ఉత్తరకొరియాతో యుద్ధంలోకి దిగేందుకు బ్రిటన్ సమాయత్తమైనట్లు రిపోర్టులు వస్తున్నాయి. అమెరికా, ఉత్తరకొరియాల మధ్య వార్ టెన్షన్స్ రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటన్ కూడా యుద్ధానికి ఆయుధ సామగ్రిని సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం బ్రిటన్ తన సరికొత్త విమాన వాహక నౌక హెచ్‌ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్‌ను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. తమ వద్ద టైప్-45 డెస్ట్రాయర్లు, టైప్-23 ఫ్రిగేట్స్ ఉన్నా.. అత్యవసరమైతే క్వీన్ ఎలిజబెత్‌ను కూడా రంగంలోకి దించుతామని మిలటరీ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది ఆఖర్లో క్వీన్ ఎలిజబెత్‌ను నేవీకి అప్పగించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌లు మాటల యుద్ధానికి తెర దించకపోతుండటమే బ్రిటన్ యుద్ధానికి సిద్ధం కావడానికి కారణమని చెప్పారు.
రంగంలోకి క్వీన్ ఎలిజబెత్..!!
Published Tue, Oct 10 2017 6:59 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement