ఆవుల అక్రమ రవాణా చేస్తున్న వారిపై మెదక్ సరిహద్దుల్లో పోలీసులు కాల్పులు జరిపారు. రామాయంపేట సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. 3 చెక్ పోస్టుల వద్ద వాహనాన్నిఆపకుండా వెళ్తన్న డీసీఎం వ్యానును స్థానిక పోలీసులు వెంబడించారు. వ్యానులో ఆవులను తరలిస్తున్న 8 మంది హర్యానా వాసులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రాయాయంపేట కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. దీంతో హర్యానా వాసులపై పోలీసలు కాల్పులు జరిపారు. పేట్ బషీర్ వద్ద డీసీఎంను పట్టుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ఘటనపై విచారణ జరుపుతున్నారు.
Published Thu, Jan 15 2015 2:00 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement