గ్రామజ్యోతి పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులు, కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీసీఈవోలు హాజరయ్యారు. ఈ సమావేశంలో గ్రామజ్యోతి విధివిధానాలు, అమలుచేయాల్సిన తీరు, పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై వారికి వివరించారు.