రూ.10వేల కోట్ల నల్లధనాన్ని వెల్లడించిన వ్యక్తి పేరు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎలా తెలిసిందో చెప్పాలని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. చంద్రబాబుకు కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ చెప్పారా అని ఎద్దేవా చేశారు. ఇటువంటి వదంతులను నమ్మొద్దని అధికారులు చెబుతున్నారన్నారు. చంద్రబాబు పాలనంతా అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. సేవ చేయడానికి ఎన్టీఆర్ పార్టీ పెడితే చంద్రబాబు ధనవంతుల పార్టీగా మార్చారన్నారు. తన అవినీతి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు.