రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పటు ముసాయిదా శాస్త్రీయంగా లేదు అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. జిల్లాల ఏర్పటుపై ఏ ప్రాతిపదికన కసరత్తు చేశారో ప్రభుత్వం చెప్పలేదని శనివారం అఖిలపక్ష సమావేశం అనంతరం కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ తెలిపారు. జిల్లాల ఏర్పాటు అనేది '1974 ఏపీ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్' మార్గదర్శకాల ప్రకారం జరగాలని వారు సూచించారు. అసెంబ్లీ సెగ్మెంట్లు ఒకే జిల్లాలో ఉండాలని, అన్ని జిల్లాల్లో సగటు జనాభా ఒకేలా ఉండే విధంగా చూడాలని అన్నారు. ఈ ప్రక్రియ కోసం కొత్త జిల్లాల ఏర్పాటుపై జ్యుడీషియల్ కమిషన్ వేయాలని భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు