తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టిన పారిశుద్ధ్య కార్మికులు శనివారం వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణను కలిశారు. తమ సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలంటూ వారు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై ఒంటెద్దు పోకడలు అనుసరిస్తోందన్నారు. రాజమండ్రిలో జరిగిన ప్రమాద ఘటనలు టీడీపీనే చేసిందేమోనని అనుమానం కలుగుతుందన్నారు. అటువంటి కుట్రపూరిత కార్యక్రమాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని బొత్స వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రాజమండ్రిలో ఉండగానే జరిగిన ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజధాని పేరుతో చేస్తుంది పాలన కాదని, వ్యాపారమని బొత్స ఎద్దేవా చేశారు. వ్యాపార భాగస్వామ్యం కోసం చంద్రబాబు సింగపూర్ నుంచి రాజధాని ప్లాన్ తీసుకున్నారని ఆయన విమర్శించారు.
Published Sun, Jul 26 2015 11:59 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM