
సీఎం చిత్రానికి 365 గోదావరి జలాభిషేకాలు
- 365 రోజు సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో అభిషేకం
- ఆపరభగీరథుడు సీఎం కేసీఆర్
- ఈబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శేఖర్‌రెడ్డి
జగదేవ్‌పూర్:సీఎం కేసీఆర్ చిత్రపటానికి గోదావరి పుష్కర జలంతో 365 రోజలు రాష్ట్రంలో వివిధ గ్రామాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, డిల్లీ పట్టణాల్లో తిరిగి అభిషేకాలు నిర్వహించామని ఈబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేశారు. 365 చివరి రోజున సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలోనే జలభిషేకం నిర్వహించామన్నారు. ఆదివారం ఎర్రవల్లి పాఠశాల అవరణలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి గోదావరి పుష్కర జలంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేపట్టి తెలంగాణ సాధించిన గొప్పనేత అన్నారు.
ఉడతాభక్తిగా గత ఏడాది జూలై 24న గొదావరి మహా పుష్కరాల సమయంలో గోదారమ్మ నీళ్లను తెచ్చి సీఎం కేసీఆర్ చిత్రపటానికి నిత్య జలాభిషేకం ప్రారంభించామని, మొదటగా ఇబ్రహింపట్నం, వనస్థలిపురం పట్టణాల్లో ప్రారంభించామన్నారు. అలా మొదలై నేడు సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో 365 రోజున ఘనంగా ముగించామన్నారు.
వందవ రోజు కూడా ఎర్రవల్లిలోనే చేశామని గుర్తు చేశారు. కార్యక్రమంలో వీడీసీ గౌరవ అధ్యక్షుడు బాల్‌రాజు, సభ్యులు సత్తయ్య, మల్లేశం, నందం, శ్రీశైలం, నవీ¯ŒS, ఉపాధ్యాయులు నరెందర్‌రెడ్డి, శశిధర్‌శర్మ, సుభాష్, కుమార్, ఈబీసీ సంఘం రాష్ట్ర నాయకులు రాజేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రంగారావు, దామోదర్‌రెడ్డి, శోభ¯ŒSబాబు, జగ¯ŒSరెడ్డి, ఆరవింద్, నాగరాజు, నవీ¯ŒSకుమార్, వెంకటేష్, శ్రీనివాస్, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ం.