు. దీంతో భారత్ సైన్యం దీటుగా బదులిచ్చింది. మన సైన్యం జరిపిన ప్రతి కాల్పుల్లో ముగ్గురు పాకిస్థాన్ జవాన్లు ప్రాణాలు విడిచారు. సరిహద్దులకు ఆవల ఉన్న 14 పాక్ సైనిక పోస్టులు ధ్వంసమయ్యాయి.