ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్షకు అనుమతి ఇచ్చేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆయన గురువారం ఢిల్లీలో ప్రెస్మీట్ లో మాట్లాడుతూ 'చచ్చిపోతామని దరఖాస్తు చేస్తే అనుమతి ఇవ్వాలా?. జగన్ ధర్నా చేయాల్సింది గుంటూరులో కాదు...ఢిల్లీలో. ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుందని అనుకోవడానికే ఇలా చేస్తున్నారు. రోడ్డుపై ధర్నా చేస్తానంటే చూస్తూ ఊరుకుంటామా? బస్సులు తగలబెడతామంటే అనుమతి ఇస్తామా? మీరు కూడా దీక్షలు చేశారు కదా... అని మీడియా ప్రతినిధులును ప్రశ్నిస్తూ' మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. యువభేరిలో పాల్గొన్న ప్రొఫెసర్లపై చర్యలు తీసుకుంటే తప్పేంటి? అని చంద్రబాబు ఎదురు ప్రశ్నించారు.