మరో మూడు జిల్లాలకు సీఎం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ : తెలంగాణలో మరో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నలిచ్చారు. దీంతో సిరిసిల్ల, గద్వాల, జనగామ జిల్లాల ఏర్పాటుకు లైన్ క్లియరైంది.
ప్రస్తుతమున్న పది జిల్లాలకు అదనంగా మరో 20 జిల్లాల ఏర్పాటు కానున్నాయి. వరంగల్లో కొత్తగా 5 జిల్లాలు, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాల్లో 4 జిల్లాలు, మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో 3 జిల్లాలు, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో రెండు జిల్లాల చొప్పున కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్ సిటీ ఒకే జిల్లాగా ఉండనుంది.
కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు అన్ని జిల్లా నేతలతో సమీక్షించారు. ఈ సమావేశాల అనంతరం మూడు జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ కేసీఆర్ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. దసరా నుంచి కొత్త జిల్లాలు ప్రారంభంకానున్నాయి. తాజా నిర్ణయంతో మూడు జిల్లాల నేతలు, ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.