Districts Formation
-
'లొల్లి పోతుందని కర్ణాటకలో కలిపేసేవారే'
హైదరాబాద్: జిల్లాల విభజన నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేశారని, కర్ణాటక ఒప్పుకొని ఉంటే తన సొంత మండలాన్ని ఆ రాష్ట్రంలో కలిపేవారేమోనని టీటీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాల విభజన తర్వాత ఎవరు, ఏ జిల్లాలో ఉన్నారో అర్థం కాకుండా ఉందన్నారు. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, మండలం ఏ జిల్లాలో ఉందని ఓ విలేకరి ప్రశ్నించగా ఆయన... ‘నియోజకవర్గం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఉంది. ఇంకా నయం.. నాకు సొంత ఇల్లున్న కొడంగల్‌ను కర్నాటకలో కలిపేవారేమో. కర్నాటక ఒప్పుకుంటే నా లొల్లి పోతుందని కేసీఆర్ అదే పని చేసేవారు’ అన్నారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన వారి గురించి ప్రస్తావిస్తూ.. మొన్నటిదాకా బహిరంగంగా మాట్లాడినవాళ్లంతా ఇప్పుడు బల్లలు, చప్పట్లు కొట్టడంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పోటీపడుతున్నారన్నారు. ఇప్పుడిప్పుడే పశ్చాత్తాపపడుతున్నారని, ఏదో ఓరోజు ప్లేటు ఫిరాయించినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు. -
మరో మూడు జిల్లాలకు సీఎం గ్రీన్ సిగ్నల్
-
మరో మూడు జిల్లాలకు సీఎం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ : తెలంగాణలో మరో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నలిచ్చారు. దీంతో సిరిసిల్ల, గద్వాల, జనగామ జిల్లాల ఏర్పాటుకు లైన్ క్లియరైంది. ప్రస్తుతమున్న పది జిల్లాలకు అదనంగా మరో 20 జిల్లాల ఏర్పాటు కానున్నాయి. వరంగల్‌లో కొత్తగా 5 జిల్లాలు, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 4 జిల్లాలు, మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో 3 జిల్లాలు, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో రెండు జిల్లాల చొప్పున కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్ సిటీ ఒకే జిల్లాగా ఉండనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు అన్ని జిల్లా నేతలతో సమీక్షించారు. ఈ సమావేశాల అనంతరం మూడు జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ కేసీఆర్ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. దసరా నుంచి కొత్త జిల్లాలు ప్రారంభంకానున్నాయి. తాజా నిర్ణయంతో మూడు జిల్లాల నేతలు, ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. -
ప్రజాభిప్రాయం మేరకే జిల్లాల ఏర్పాటు.
-
'జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా ఉండాలి'
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పటు ముసాయిదా శాస్త్రీయంగా లేదు అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. జిల్లాల ఏర్పటుపై ఏ ప్రాతిపదికన కసరత్తు చేశారో ప్రభుత్వం చెప్పలేదని శనివారం అఖిలపక్ష సమావేశం అనంతరం కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ తెలిపారు. జిల్లాల ఏర్పాటు అనేది '1974 ఏపీ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్' మార్గదర్శకాల ప్రకారం జరగాలని వారు సూచించారు. అసెంబ్లీ సెగ్మెంట్లు ఒకే జిల్లాలో ఉండాలని, అన్ని జిల్లాల్లో సగటు జనాభా ఒకేలా ఉండే విధంగా చూడాలని అన్నారు. ఈ ప్రక్రియ కోసం కొత్త జిల్లాల ఏర్పాటుపై జ్యుడీషియల్ కమిషన్ వేయాలని భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ► హైదరాబాద్‌ను ఒకే జిల్లాగా ఉంచడం సరికాదని సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి తెలిపారు. అలాగే, షాద్‌నగర్‌ను శంషాబాద్‌లో కలపొద్దని అఖిలపక్షం సందర్భంగా నేతలు సూచించారు. ► జనాభా ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటు జరగాలని టీటీడీపీ నేతలు కోరారు. అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల గడువు ఇవ్వాలని నేతలు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ► అఖిలపక్ష సమావేశం సందర్భంగా బీజేపీ నేతలు రామచంద్రారావు, మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఒక అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం ఒక జిల్లాలోనే ఉండేలా జిల్లాల ఏర్పాటు ఉండాలన్నారు. అలాగే, కొత్త జిల్లాలకు కొమరం భీమ్, కొండా లక్ష్మణ్ బాపూజీ, సమ్మక్క సారక్క, జయశంకర్ పేర్లు పెట్టాలని వారు సూచించారు. ► కొత్త జిల్లాల ఏర్పాటులో గద్వాల, జనగామ జిల్లాలపై ప్రజాభిప్రాయాలను గౌరవించాలని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి కోరారు. జిల్లాల విభజన పూర్తి శాస్త్రీయంగా ఉండాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. -
'కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా ఉండాలి'
-
పునర్విభజన పేరిట గందరగోళం చేయొద్దు
► 18న జిల్లా పరిరక్షణ సమితి సమావేశం ► బీజేపీ నాయకుడు కొరివి వేణుగోపాల్ కరీంనగర్: జిల్లాలు, మండలాల పునర్విభజన పేరిట ప్రజలను గందరగోళానికి గురిచేయొద్దని బీజేపీ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ కొరివి వేణుగోపాల్ ప్రభుత్వానికి సూచించారు. కరీంనగర్లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం విభజన ప్రక్రియను చేపట్టడం మంచిదేఅయినా.. ప్రజాభీష్టానికి అనుగుణంగా జరగాలని, నాయకుల సౌలభ్యం కోసం కాకుండా పారదర్శకంగా ఉండేలా చూడాలని కోరారు. ప్రజాభిప్రాయ సేకరణలో చాలా గ్రామాల్లో విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారని, ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ అశాస్త్రీయంగా చేపడితే ద్యమాలు ఎదుర్కొవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. జిల్లాలో మంథని డివిజన్ మినహా మిగతా మండలాలన్నీ జిల్లా కేంద్రానికి అనుకూలంగా, సౌలభ్యంగానే ఉన్నాయని, తాజాగా ప్రభుత్వం జగిత్యాలతోపాటు సిరిసిల్లను జిల్లా కేంద్రంగా ఏర్పాటుచేస్తామని అనడంతో గందరగోళం నెలకొందని అన్నారు. అన్నింటికీ ఆమోదయోగ్యంగా ఉన్న జిల్లాను మూడు ముక్కలు చేసి కరీంనగర్‌కు ప్రాధాన్యత లేకుండాచేయడాన్ని తప్పుపట్టారు. మంథని డివిజన్‌ను భూపాలపల్లికి, హుజూరాబాద్ ప్రాంతంలోని కొన్ని మండలాలను వరంగల్‌కు, హుస్నాబాద్ ప్రాంతాన్ని సిద్దిపేట జిల్లాకు ఇలా ముక్కలు ముక్కలు చేసి అశాస్త్రీయంగా విభజన ప్రక్రియకు ప్రభుత్వం ఒడిగడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈనెల 18న అన్ని వర్గాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి కరీంనగర్ జిల్లా పరిరక్షణ సమితి పేరిట జిల్లాల విభజనకు వ్యతిరేకంగా భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. సమావేశంలో సిగిరి శ్రీధర్, సుజాతరెడ్డి, కొరివి వినయ్, సాయిచరణ్, రాజు, వేణు, రాంచంద్రం, తదితరులు పాల్గొన్నారు.